|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఉంగరాలు దాచేసిన జ్యోత్స్న.. పాపం పారిజాతం బలి.. లాస్ట్ లో అదిరే ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్

Published: 09-07-2025, 10:40 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఉంగరాలు దాచేసిన జ్యోత్స్న.. పాపం పారిజాతం బలి.. లాస్ట్ లో అదిరే ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కార్తీక్ సుమిత్రకు ఎంగేజ్మెంట్ రింగులు ఇవ్వడం, జ్యోత్స్న వారి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడం మరియు పారిజాతం ఇబ్బందుల్లో పడటం వంటివి ముఖ్యమైన సంఘటనలు.

Key Points

1

కార్తీక్ సుమిత్రకు ఎంగేజ్మెంట్ రింగులు ఇస్తాడు.

2

జ్యోత్స్న ఉంగరాలు దాచి, గౌతమ్ తో పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తుంది.

4

చివరిలో కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు.

ఎంగేజ్మెంట్ రింగులు మరియు జ్యోత్స్న యొక్క ప్రణాళిక

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ రింగులను సుమిత్రకు ఇస్తాడు కార్తీక్. పారిజాతాన్ని కాసేపు ఆడుకుంటాడు. అందరి ముందు పరువు తీసేస్తాడు. దీంతో దీప నవ్వుకుంటుంది. ఈ ఉంగరాలు ఎందుకు తీసుకు వచ్చావు అని కార్తీక్ ను అడుగుతుంది దీప. నువ్వేం భయపడకు, భయపడాల్సిన వాళ్లు వేరే ఉన్నారని కార్తీక్ అంటాడు.

గౌతమ్ ను రెచ్చగొట్టి దీపను చంపాలనుకున్న దాన్ని, మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయించలేనా అని కాల్ చేసేందుకు ట్రై చేస్తుంది జ్యోత్స్న . ఇంతలో సుమిత్ర తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి జ్యో షాక్ అవుతుంది. మరోసారి ఎలాంటి ఆటంకం జరగొద్దని, భద్రాచలంలో పూజలు చేయించిన ఉంగరాలు ఇవి. ఇక మీ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేరు. ఒకసారి చూసి నచ్చాయో లేదో చెప్పు అని సుమిత్ర అంటుంది. నువ్వు ఎంగేజ్మెంట్ అనగానే భయపడుతున్నావు కదూ అని సుమిత్ర అనగానే జ్యో కంగారు పడుతుంది.

నిశ్చితార్థం అంటే ఎన్నో భయాలుంటాయి. కానీ నీ పెళ్లి గౌతమ్ తో జరుగుతుంది. నువ్వు లేని పోని భయాలు పెట్టుకుని కంగారు పడకు. ముందు ఉంగరాలు ఎలా ఉన్నాయో చెప్పు అని సుమిత్ర అడుగుతుంది. మీకు నచ్చాయి కదా నాకు నచ్చినట్లే అని జ్యో అనగానే సుమిత్ర మురిసిపోతుంది. ఆ ఉంగరాలు జాగ్రత్త, మరోసారి మనవైపు నుంచి ఏ తప్పూ జరగకూడదు అని సుమిత్ర చెప్పి వెళ్లిపోతుంది. ఆ ఉంగరాలు చూస్తూ నేను అనుకున్నట్లుగా జరగాలి అని అనుకుంటుంది జ్యో.

పారిజాతం ఇబ్బందులు

ఇక గౌతమ్ తో ఫోన్లో మాట్లాడుతూ వస్తాడు కార్తీక్ . మీరు ఇంత క్లోజ్ ఎప్పుడు అయిపోయారో నాకు అర్థం కాలేదు అని శివన్నారాయణ అంటే.. వీడు మంచోడు డాడీ అని కార్తీక్ గురించి దశరథ్ చెప్తాడు. మంచోళ్లు మారిపోతారు డాడీ అంటూ మధ్యలో వస్తుంది జ్యో. నాతో ఉంగరాలు పంపించాడు కదా అవి ఎలా ఉన్నయో అడగడానికి జ్యోత్స్నకు కాల్ చేశాడంటా, కానీ ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో నాకు కాల్ చేశాడు అని కార్తీక్ అంటాడు.

