
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. సుమిత్ర గురించి దీప చెప్పిన నిజాలతో శివ నారాయణ వణికిపోయాడు. మరోవైపు, కాశీ జాబ్ డ్రామా బయటపడింది. శ్రీధర్ తీసిన ఫొటోలు కీలక మలుపు తిప్పాయి. ఈరోజు ఎపిసోడ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Key Points
సుమిత్ర ఇంట్లో ఉండటం గురించి దీప నిజం చెప్పడంతో శివ నారాయణ షాక్ అయ్యాడు.
కాశీ జాబ్‌కు వెళ్తున్నానని చెప్పి రోడ్డు మీద కబుర్లు చెప్పడం శ్రీధర్ చూసి ఫొటోలు తీశాడు.
దీప కోపంలో మాట్లాడానని శివ నారాయణ పశ్చాత్తాపపడి, దీప తన మనవరాలని అంగీకరించాడు.
జ్యోత్స్నకు చెప్పకుండా సుమిత్ర విషయాన్ని దాచిపెట్టడం వెనుక ఉన్న బాధను దీప వివరించింది.
దీప నిజం చెప్పడంతో శివ నారాయణ ఆశ్చర్యం
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 25 ఎపిసోడ్‌లో సుమిత్ర ఇంట్లో ఉండటం గురించి శివ నారాయణ నానా మాటలు అంటాడు. సుమిత్ర అత్త చనిపోతానందని కార్తీక్ చెబుతాడు. జరిగిందంతా దీప చెబుతుంది. శివ నారాయణ వణికిపోతాడు. కాశీ జాబ్‌కు వెళ్తున్నట్లు వెళ్లి రోడ్డు మీద కబుర్లు చెప్పడం శ్రీధర్ చూస్తాడు. ఫొటోలు తీస్తాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో సుమిత్ర ఉందని తెలిసి శివ నారాయణ ఉగ్రరూపం చూపిస్తాడు. కార్తీక్ , దీప, కాంచనను నానా మాటలు అంటాడు శివ నారాయణ. ఇక మిమ్మల్ని ఎప్పటికి క్షమించను. మీ సంగతి తర్వాత నేను నా కోడలిని తీసుకోపోతా అని శివ నారాయణ అంటాడు. ఆగు తాత అని కార్తీక్ అంటే.. నన్ను ఆపితే నా మీద ఒట్టే అని శివనారాయణ అంటాడు.
ముందు మీరు వెళ్లండి తాతగారు. ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్న పర్వాలేదు అని సుమిత్రతో జరిగింది అంతా చెబుతుంది దీప. సుమిత్ర ఒట్టు గురించి చెబుతుంది దీప. తనను మార్చిన తర్వాత ఇంటికి తీసుకొద్దామనుకున్నాం. అందుకే మీకు చెప్పలేదు. జ్యోత్స్నకు కూడా చెప్పలేదు. మీకు అమ్మ గురించి చెప్పకుండా మేమెంత బాధపడుతున్నామో మీకు తెలియదు అని దీప అంటుంది.
తనెవరో తెలియని చోటుకు వెళ్లిపోతానంటుంది. మన ఇంటికి ఏమైంది నాన్న. ఎవరి దిష్టి తగిలింది. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది. అన్నయ్య అలా వదినా ఇలా. ఎవరిని కాపాడుకోవాలి. మాది స్వార్థమన్నావుగా నాన్న మీ అందరిని కాపాడుకోవాలనేది మా స్వార్థమే. చేయని తప్పులకు మాటలు పడుతున్నాం అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
కాశీ జాబ్ డ్రామా బట్టబయలు చేసిన శ్రీధర్
నువ్వు కూడా నాతో రారా. నా కొడుకును కూడా మార్చాలి. దీప కోపంలో మాటలు అన్నాను ఏమనుకోకు అని శివ నారాయణ అంటాడు. నేను మీ మనవరాలు లాంటిదాన్ని ఓ మాట అంటే పడనా అని దీప అంటుంది. మనవరాలి లాంటిదానివేంటీ మనవరాలివే. ఏ తాతా నా భార్య నీకు మనవరాలు కాదా అని కార్తీక్ అంటాడు. అవునురా దీప నా మనవరాలే అని శివ నారాయణ ఒప్పుకుంటాడు.
అమ్మా కాంచన నువ్వు ఏమనుకోకు అని చేతులుపట్టుకుని చెబుతాడు శివ నారాయణ. తాత వచ్చినట్లు తెలియకూడదు. శౌర్య కు కూడా చెప్పు అని కార్తీక్ వెళ్లిపోతాడు. ఇక ఈ విషయంలో మనల్ని ఎవరు తప్పు బట్టరు అని అనసూయ అంటుంది. మరోవైపు జాబ్‌కు వెళ్లాలనుకున్న కాశీ ఫోన్ కనిపించట్లేదని కంగారు పడతాడు. స్వప్న వెతికి ఇస్తుంది.
అల్లుడు ఎందుకు అంతా కంగారుపడుతున్నాడని శ్రీధర్ అడిగితే.. బాస్‌తో మీటింగ్ ఉందట అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు సుమిత్రతో దీప, కాంచన మాట్లాడుతారు. అన్నయ్య గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అక్కడ అన్నయ కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడని కాంచన చెబుతుంది.
కుటుంబ కలహాలు, దీప భావోద్వేగ మాటలు
సుమిత్ర, దశరథ్ బంధం గురించి దీప గొప్పగా చెబుతుంది. అంతా కలిసి సమస్యకు పరిష్కారం చూడరా అని దీప అంటే.. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పనా. పరిష్కారం నాతోనే మొదలైంది. నేను ఆ ఇంట్లో ఉంటే నా భర్తకే సమస్య. ఆరోజు నేను పోయింటే బాగుండు అని సుమిత్ర అంటుంది. వదినా. చావులు గీవులు వద్దు బతికినంత కాలం సంతోషంగా ఉందాం అని కాంచన అంటుంది.
అయ్యో వదినా అలా అనకు. ఇక్కడే ఉండు. అంతా కలిసే ఉందాం. సంతోషంగా కలిసే ఉందాం అని కాంచన అంటుంది. మరోవైపు రోడ్డు మీద కాశీ ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. అది శ్రీధర్ చూస్తాడు. అల్లుడు ఏంటీ ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అడుగుదామని కాల్ చేస్తాడు. అల్లుడు నువ్వు అని శ్రీధర్ అంటుంటే ఇక్కడే ఆఫీస్‌లో ఉన్నాను అని కాశీ అబద్ధం చెబుతాడు.
ఆఫీస్‌లో చాలా బిజీగా ఉన్నాను. ఓ ప్రాజెక్ట్ గురించి మేనేజర్‌తో మాట్లాడుతున్నాను అని కాశీ అంటాడు. సరే అల్లుడు ఫ్రీ అయ్యాక మెసేజ్ చేయి కాల్ చేస్తాను అని శ్రీధర్ కాల్ కట్ చేస్తాడు. నాకు ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పానని తెలిస్తే ఘోరంగా తిడతారు అని కాశీ అంటాడు. తెలిసింది అల్లుడు. నువ్వు నాకంటే జాదు గాడిలా ఉన్నావ్. ఉండు నీ సంగతి చెబుతా అని ఫొటోలు తీస్తాడు శ్రీధర్.
మొత్తంగా, కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ భావోద్వేగాలతో నిండిపోయింది. దీప ధైర్యం, కాశీ మోసం, శ్రీధర్ చురుకుదనం సీరియల్‌కు కొత్త డ్రామాను జోడించాయి. తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.


