|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప నా పెద్దకూతురు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన సుమిత్ర.. దెబ్బకు అందరికీ మైండ్ బ్లాక్

Published: 22-09-2025, 9:41 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప నా పెద్దకూతురు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన సుమిత్ర.. దెబ్బకు అందరికీ మైండ్ బ్లాక్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్‌లో, సుమిత్ర దీపతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబంలో సంచలనం సృష్టిస్తుంది. దీప మరియు కార్తీక్ల జీవితంలో కొత్త మలుపు ఇది.

Key Points

1

సుమిత్ర దీపను క్షమించడానికి సిద్ధపడుతుంది.

2

కార్తీక్ మరియు దీప మధ్య సంబంధాలలో మలుపు.

4

సుమిత్ర తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

సుమిత్ర యొక్క అనుకోని నిర్ణయం

కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్, దీపతో సుమిత్ర ప్రేమగా మాట్లాడుతుంది. లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందామని చెప్తుంది. శ్రీధర్ భోంచేద్దామని శివన్నారాయణ పిలుస్తాడు. అన్నయ్య కోసం కాంచన పాలకోవా తీసుకుని వస్తుంది. కానీ దీపను క్షమించి, హత్తుకున్న తర్వాతే ఆనందంతో పాలకోవా తింటానని దశరథ అంటాడు. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి పాలకోవా తినిపించే వెళ్తావు. నీకో సర్ ప్రైజ్ ఉందని అంటాడు దశరథ.

అందరికీ సుమిత్ర వడ్డిస్తుంది. పారిజాతానికి డైట్ ఫుడ్ పెట్టమని చెప్తాడు కార్తీక్ . మసాలా ఫుడ్ తింటానంటే వద్దంటాడు. దీప ఇది నువ్వు నాకు నేర్పిన వంటే, ఈ కర్రీ తిను అని ప్రేమగా వడ్డిస్తుంది సుమిత్ర. ఒకవైపు భయంగా, మరోవైపు తట్టుకోలేనంత భయంగా ఉంది బావ అని కార్తీక్ తో దీప అంటుంది. ఏంటే ఇది ఎక్కడో తేడా కొడుతుందని జ్యోత్స్నతో పారు అంటుంది. అమ్మ ఏం మాట్లాడుతుందో ఏంటో అని ఆలోచిస్తూ తింటుంది దీప.

మన కథ ముగింపునకు వచ్చిందని పిలిచా. నీ మీద ఉన్న కోపానికి నీ చావు నువ్వు చావు అని వదిలేయాలి. నువ్వు పాములాంటి దానివి పెంచినోళ్లనే కాటేసే రకం. మీ అమ్మని చూస్తుంటే దీపను క్షమించి రెండు కుటుంబాలను కలిపేసేలా ఉంది. అదే జరిగితే నష్టం మనిద్దరికే ఉంది. తాళి విషయంలో ఏం చేశావో అదే అప్లయ్ చేయమని జ్యోకు చెప్తుంది పారిజాతం. దీప ప్రాణదాత అని అమ్మ ఇచ్చిన మాట దాటదని జ్యోత్స్న అంటే, దాటేలా చేయమని పారు చెప్తుంది.

దీప మరియు కార్తీక్ మధ్య సంబంధాలు

మమ్మీ నిజంగానే నువ్వు దీపను క్షమిస్తావా? అని జ్యోత్స్న అడుగుతుంది. అవును క్షమిస్తానని సుమిత్ర చెప్తుంది. ఒక మనిషిలో మనకు నచ్చనివి వంద ఉండొచ్చు. కానీ నచ్చేది ఏదో ఒకటి ఉంటుంది. ఈ వంద వదిలేసి ఆ ఒక్కటి పట్టుకుని ముందుకు వెళ్తే ఆ మనిషి మనకు నచ్చుతుంది. మనల్ని అభిమానించే చేయిని ఆహ్వానించాలి. నువ్వు కూడా మారు జ్యోత్స్న. మంచిగా ఆలోచించమని చెప్తుంది సుమిత్ర. జరిగేది చూడటం తప్పా ఏం చేయలేని పరిస్థితి అని జ్యో అనుకుంటుంది.