మధ్యలో పారిజాతం మాట్లాడుతుంది. మా ఇంట్లో మాటలు భార్యలు వింటారు అని పారిజాతాన్ని ఇరకాటంలో పెడతాడు కార్తీక్. ఈ మాటతో పారును తిట్టేస్తాడు శివన్నారాయణ. ఉంగరాలు చేతిలో పట్టుకుని నచ్చాయి అంటే వీడియో తీసి గౌతమ్ కు పంపిస్తా అని కార్తీక్ అంటాడు. ఆ ఉంగరాలు తీసుకురా అని జ్యోకు చెప్తుంది సుమిత్ర. ఆ ఉంగరాలు లేవు మమ్మీ అని జ్యో అంటుంది. నా దగ్గర ఉంటే పోతాయని నువ్వే కదా ఉంగరాలు తీసుకుంది అని పారును మధ్యలోకిి లాగుతుంది జ్యో.

మమ్మీ నాకు ఉంగరాలు ఇచ్చిన తర్వాత నువ్వు నా రూమ్ కు వచ్చావు కదా. అప్పుడే ఇవి చాలా ఇంపార్టెంట్ రింగ్స్ నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని, నేను దాస్తానని తీసుకున్నావు అని జ్యోత్స్న అంటుంది. నువ్వే తీసేశావు అంటూ జ్యో మళ్లీ అదే మాట చెప్తుంది. నింద మనమీద వేయాలి కదా అని దీప అంటే.. మన మీద వేస్తే ఎవరూ నమ్మరు, అదే పారు అయితే మనవరాలి కోసం తిట్లు అయినా తింటుంది అని కార్తీక్, దీప గుసగుసలు పెడతారు. నువ్వు ఒక పని చేయు మరదలా అంటూ దీపకు ఏదో చెప్తాడు కార్తీక్.

కార్తీక్ యొక్క ట్విస్ట్ ఎండింగ్

ఏంటీ ఎంగేజ్మెంట్ రింగ్స్ పోయాయా? అని కార్తీక్ గట్టిగా అంటాడు. ఉంగరాలు పారేశావా? అవి మామూలు ఉంగరాలు కూడా కావు. గౌతమ్ వాళ్ల అమ్మకు సెంటిమెంట్ ఉంగరాలు. అవి పోయాయని ఆమెకు తెలిస్తే ఏమైనా ఉందా? ఎంగేజ్మెంట్ ఆపండని అంటుంది. అంటే ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదా పారు అని కార్తీక్ అంటాడు. నాకేం తెలియదు అని పారు అంటే.. నువ్వే తీశావని జ్యో చెప్తుంది. నీ ఎంగేజ్మెంట్ ఆపడానికి నన్ను బలి చేస్తున్నావా? అని పారు అనుకుంటుంది.

శత్రువులు మీకు ఇంట్లోనే ఉన్నారు అని శివన్నారాయణను రెచ్చగొడతాడు కార్తీక్. బ్రో కు కాల్ చేసి ఉంగరాలు పోయాయని చెప్తా అని కార్తీక్ అంటాడు. పదే పదే గౌతమ్ భార్య అని జ్యోకు చిరాకు తెప్పిస్తాడు కార్తీక్. ఉంగరాలు తీసుకొస్తావా? లేదా అని పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఉంగరాలు లేవంటే పెద్ద మేడం ఎంగేజ్మెంట్ ఆగినట్లే అని కార్తీక్ అంటే.. ఆగదు బావ అని దీప వస్తుంది. పారిజాతం ఉంగరాలు నాకు ఇచ్చారని బాక్స్ తీసి ఇస్తుంది. దీంతో జ్యోకు షాక్ తప్పదు.

ఉంగరాలు టెడ్డీ బేర్ లో పెడితే దీప చేతికి ఎలా వచ్చాయని జ్యో అనుకుంటుంది. దీప నీ జీవితంలో ఇంత కాస్ట్ లీ ఉంగరాలు చూసి ఉండవని నా చేతిలో పెట్టారు అని పారుతో దీప అంటుంది. పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. సుమిత్ర ఆ ఉంగరాలు నీ దగ్గరే పెట్టుకో, నిశ్చితార్థం వరకూ వాటి బాధ్యత నీదే అని శివన్నారాయణ చెప్తాడు. దీప చేతిలో నుంచి సుమిత్ర ఉంగరాలు తీసుకుంటుంది. కొన్ని జరగాలంటే కొంత బాధ భరించాలి దీప, మనం కొట్టిన దెబ్బకు జ్యోత్స్న కంగారు పడుతుంది అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిక్షణంలో కార్తీక్ చేసిన పనితో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. జ్యోత్స్న ప్రణాళికలు విఫలమయ్యాయి. పారిజాతం ఇబ్బందులు ఎదుర్కొంది. కథలో తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.