
కార్తీక దీపం 2 లో ఈ రోజు ఎపిసోడ్ లో ఆసక్తికరమైన ట్విస్టులు ఉన్నాయి. దీప కార్తీక్ ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. జ్యోత్స్న దీనితో సంతోషిస్తుంది. శివన్నారాయణ కార్తీక్ కు ఉద్యోగం అందిస్తాడు.
Key Points
దీప కార్తీక్ ఇంట్లో పనిమనిషిగా చేరడం
జ్యోత్స్న దీప రాకతో సంబరపడటం
శివన్నారాయణ కార్తీక్ కు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించడం
దీప, కార్తీక్ మధ్య మాటల యుద్ధం
దీప ఇంట్లో పనిమనిషిగా
జ్యోత్స్న ఇంటికి పనిచేయడానికి వస్తాడు కార్తీక్. అక్కడికి సడెన్‌గా దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి జ్యోత్స్న షాకవుతుంది. నన్ను కాపాడుకోవడానికే నా భర్త అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడని, నిజానికి ఆ సాయం పొందింది తాను కాబట్టి… రుణం కూడా నేనే తీర్చుకోవాలని దీప అంటుంది. సంతకం పెట్టింటి నువ్వు కాదు కదా అని పారిజాతం అంటుంది. నా భర్త నేను వేరు కాదుగా అని దీప బదులిస్తుంది.
మా ముందే నిలబడి నా భర్త అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావంటే నిన్నలేని ధైర్యం ఈ రోజు ఎలా వచ్చిందని దీపను సుమిత్ర అడుగుతుంది. నీలో ఎన్నో మార్పులు చూశాం. అందులో ఇదొకటి. కొద్ది కొద్దిగా నువ్వేంటో మాకు అర్థమవుతుందని దీపపై తన మనసులో ఉ న్న ద్వేషం బయటపెడుతుంది సుమిత్రం. భర్తను భర్త అని కాకుండా ఏమని పిలుస్తుంది సుమిత్రకు క్లాస్ ఇస్తాడు దశరథ్.
భర్తను పంపినట్లే పంపి…మళ్లీ తీసుకుపోవడానికే దీప ఈ డ్రామాలు ఆడుతుందని జ్యోత్స్న అంటుంది. దీప ను వెళ్లిపొమ్మని అంటుంది. వెళ్లిపోను ఇక్కడే ఉంటానని దీప అంటే ఏం చేస్తారని కార్తీక్ అంటాడు. మెడపట్టి బయటకు గెంటేస్తానని ఆవేశపడుతుంది పారిజాతం. ఆమెను కంట్రోల్ చేస్తాడు శివన్నారాయణ.
నీ వల్ల నష్టాన్ని చవిచూసిన వాళ్లే నీ పట్ల సానుభూతి చూపుతున్నారని, అలాంటప్పుడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడంలో అర్థం లేదని దీపతో శివన్నారాయణ అంటాడు. నీకు మాట్లాడే అవకాశం ఇస్తామని దీపకు చెబుతాడు. తన భర్త తీర్చుకునే రుణంలో సగం నేను తీర్చుకుంటానని, కార్తీక్‌తో కలిసి తాను ఇక్కడే పనిచేస్తానని అంటుంది. దీపను వెళ్లిపొమ్మని కార్తీక్ అంటాడు. మీలో సగం నేను…మీ కష్టంలో సగం నాది అని భర్తకు బదులిస్తుంది దీప.
దీప నిర్ణయం విని జ్యోత్స్న సంబరపడుతుంది. నేను బావను బాధ పెట్టేదే నీ కోసం నువ్వే ఇక్కడ ఉంటానంటే నిన్ను ఇంకా ఏడిపించొచ్చు అని సంతోషపడుతుంది. బావ పడే బాధను చూసి దీప ఏడుపును ప్రత్యక్షంగా చూడొచ్చు…ఇంకా ఏడిపించవచ్చు అని అనుకుంటుంది. దీప పనిచేయడానికి నేను ఒప్పుకోనని కార్తీక్ అంటాడు. నేను ఒప్పుకుంటానని జ్యోత్స్న బదులిస్తుంది.
సంతకం పెట్టింటి నేను అయితే నా భార్య నీకు సేవలు చేయాల్సిన అవసరం ఏంటి అని కార్తీక్ అంటాడు. దీపను ఇంట్లోకి రానివ్వడమే తప్పు అనుకుంటుంటే…తను ఈ ఇంట్లో పనిచేయడం ఏంటి అని శివన్నారాయణ కూడా ఆగ్రహానికి లోనవుతాడు. నీతో పనిచేయించుకోవడానికి మేము సిద్ధంగా లేమని, నీ మొహం చూడాలంటేనే ఇబ్బందిగా ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపో…ఈ ఇంటి చుట్టుపక్కలకు రాకు అని దీపను అవమానిస్తుంది సుమిత్ర. తల్లి మాటలతో దీప బాధపడుతుంది. ఇది మీరు ఇచ్చిన ప్రాణం…మీ రుణం తీర్చుకోకుండా ఎలా పోతుందని దీప బదులిస్తుంది.
