
📌 Key Points
- శౌర్య, దీపలను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్! హాస్పిటల్‌లో డేంజర్ గేమ్ స్టార్ట్!
- దాసు అసలు నిజం చెప్పేందుకు రెడీ! జ్యోత్స్నకు షాకింగ్ ట్విస్ట్!
- కార్తీక్ టెన్షన్! దీపకు టెస్టులు చేయొద్దని డాక్టర్లకు సీక్రెట్ వార్నింగ్!
- దశరథ్‌కు జ్యోత్స్న వార్నింగ్! దీప స్థానం కోసం డెడ్లీ స్కెచ్!
కార్తీక దీపం 2 సీరియల్‌లో బిగ్ ట్విస్ట్! జ్యోత్స్న ప్లాన్ గురించి తెలుసుకున్న దశరథ్ షాక్! దీప, శౌర్యల ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందా? అసలేం జరగబోతుందో చూడండి!
హాస్పిటల్‌లో జ్యోత్స్న డేంజర్ గేమ్!
Karthika Deepam 2 Serial March 10th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 10వ ఎపిసోడ్‌లో దీప ఉన్న ఆస్పత్రికి శౌర్యతో వస్తాడు శ్రీధర్. నిజం తెలిస్తే తాను చనిపోయి దీపను చంపేస్తానని దాసుతో జ్యోత్స్న అంటుంది. దీపను ఎప్పుడు ఎవరు చంపుతారో ఊహించలేవని వార్నింగ్ ఇస్తుంది జ్యో. ఆ మాటలు దశరథ్ వింటాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్‌తో గైనకాలజిస్ట్ వచ్చారు, దీపకు టెస్ట్‌లు చేయాలట, మీ నాన్న, పాప వచ్చారు అని నర్స్ చెబుతుంది. శౌర్యను నాన్న ఎందుకు తీసుకొచ్చాడు అని లోపలికి వెళ్తాడు కార్తీక్.
ఇంతలో గైనకాలజిస్ట్‌తో డాక్టర్ హారిక వస్తుంది. టెస్టులు చేయాలని హారిక అంటే.. మీరు ఎన్ని టెస్టులైన చేయండి. కానీ, తల్లి బిడ్డను కాపాడండి అని శ్రీధర్ అంటాడు. తల్లి బిడ్డను కాపాడటం ఏంటీ, వద్దనుకున్నారుగా. వద్దనుకున్నాకా కాపాడటానికి ఏముంటుంది అని గైనకాలజిస్ట్ అంటుంది. వద్దనుకోవడం ఏంటని శ్రీధర్ అంటాడు.
అదే టెస్టుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు, అందుకే వద్దన్నాను అని కార్తీక్ అంటాడు. దాంతో ఏం చెప్పొద్దని గైనకాలజిస్ట్‌కు హారిక సైగ చేస్తుంది. అది శ్రీధర్ చూస్తాడు. డాక్టర్ గారు ఏదో చెబుతున్నారుగా, వద్దనుకున్నారు అనే మాట నాకు వేరేలా అర్థం అవుతుందని శ్రీధర్ అంటాడు. డాక్టర్ గారు మీరైనా చెప్పండి అని కార్తీక్ అంటే.. డాక్టర్ హారిక కవర్ చేస్తుంది.
దశరథ్‌కు జ్యోత్స్న వార్నింగ్!
మరోవైపు తనను ఎందుకు పిలిచావ్ అని, సాయం చేయాలనుకుంటున్నావా, నిజం చెప్పాలనుకుంటున్నావా అంటూ దాసుతో అరుస్తుంది జ్యోత్స్న. లేని భయాలు మోసుకుంటూ తిరుగుతున్నావ్. అలాంటివి పెట్టుకోకు అని దాసు అంటాడు. నేను నీ కూతురు కాదని చచ్చిపోయిన నీ భార్యపై ఒట్టు వేయు అని జ్యో అడిగితే.. దాసు షాక్ అవుతాడు.