నా పుట్టింటి దీపానివి నువ్వు. కోడలిగా నా తల్లి బతికిన ఈ ఇంటికి ఈ తరం కోడలు నువ్వు. అన్నయ్య తండ్రితో సమానమంటారు. వదిన తల్లితోనే సమానం. నువ్వు నా కోడలిని క్షమించి గుండెలను హత్తుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నానని సుమిత్ర తో కాంచన అంటుంది. నేనూ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నా వదిన కానీ తప్పు చేసినంత సులువు కాదు కదా దాన్ని సరిదిద్దుకోవడం. సరిదిద్దుకుంటాను. జ్యోత్స్న పూజ గది దగ్గర పళ్లెం పెట్టాను తీసుకురా అని చెప్తుంది సుమిత్ర.

ఒక ముత్తైదువు అయి ఉండి మరో ముత్తైదువు మెడలో పడాల్సిన తాళి దొంగతనం చేశాను. దానికి ఇది నా ప్రక్షాళన అని దీపకు హారతినిస్తుంది సుమిత్ర. నా మేనల్లుడి ప్రాణాలు కాపాడి, జీవితాంతం ఓ నిందను మోస్తూ బాధ పడాల్సిన అవసరం లేకుండా చేశావు అందుకు ఇది కృత‌జ్ణ‌త‌. మనం క్షమాపణ చెప్పాల్సి వచ్చినప్పుడు దీపం వెలిగించి అమ్మవారి ముందు నివేదన చేస్తాం. నేను కొలిచే అమ్మవారే నీ రూపంలో వచ్చి నా మేనల్లుడిని కాపాడిందని అనుకుంటున్నా. అందుకే ఈ నివేదన అని సుమిత్ర అంటుంది.

కుటుంబంలోని విభేదాలు

తాళి తీసానని నా తప్పును ఒప్పుకొన్నా. మా వదిన క్షమిస్తేనే కానీ నా భర్త క్షమించనని అన్నాడు. మా వదినకు క్షమాపణ చెప్పాను. నా కోడలిని క్షమిస్తే నేను క్షమించినట్లేనని చెప్పింది. కుటుంబాల గురించి, మన మధ్య ఉన్న బంధాల గురించి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా. నేను దీపను క్షమిస్తున్నా. ఇంతవరకూ నీ మీద పెంచుకున్న కోపాన్ని, ద్వేషాన్ని ఇక్కడితో వదిలేస్తున్నా. ఒకప్పుడు దీప అంటే నా పెద్ద కూతురు లాంటిదని అనేదాన్ని. దీప అంటే నా పెద్ద కూతురు. ఇక మీదత మనమంతా ఒక కుటుంబంలా కలిసే ఉండాలని సుమిత్ర అంటుంది.

నీ చేతులు పట్టుకుని నీ విషయంలో చేసిన పొరపాట్లను, తప్పులను కడిగేసుకున్నానని సుమిత్ర అంటుంది. నా ముందు మీరు ఇంతలా తగ్గడం నాకు ఇష్టం లేదమ్మా. మీ గొప్పతనం నా మంచితనం కంటే వెయ్యి రెట్లు గొప్పదని దీప అంటుంది. నా ముందు నిలబడే అర్హత, స్థాయి నీకుంది. నేను క్షమాపణ అడిగే స్థాయి నీకుంది. మా కుటుంబంలో మనిషికి కలుపుకొనే గౌరవాన్ని అందుకునే స్థాయి కూడా నీకు ఉంది. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఒక పని చేయాలని సుమిత్ర అంటుంది.

నువ్వు నిజం ఒప్పుకోవాలి. నా కూతురిని చంపాలనుకునే అదే గన్ తో నా భర్తను షూట్ చేశావ్ కదా. అది నువ్వు కావాలనే చేశావని ఒప్పుకోవాలని సుమిత్ర అనగానే అందరూ షాక్ అవుతారు. అబ్బా ట్విస్ట్ అదిరిపోయింది మమ్మీ అని జ్యో అనుకుంటుంది. అసలు నువ్వు క్షమించడానికి, దీప ఒప్పుకొవడానికి సంబంధం ఏంటీ? అని కార్తీక్ అంటే, నేను ఒప్పుకుంటున్నా బావ అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సుమిత్ర తీసుకున్న నిర్ణయం కుటుంబంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. దీప మరియు కార్తీక్ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక అనిశ్చితి నెలకొంది. కథలో తదుపరి మలుపు కోసం ఎదురు చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.