
📌 Key Points
- కార్తీ, ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబోలో కొత్త సినిమా ప్రారంభం.
- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది.
- హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లాంఛ్ అయ్యింది.
స్టార్ హీరో కార్తీ, ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబోలో ఓ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది.
కార్తీ – కళ్యాణ్ శంకర్ కాంబోలో భారీ ప్రాజెక్ట్
Karthi Kalyan: కార్తీ..కోలీవుడ్ లోనే కాకుండా,టాలీవుడ్ లోనూ మాంచి క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టారు.అవును..’మ్యాడ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఇప్పుడు కార్తీని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నేడు జరిగిన ప్రారంభోత్సవంలో సినిమా యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గ్రాండ్ లాంచ్
కార్తీ సరసన మీనాక్షి చౌదరి..
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మీనాక్షి, కార్తీ సరసన నటిస్తుండటం ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు పెంచేదే. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందోనన్న క్యూరియాసిటీ అప్పుడే మూవీ లవర్స్ లో కనిపిస్తుంది కూడా.
మ్యాడ్ హ్యూమర్ – కార్తీ మార్క్ యాక్షన్
మీనాక్షి చౌదరితో కార్తీ కెమిస్ట్రీ
ఇక డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే గత సినిమాలు ‘మ్యాడ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’తో సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెల్సిందే. ఇక తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో కార్తీ సిల్వర్ స్క్రీన్ పై ఎలా చెడుగుడు ఆడేస్తాడో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్‌లో కార్తీ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్.మరి ఈ ఇద్దరు కలిశారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు
ఇక ఈరోజే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా,త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుందని తెలుస్తుంది.ఇక సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.ఇప్పటికే కార్తీ నటించిన ఊపిరి, ఖైదీ వంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయ్.చూడాలి మరి నవ్వుల నజరానా ఖాయం అంటున్న ఈ కాంబో ఎలాంటి అవుట్ పుట్ ని డెలివర్ చేస్తుందో !
కార్తీ గత చిత్రాల విజయాలతో పాటు, కళ్యాణ్ శంకర్ కామెడీ మార్క్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


