
కెనడాలో కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన కేఫ్‌పై ఉగ్రవాది కాల్పులు జరిగాయి. NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్జీ ఈ దాడికి బాధ్యత వహించాడు. కపిల్ శర్మ గత వ్యాఖ్యలే దీనికి కారణం అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిగాయి.
NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్జీ దాడికి బాధ్యత వహించాడు.
కపిల్ శర్మ గత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని అనుమానాలు.
బాలీవుడ్‌లో కపిల్ శర్మకు భద్రత పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కెనడాలో కలకలం
దిశ, వెబ్ డెస్క్: కెనడాలో కాల్పల కలకలం చోటు చేసుకుంది. బాలీవుడ్ కమెడియన్, ఇండియాలోనే అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కేఫ్ పై దుండగులు కాల్పులు జరిపారు. కపిల్ శర్మ ఇటీవలే కెనడాలో కేఫ్ ప్రారంభించారు. కపిల్ శర్మ విదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం ఇదే మొదటిసారి. నూతనంగా నిర్మించిన కేఫ్ పై దుండగులు కాల్పులు జరిపారు. కాగా కాల్పులు తామే జరిపినట్టు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్జి ప్రకటించాడు.
హర్జీత్ సింగ్ లడ్జి BKI (బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్) అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడు. గతంలో కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో లడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు జరగటంతో బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేఫ్ పై కాల్పులు జరపడంతో కపిల్ శర్మకు కూడా థ్రెడ్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సెక్యురినీ పెంచాలని అభిమానులు కోరుతున్నారు. అంతే కాకుండా నింధితులను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్జీ బాధ్యత
కపిల్ శర్మకు భద్రతా ముప్పు?
ఈ ఉగ్రవాద దాడి బాలీవుడ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. నిందితులను త్వరగా పట్టుకొని కపిల్ శర్మకు అవసరమైన భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు.