నేను దశరథ్ కూతురు అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. దాన్ని అంతా నమ్ముతున్నారు. నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఇది అంతా అబద్ధం అని తెలిసి, నా వెనుక ఏదైనా చేస్తే మాత్రం అని జ్యో అంటే.. చంపేస్తావా, ఈ సారి బతకనివ్వను అంటావ్ అని దాసు అంటాడు. నేను ఎవరిని ఏం చేయను, కానీ, ఒకటి మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కలిసి దీప స్థానం నాదని ప్రూవ్ చేస్తే నేను బతకను నాన్న చచ్చిపోతాను అని జ్యోత్స్న అంటుంది.
దీప బతకాలంటే నేను బతికి ఉండాలి. నాకు ఏదైనా ప్రమాదం జరిగినా, దీప అసలైన కూతురు అని చెప్పిన దీప చచ్చినట్లే, నాకు ఏదైనా అయితే దీపను కాపాడలేరు. శివ నారాయణ మనవరాలి స్థానంలో నేనే ఉండాలి. అర్థమైందా అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. మరోవైపు డాక్టర్ అన్న మాటల గురించి కాంచనకు చెబుతాడు శ్రీధర్. కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడనిపిస్తుందని శ్రీధర్ డౌట్ పడతాడు.
ఏదైనా సరే నువ్వు తప్పు చేశావనిపిస్తుంది. కార్తీక్ ఏదైనా చెబితే వెంటనే నమ్మేస్తావ్. నిజాలు బయటపడ్డాకే తెలుస్తుంది చాలా నష్టం జరిగిందని, జ్యోత్స్న అగ్రిమెంట్ నుంచి బయటపడేందుకు ఎన్ని మార్గాలు వచ్చిన వదిలేశాడు. అక్కడ ఎందుకు ఉన్నాడో ఇప్పటికీ తెలియదు, ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా మనకు ఏదో తెలియనిది ఉంది అని శ్రీధర్ అంటాడు.
కార్తీక్ సీక్రెట్ ప్లాన్!
ఇద్దరు వాదించుకుంటారు. ఇప్పుడే నిజం చెబుతానని దశరథ అంటే.. నువ్వు చెప్పిన గంటలోపే దీపను చంపేస్తుంది. మూర్ఖులతో ధర్మంగా యుద్ధం చేయలేమని, జ్యోత్స్న చేష్టలు కూడా కిరాతకంగా ఉంటాయని, జ్యోత్స్నకు అన్ని మా అమ్మ బుద్ధులే వచ్చాయి. మనం ఏం చేసిన దీపను కోల్పోతామని దాసు అంటాడు.
నా వల్ల నా కూతురు పడిన కష్టాలు చాలు. మౌనంగా ఉన్నా కూడా ప్రమాదమే దాసు. జ్యోత్స్న ఏదో చేసేదాకా నేను ఆగలేను. నా కూతురును నేను కాపాడుకుంటాను అని దశరథ్ ఆగ్రహంగా, ఆవేశంగా వెళ్లిపోతాడు. జ్యోత్స్న మనం అనుకున్నదానికి కంటే పెద్దగా ప్లాన్ చేసినట్లుంది. నువ్వు ఏం చేస్తావో అని భయంగా ఉందని దాసు అరుస్తుంటాడు.
అత్తకు ఏం కాదు. అప్పుడు మనమంతా సంతోషంగా ఉంటాం. శౌర్యకు పెద్ద ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు మనం గ్రూప్ ఫొటో తీసుకుందాం. దానికోసం నవ్వు అని దీపకు గిలిగింతలు పెడతాడు కార్తీక్. దాంతో దీప నవ్వేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. జ్యోత్స్న ప్లాన్ ఫలిస్తుందా, దీప ఎలా కాపాడుకుంటుందో చూడాలంటే మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


