
📌 Key Points
- కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్న కుట్ర బట్టబయలు!
- బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ ప్రకటన – షాక్‌లో అంతా!
- డాక్టర్‌నే నిందిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసిన జ్యోత్స్న!
- జ్యోత్స్నను నిలదీసిన కాంచన – ఏం సమాధానం చెబుతుందో చూడాలి!
కార్తీక దీపం 2 సీరియల్‌లో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్యోత్స్న బండారం బయటపడటంతో కథనం ఆసక్తికరంగా మారింది. డాక్టర్ రిపోర్ట్ ఏం చెప్పింది? కాంచన ఎలా రియాక్ట్ అయ్యింది? చూసేయండి!
డాక్టర్ షాకింగ్ రిపోర్ట్‌తో జ్యోత్స్న ఉక్కిరిబిక్కిరి!
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 26వ ఎపిసోడ్‌లో డాక్టర్ ఇవాళ రాదని నమ్మకంగా జ్యోత్స్న వెళ్లిపోడానికి ట్రై చేస్తుంది. కానీ, అంతలోనే డాక్టర్ వస్తుంది. దానికి జ్యో భయపడిపోతుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెబుతుంది. దాంతో తెలివిగా డాక్టర్‌నే నిందించి తప్పించుకుంటుంది జ్యోత్స్న.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసిన రౌడీలతో మాట్లాడి వెనక్కి తిరిగిన జ్యోత్స్నకు పారిజాతం కనిపిస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. ఎవరని అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఎవరు ఆపలేరంటున్నావ్ అని పారు అంటుంది. ఏదో అలా కౌంటర్ ఇచ్చానని చెబుతుంది జ్యోత్స్న.
తర్వాత జ్యోత్స్న రెడీ అవుతుంటే ఎక్కడికే అని అడుగుతుంది పారిజాతం. నేను ఎక్కడికి వెళ్లానో తెలియదని చెప్పు. డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని జ్యోత్స్న అంటుంది. దాంతో ఏం చేశావే అని షాక్ అవుతుంది పారిజాతం. ఇప్పుడే తెలియకపోవడం మంచిది అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న కిందకు రాగానే డాక్టర్ వస్తుంది.
నిజం బయటపడటంతో జ్యోత్స్న స్మార్ట్ ఎస్కేప్ ప్లాన్!
అది చూసి జ్యోత్స్న తెగ షాక్ అయిపోయి పైకి వెళ్తుంది. డాక్టర్ హారిక గారు వచ్చారు. జ్యోత్స్నను రమ్మనమని దీపకు శివ నారాయణ చెబుతాడు. పైకి వెళ్లి పారుతో డాక్టర్ వచ్చింది చెబుతుంది జ్యో. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ ఇవాళ వేరే సర్జరీకి వెళ్లాలి. రిపోర్ట్స్ కూడా ఇవాళ రాకూడదు. ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని జ్యోత్స్న భయంతో వణికిపోతుంది.
అయిపోయింది. ఇక దాసు కూతురులా చచ్చేంత వరకు బతకాల్సిందే అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యో కిందకు వస్తుంది. నేను రేపు రావాల్సింది. కానీ కార్తీక్ ఇవాళే రమ్మన్నారు అని డాక్టర్ చెబుతుంది. జ్యోత్స్న బాధ చూడలేక రమ్మన్నాను అని కార్తీక్ పంచ్‌లు వేస్తాడు. మీ మనవరాలి గారి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలికి మ్యాచ్ అవ్వలేదు అని డాక్టర్ చెబుతుంది.
దాంతో అంతా షాక్ అయి లేచి నిల్చుంటారు. తల్లితో మ్యాచ్ అవ్వకపోవడం ఏంటని కార్తీక్ అంటే.. రెండు మూడు సార్లు చెక్ చేశాం అని డాక్టర్ అంటాడు. అడ్డంగా దొరికిపోయామే జ్యోత్స్న అని పారిజాతం అనుకుంటుంది. మ్యాచ్ అవ్వకుంటే కన్నకూతురు కానట్లే అన్నారు అని కార్తీక్ అంటే.. అవును అని డాక్టర్ అంటుంది.
కాంచన నిలదీత: జ్యోత్స్నను ప్రశ్నించిన వైనం!
నావి అనుకుని బ్లడ్ శాంపిల్స్ వేరే వాళ్లతో కలిసిపోవచ్చు. దాని రిజల్ట్స్ ఇలా రావచ్చు అని జ్యోత్స్న అంటుంది. వీళ్లను నమ్ముకుని ట్రీట్‌మెంట్ చేయించి లాభం లేదు. మనం కెనడా వెళ్దాం. అక్కడ నా ఫ్రెండ్ ఉంటుంది. త్వరగానే మమ్మీ రికవరీ అవుతుంది అని జ్యోత్స్న అంటుంది. దేశం దాటే పారిపోవాలని స్కెచ్ వేశావ మరదలా అని కార్తీక్ అనుకుంటాడు.
జ్యోత్స్న.. హారిక గారు బెస్ట్ డాక్టర్. తప్పు జరిగి ఉండొచ్చు. కానీ మాట్లాడే విధానం ఇది కాదు. ట్రీట్‌మెంట్ ఎక్కడైనా ఇలాగే ఉంటుంది అని దశరథ్ అంటుంది. రిపోర్ట్స్ ఇచ్చి డాక్టర్ హారిక వెళ్లిపోతుంది. నా కూతురు పెళ్లి చూసే రాత లేనప్పుడు ఎవరు ఎంత తాపత్రయపడితే ఏం లాభం అని సుమిత్ర అంటుంది. దశరథ్ నచ్చ చెబుతాడు. అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు.
అలా ఎలా తెలుసు అని శ్రీధర్ అంటాడు. రిపోర్ట్స్ రాకముందే వీళ్లకు తెలుసు. పారిజాతం వాళ్లు ఎందుకు భయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే నా అన్నయ్య సొంత కూతురు జ్యోత్స్న కాదని ఎవరైనా చెబుతారేమో అనిపిస్తుంది అని కాంచన గట్టిగా నిలదీస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. జ్యోత్స్న పరిస్థితి ఏమిటో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


