|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కరీంనగర్: 21 గంటలు బావిలో మృత్యువుతో పోరాడిన మహిళ! కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం కేసు ఛేదన!

Published: 06-07-2026, 5:00 AM
కరీంనగర్: 21 గంటలు బావిలో మృత్యువుతో పోరాడిన మహిళ! కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం కేసు ఛేదన!
  • కరీంనగర్ జిల్లాలో కూలీ పని ఇప్పిస్తానని చెప్పి మహిళను కిడ్నాప్ చేసిన దుండగుడు.
  • బాధితురాలి వద్ద బంగారం, నగదు లాక్కొని బావిలోకి తోసేసిన నిందితుడు.
  • మహిళ 21 గంటల పాటు బావిలో ఉండి ప్రాణాలతో బయటపడటం అద్భుతం.
  • పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

కరీంనగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కూలీ పని పేరుతో కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం వంటి నేరాలు సమాజంలో శాంతిభద్రతలకు సవాలు విసురుతున్నాయి. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడం అభినందనీయం.

కూలీ పని పేరుతో కిడ్నాప్, దోపిడీ

కరీంనగర్ జిల్లాలో మానవత్వం మంటగలిసే దారుణ ఘటన వెలుగుచూసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఒక పేద మహిళను నమ్మించి, కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఒక గుర్తుతెలియని దుండగుడు ఆమెపై కిడ్నాప్, దారిదోపిడీ, హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆమె వద్ద ఉన్న కాస్త బంగారం, నగదును లాక్కుని, సాక్ష్యం లేకుండా చేయాలనే క్రూర ఉద్దేశంతో బావిలోకి తోసేసి పారిపోయాడు. అయితే, ఆ మహిళ అపారమైన మనోధైర్యంతో ఏకంగా 21 గంటల పాటు మృత్యువుతో పోరాడి…. ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55) అనే మహిళ ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే జూలై 1వ తేదీన సదరు మహిళను ఆమె కొడుకు సందీప్ స్థానిక కూలి అడ్డా వద్ద దించి తన పని నిమిత్తం వెళ్లిపోయాడు. ఆ సమయంలో కూలి అడ్డా వద్దకు వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి, తనకు కూలీలు కావాలని, మంచి పని ఇప్పిస్తానని లక్ష్మితో ఒప్పందం చేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన ఆమె, ఆ వ్యక్తితో కలిసి బయలుదేరింది.

ఆ దుండగుడు లక్ష్మిని నుస్తులాపూర్ గ్రామ శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి…. లక్ష్మిని బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం, కొంత నగదును బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా,,,, ఆమె పోలీసులకు చెప్తుందనే భయంతో పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దారుణంగా తోసేశాడు.

బావిలో పడిన లక్ష్మి ఎలాగోలా అక్కడ ఉన్న ఒక తాడును పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది. కానీ…. అది గమనించిన దుండగుడు… పైకి రాకుండా ఆ తాడును కూడా కత్తితో కోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిస్సహాయ స్థితిలోనూ ధైర్యం కోల్పోని లక్ష్మి బావిలో ఈదుకుంటూ, అక్కడ మోటారుకు అమర్చి ఉన్న పైపు, వైర్ ను గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటూ బావిలోనే ఉండిపోయింది.

21 గంటలు బావిలో మృత్యువుతో పోరాటం

మరోవైపు రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కొడుకు సందీప్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. లొకేషన్ నుస్తులాపూర్ గ్రామం చూపిస్తుండటంతో రాత్రంతా ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

మరుసటి రోజు ఉదయం దాదాపు 7 గంటల సమయంలో సదరు బావి వద్దకు వచ్చిన భూ యజమానికి బావి లోపలి నుంచి దీనంగా వినపడుతున్న కేకలు లీలగా వినిపించాయి. వెంటనే అతను పరిశీలించగా బావిలో మహిళ కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులందరూ కలిసి తాళ్ల సహాయంతో లక్ష్మిని సురక్షితంగా బయటకు తీశారు. దాదాపు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడిన లక్ష్మి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఛేదించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను కనిపెట్టి…. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను శనివారం కరీంనగర్ సీపీ సీపీ గౌస్ ఆలం వెల్లడించారు.ఈ కేసులో నిందితుడైన దమ్మ దినేశ్ రెడ్డి(21)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

పోలీసుల చాకచక్యంతో కేసు ఛేదన

సీపీ తెలిపిన వివరాల ప్రకారం…..నిందితుడు డియువిన్ , జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్‌కు బానిసై సుమారు రూ.4 లక్షలు నష్టపోయాడు. అదనంగా పలు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని వసూళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటుండటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పథకం రచించాడు. నేరానికి వారం రోజుల ముందే నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన నిందితుడు, జులై 1న టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న బాధితురాలిని లక్ష్యంగా ఎంచుకున్నాడు.

నిందితుడు దోపిడీ చేసిన ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మెట్టెలు కరీంనగర్ టవర్ సర్కిల్‌లోని ఓ నగల వ్యాపారికి 30,000 రూపాయలకు విక్రయించినట్టు గుర్తించారు. దోపిడీ సొత్తుతో పాటు 5 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మహిళా భద్రతకు ప్రభుత్వాలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. బాధితురాలి ధైర్యం అందరికీ ఆదర్శం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.