
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో ‘కాంతార’ కథకు మూలం తన గ్రామంలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన అని వెల్లడించారు.
Key Points
'కాంతార చాప్టర్ 1' తొలి రోజే రూ. 89 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది.
దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతార' కథకు మూలాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించారు.
20 ఏళ్ల క్రితం గ్రామంలో జరిగిన రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణే కథకు స్ఫూర్తి.
ప్రకృతిని కాపాడే వారి మధ్య సంఘర్షణ, వ్యవసాయ సంస్కృతి, భూతకోల నేపథ్యంలో కథ అల్లింది.
‘కాంతార చాప్టర్ 1’: బాక్సాఫీస్ వద్ద విజయం
రిషబ్ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి , నటించిన ‘ కాంతార చాప్టర్ 1’(Kantara: Chapter 1) ఇప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది . విడుదలైన తొలి రోజే ( అక్టోబర్ 2) ఈ చిత్రం రూ . 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది . వీకెండ్ లోగా రూ . 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . కాంతార మాదిరే ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ కావడం పట్ల రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు .
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు . తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు .
రిషబ్ శెట్టి: ‘కథకు మూలం నా గ్రామంలోనే’
‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘ కాంతార ’ కథకు పునాది వేసింది . వ్యవసాయ భూమి కోసం ఒక రైతు , అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది . అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు . ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను . ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను .
ప్రకృతి, వ్యవసాయం, భూతకోల నేపథ్యం
మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను . ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘ కాంతార ’ కథను రాశాను ’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు . కాంతార , కాంతార చాప్టర్ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే .
గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంఘటనలు, సంప్రదాయాలు ఎంత గొప్ప కథలకు మూలమవుతాయో ‘కాంతార’ నిరూపించింది. రిషబ్ శెట్టి తన ఊరి కథను ప్రపంచానికి పరిచయం చేసి విజయం సాధించారు.