దీప న్యాయం కోసం వచ్చింది…న్యాయమే ఆడిగింది అని జ్యోత్స్న ప్లేట్ ఫిరాయిస్తుంది. జ్యోత్స్న ప్లాన్ మార్చిందని గ్రహించిన పారిజాతం మనవరాలికే సపోర్ట్ చేస్తుంది. కానీ దీప ఈ ఇంట్లో పనిచేయడానికి వీలు లేదని శివన్నారాయణ అంటాడు. నాకు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని శివన్నారాయణకు చేతులు జోడించి దండం పెడుతుంది దీప. నువ్వే మాకు నచ్చనప్పుడు నీ మొహం చూస్తూ ఎలా ఇంట్లో తిరగడం అని శివన్నారాయణ బదులిస్తాడు.
జ్యోత్స్న సంతోషం
నువ్వు దీపను కార్తీక్ భార్య అనో, కాంచన కోడలు అనుకుంటే ఇబ్బంది ఉండదని తాతకు సలహా ఇస్తుంది జ్యోత్స్న. దీప ఇంట్లో పనిచేయాల్సిందేనని పట్టుపడుతున్న జ్యోత్స్నకు పారిజాతంతో పాటు దశరథ్ కూడా సపోర్ట్ చేస్తారు.
నీ ధైర్యానికి, సాహసానికి, భర్త మీద నీకు ప్రేమకు హృదయ పూర్వక అభినందనలు అని దీపపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. మీరు చేసే పనులకు ఓ పేర్లు ఉండాలని అంటుంది. కార్తీక్‌ను శివన్నారాయణకు డ్రైవర్‌గా నియమిస్తుంది. దీప కోసం పనిమనిషి పోస్ట్ ఒక్కటే ఇంట్లో ఖాళీ ఉందని, అదే పోస్ట్‌ను నీకు ఇస్తున్నానంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది.
జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు దశరథ్. నా మనవరాలు మంచి పోస్ట్ సజెస్ట్ చేసిందని, నచ్చడం నచ్చకపోవడం అవతలి వాళ్ల ఇష్టం అని శివన్నారాయణ అంటాడు. పనిమనిషిగా చేస్తావా అని దీపను అడుగుతుంది జ్యోత్స్న. చేస్తానని దీప బదులిస్తుంది.దీప మనసులో ఇంకేదో ఉందని కార్తీక్ అనుకుంటాడు.
శివన్నారాయణ ఇంటికి కొత్త పనిమనిషి, డ్రైవర్ వచ్చారని, ఆ స్థాయికి తగ్గట్లుగా వీళ్లను గౌరవించాలని అంటుంది. గెలుపు అంటే కప్పులను గెలవడం కాదు…వాళ్ల అంహంకారాన్ని గెలవడం అని నిరూపించావు…నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని జ్యోత్స్నను పొగుడుతాడు శివన్నారాయణ. డ్రైవర్‌ను కారు క్లీన్ చేయమని అంటాడు. కారు గడగడం వస్తుందో రాదో నువ్వే దగ్గరుండి కడిగించమని జ్యోత్స్నకు ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఈ పని మనిషిని మాత్రం నాకు ఎదురుపడొద్దని చెప్పండి అని దీపపై ఫైర్ అవుతుంది సుమిత్ర.
ఇదిగో కొత్త పనిమనిషి అంటూ దీపకు పనిచెప్పబోతుంది పారిజాతం. నేను దీపతో కొంచెం మాట్లాడాలని అంటాడు. ఓనర్‌నే ఏదిరిస్తావా అంటూ కార్తీక్ వార్నింగ్ ఇవ్వబోతుంది. నేను ఇప్పుడు డ్రైవర్‌ని…మాకు ఓ యూనియన్ ఉంది…నన్ను ఏదైనా అంటే మా యూనియన్ మొత్తం ఇంటి ముందు ధర్నా చేస్తారని పారిజాతానికి రివర్న్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. డ్రైవర్‌గా మారిన పొగరు తగ్గలేదని పారిజాతం అనుకుంటుంది.
