
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న దాసుకు సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. ఆమె పారిజాతంపై కూడా ఒక ప్రణాళికను అమలు చేస్తుంది. శౌర్య బర్త్‌డే వేడుకలు మరియు దీప ఆరోగ్యం ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమైన అంశాలు.
Key Points
జ్యోత్స్న దాసుకు సాయం చేయడానికి అంగీకరిస్తుంది.
జ్యోత్స్న పారిజాతం పై తన ప్రణాళికను అమలు చేస్తుంది.
శౌర్య బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెను ఆశ్చర్యపరుస్తారు.
దశరథ్ సుమిత్రను వెతుకుతూ ఆమె గురించి ఆలోచిస్తాడు.
జ్యోత్స్న సహాయం
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చిన్నప్పుడు తనను కాపాడిన పాప గురించి కార్తీక్ చెప్పడంపై జ్యోత్స్న ఆలోచిస్తుంది. అత్త దీప నీ కూతురు అని చెప్పడుగా. చెప్పాలంటే తెలిసి ఉండాలి. బావ ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దాసు కాల్ చేసి కాశీ యాక్సిడెంట్ గురించి చెబుతాడు.
ఏ దారి లేక కాల్ చేశాను. శివ నారాయణకు తెలియకుండా నువ్వే కాపాడలమ్మా. నాకున్నది వాడు ఒక్కడే. నిన్ను కూతురుగా చెప్పుకోలేను. ఏదో ఒకటి చేయమ్మా అని దాసు అంటే.. నేను నా తమ్ముడిని కాపాడుకుంటాను నాన్న. నువ్వు కంగారు పడకు. విషయం ఎవరికి చెప్పకు అని జ్యోత్స్న అంటుంది. దాంతో నీ మేలు అస్సలు మర్చిపోలేనమ్మా అని దాసు అంటాడు.
కాల్ కట్ చేసిన జ్యోత్స్న తెగ సంతోషపడుతుంది. నా పెళ్లి విషయం నాకు హెల్ప్ చేయరా అంటే దీపకు చేశావుగా. ఇప్పుడు నీకు హ్యాండ్ ఇస్తా. నువ్ యాక్సిడెంట్ చేసినవాడు చస్తే నువ్వు కొన్నాళ్లు జైలులో ఉంటావు. నీకు హెల్ప్ చేయను అని జ్యో అనుకుంటుంటే పారిజాతం వచ్చి అడుగుతుంది. మనకు సాయం చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినవాడికి ఏం చేయాలి అని పారును జ్యోత్స్న అడుగుతుంది.
పోరా కుయ్యా అనాలి. మనల్నీ మోసం చేసినవాళ్లను మోసం చేయాలి అని తన మనవడికి శిక్ష పడాలని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుంది పారిజాతం. నేను మోసం చేసేది నీ మనవడినే అని తెలిస్తే నీ గుండె పట్టుకుంటావ్ అని మనసులో అనుకున్న జ్యోత్స్న పారిజాతానికే దెబ్బ వేస్తుంది. ప్రాణధాత ఎవరై ఉంటారే అని పారు అడిగితే.. బావ మాటలు నేను నమ్మడం మానేశాను అని వెళ్లిపోతుంది జ్యోత్స్న .
పారిజాతం పై ప్రణాళిక
మరుసటి రోజు ఉదయం శౌర్య అందరిపై అలుగుతుంది. తన బర్త్ డే అని ఎవరికి గుర్తు లేదని కోప్పడుతుంది. దాంతో దీప డ్రెస్, కాంచన బిర్యానీ చేసినట్లు, అనసూయ గుడిలో అర్చన చేసినట్లు, కార్తీక్ స్వీట్స్ తెచ్చినట్లు బర్త్ డే గుర్తు లేనట్లు చెబుతారు. శౌర్యకు స్వీట్స్ పెడుతూ బర్త్ డే విషెస్ చెబుతారు. గిఫ్ట్ ఏం ఇవ్వరా అని శౌర్య అంటే అడగమని కార్తీక్ చెబుతాడు.
