
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఈ సినిమా షూటింగ్, ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం తన స్వగ్రామంలోనే పూర్తి చేశానని రిషబ్ శెట్టి తాజాగా వెల్లడించారు. ఈ ప్రీక్వెల్ ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
Key Points
'కాంతార చాప్టర్ 1' షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ 90 శాతం రిషబ్ శెట్టి స్వగ్రామంలోనే పూర్తయ్యాయి.
సినిమాలోని సంగీతం రికార్డింగ్ కూడా గ్రామంలోనే జరిగిందని రిషబ్ శెట్టి తెలిపారు.
ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.
'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది.
‘కాంతార చాప్టర్ 1’ స్వగ్రామంలో షూటింగ్
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్ -1. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది . ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ .300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది . సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది . కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు .
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది . ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు . అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు . తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు . కాగా .. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి , జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది .
రిషబ్ శెట్టి ఇంటర్వ్యూ విశేషాలు
రిషబ్ శెట్టి మాట్లాడుతూ ..’ ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్ , ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు , కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది . మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్ గా మారిపోయింది . ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్ కు వచ్చేవి . దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్ లో ఉంచాం . కాంతార కోసమే నేను , నా భార్య , పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా ‘ అని అన్నారు .
బాక్సాఫీస్ వద్ద ‘కాంతార 1’ ప్రభంజనం
కాగా .. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది . ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది . ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్ , గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు .
మొత్తానికి, ‘కాంతార చాప్టర్ 1’ కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, రిషబ్ శెట్టి సొంత గ్రామంలోనే 90 శాతం పనులను పూర్తిచేసి, సినిమా మేకింగ్‌లో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించారు. ఇది సినిమా పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది.