దీపను బయటకు తీసుకెళతాడు కార్తీక్. నువ్వు ఈ ఇంటికి ఎందుకొచ్చావు…పనిమనిషిగా చేస్తానని ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. మీకు సపోర్ట్‌గా ఉండమని మీరే అన్నారుగా…సాయం చేసే మనిషిలా కాకుండా మీ కష్టం సగం పంచుకునే మనిషిలా ఉండాలని అనుకున్నానని సమాధానమిస్తుంది దీప. ఇది నా ఇల్లే కదా…ఎవరికి నేను పనిమనిషిని అయ్యాను నా వాళ్లకే కదా అని దీప అంటుంది.
నిన్ను ఈ ఇంటికి వారసురాలిగా చూడాలని అనుకున్నానని, కానీ పనిమనిషిగా కాదని కార్తీక్ బదులిస్తాడు. యజమానిగా ఉండాల్సిన మనిషి నా కోసం డ్రైవర్ అయినప్పుడు వంటలు చేసుకొని బతికే నేను పనిమనిషి అయితే తప్పేంటి దీప లాజిక్‌లు మాట్లాడుతుంది.
కార్తీక్ కు కొత్త ఉద్యోగం
మీరు ఎలాగైతే ఈ ఫ్యామిలీని కాపాడాలని అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నానని, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని అంటుంది. నీ ఆరోగ్యం అని కార్తీక్ అనగానే నా ప్రాణం పోదు మీరు పొనివ్వరు అని దీప బదులిస్తుంది. కష్టమైనా, ఇష్టమైనా కలిసే పంచుకుందాం, ఎక్కడున్నా కలిసే ఉందామని కార్తీక్‌తో అంటుంది దీప.
వీళ్లు ఎవరికి నువ్వంటే పడదని దీపతో చెబుతాడు కార్తీక్. అందరి కళ్లల్లో ద్వేషం చూశాను…ఒక్క తండ్రిలో తప్ప. సుమిత్ర దృష్టిలో దీప అంటే వాళ్ల కూతురును పెళ్లిచేసుకోబోయేవాడిని ఎగరేసుకుపోయిన మోసగత్తే… తన కూతురు నిశ్చితార్థం చెడగొట్టిన చెడ్డమనిషి…తన భర్త ప్రాణాలు తీయబోయిన నేరస్తురాలు…ఇన్ని అభియోగాలు నాపై ఉన్నప్పుడు వాళ్లు నన్ను మంచిగా చూస్తారని ఎలా అనుకుంటానని దీప అంటుంది.
బుల్లెట్ తగిలితే ప్రమాదం అని తెలిసి కూడా నాపై పగతో దశరథ్‌ను జ్యోత్స్న కాల్చింది. పెంచిన ప్రేమ జ్యోత్స్నకు లేదని, నా కన్నవాళ్లకు జ్యోత్స్న వల్ల ప్రమాదం పొంచి ఉందని, వాళ్లను కాపాడే బాధ్యత నాపై ఉందని దీప అంటుంది.
నాకు ఓ తల్లి, తండ్రి, తాతయ్య, మేనత్తతో పాటు ఆమె కొడుకుగా మీరు ఉన్నారు అని దీప ఎమోషనల్ అవుతుంది. తోడబుట్టింది కాకపోయిన జ్యోత్స్న నాకు చెల్లి అవుతుందని అంటుంది. నా కోసం పెద్ద కుటుంబం ఉందని, ఆ కుటుంబం కోసం తాను ఏదైనా చేస్తానని దీప ఎమోషనల్ అవుతుంది.
నాపై ఈ ఇంట్లోవాళ్లకు ఉన్న చెడు అభిప్రాయం మార్చాలి…నేను ఏ తప్పు చేయలేదని ఈ ఇంట్లోవాళ్లకు తెలియజేయాలని దీప అంటుంది. జ్యోత్స్న చేసిన తప్పులు తానే ఒప్పుకునేలా చేయాలని చెబుతుంది. నేను వాళ్లకు అవసరం లేకపోయినా, చీదరించుకున్నా వాళ్లు నా కుటుంబం అని తెలిసిన తర్వాత కాపాడుకోకుండా ఎలా వదిలేస్తానని దీప అంటుంది.
కష్టమైనా సరే కాపాడుకుందామని అంటుంది. మీతోనే ఉంటానని చెబుతుంది. నీ మనసు అంటే తెలిసిన తర్వాత కాదని ఎలా అంటానని కార్తీక్ బదులిస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
చివరిగా, దీప తన నిర్ణయంతో కార్తీక్ ఇంట్లో పనిచేయడానికి ఒప్పుకుంటుంది. జ్యోత్స్న దీనితో సంతోషిస్తుంది. కానీ కార్తీక్ దీప నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు.