బాగా ఆలోచించుకుని అడుగుతాను అని కూర్చోని ధ్యానం చేస్తుంది శౌర్య. మరోవైపు ఏదో వెతుకుతూ తెలియుకండానే సుమిత్రను పిలిచి అడుగుతాడు దశరథ్. కానీ, సుమిత్ర చేసింది గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. పెండ్రైవా అని సుమిత్ర అడిగితే పొరపాటుగా పిలిచాను. సారీ అని చెప్పి వెళ్లిపోతాడు. మీరు కావాలనే పిలిచారు. కానీ, మీ చెల్లి గుర్తొచ్చి ఆగిపోయారు అని సుమిత్ర అంటుంది.
తప్పు ఒప్పుకోని వాళ్లతో మాట్లడలేను అని దశరథ్ అంటే.. జ్యోత్స్న చెప్పింది నిజమేనండి. మీకు నాకంటే మీ చెల్లెలె ఎక్కువ అయిందని సుమిత్ర వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న శివ నారాయణ వచ్చి మాట్లాడుతాడు. ఎందుకు సుమిత్రను ఏడిపిస్తున్నావ్ అని అడుగుతాడు.
తను చేసిన తప్పును భర్తగా సరిదిద్దుతున్నాను. ఏం చేసిన నా చెల్లి దగ్గరికి పోవట్లేదు. తను పోనంత వరకు మనం దోషులమే. తను కన్నీరు పెడుతుంది. దీనంతటికి కారణం నా భార్య. సుమిత్రను కాంచన క్షమించడమే పరిష్కారం అని దశరథ్ వెళ్లిపోతాడు. తప్పు సరిదిద్దాలనుకునే కొడుకులను ఏమని మందలించగలం అని శివ నారాయణ అనుకుంటాడు.
శౌర్య బర్త్ డే & దీప ఆరోగ్యం
మరోవైపు బాగా ఆలోచించిన శౌర్య మీరు ఈరోజంతా నాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్లకూడదు. లీవ్ తీసుకోండి అని శౌర్య అంటుంది. అలా కుదరదు అని కార్తీక్ అంటే.. అయితే నేను మీతోనే ఉంటా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా అని శౌర్య అంటుంది. నువ్ మాతో రావద్దు అని దీప అంటుంది. కార్తీక్‌ను పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు శౌర్య అక్కడ కుదురుగా ఉండదు. కానీ, అక్కడ పరిస్థితి బాగోలేదు అని దీప చెబుతుంది.
ఇప్పుడు వాళ్లలో ఎవరు ఎలాంటి వారో శౌర్యకు తెలియదు. చిన్నప్పుడు అన్న మాట అలాగే గుర్తుండిపోతుంది. నా మీద కోపంతో మా అమ్మ శౌర్యను ఏదైనా మాట అంటే నాకు ఎలా ఉంటుంది అని దీప చెబుతుంది. పుట్టినరోజు అని చెబితేనేగా అవన్నీ జరిగేది. శౌర్య అడిగింది తల్లిదండ్రులుగా మనం చేయాలి అని కార్తీక్ అంటాడు. శౌర్య అడిగింది దీప ఒప్పుకుంటుంది.
కానీ, ఈరోజు నీ బర్త్ డే అని చెప్పకూడదు. కొత్త ఫ్రాక్ వేసుకోకూడదు అని దీప కండిషన్ పెడుతుంది. అలా ఎలా ఉంటాను అని అన్న శౌర్య తర్వాత ఒప్పుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, ఈ ఎపిసోడ్‌లో జ్యోత్స్న తన ప్రణాళికలను అమలు చేస్తుంది, శౌర్యకు బర్త్‌డే వేడుకలు జరుగుతాయి మరియు దీప ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తావించబడుతుంది. దశరథ్ గతం గురించి ఆలోచిస్తాడు.


