|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ట్రాప్‌లో పడ్డ కాశీ- గౌతమ్‌తో కార్తీక్ క్లైమాక్స్ స్కెచ్- జ్యోకి ఊహించని షాక్!

Published: 06-07-2025, 11:22 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ట్రాప్‌లో పడ్డ కాశీ- గౌతమ్‌తో కార్తీక్ క్లైమాక్స్ స్కెచ్- జ్యోకి ఊహించని షాక్!

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. జ్యోత్స్న, కాశీని తన వలలో వేసుకుంటుంది. కార్తీక్, గౌతమ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. దీప భవిష్యత్తు ఏమిటి? జ్యోత్స్న కుట్ర విజయవంతం అవుతుందా?

Key Points

1

జ్యోత్స్న కాశీని డబ్బులతో ట్రాప్ చేస్తుంది.

2

కార్తీక్, గౌతమ్‌ను జ్యోత్స్న నుంచి కాపాడాలని ప్రయత్నిస్తాడు.

4

కార్తీక్ మరియు గౌతమ్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది.

జ్యోత్స్న యొక్క కుట్ర

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్ జ్యోత్స్నకు బుద్ధిమాట చెబితే అదంతా ఇంట్లోవాళ్లకు చెబుతుంది. దాంతో ఎవరు చెప్పిన వినకుండా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అమాయకురాలేం కాదు. ఇక్కడ మనకు మరో ప్రమాదం ఉంది. నీతో ఎంగేజ్‌మెంట్ ఆపించాలంటే నువ్ మనుపటి దీపల లేవని వాళ్లు వేరే రూట్ వెతుక్కోవచ్చు అని కార్తీక్ అంటాడు.

జ్యో, పారుది క్రిమినల్ మైండ్ గొడవలు కాకుండా మామకో, అత్తకో ఎవరికో ఏమైనా అయ్యేలా చేసి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయేలా చేయొచ్చు. ఇది కుదరకపోతే గౌతమ్‌ వాళ్ల ఫ్యామిలీకి ఏదైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి నిశ్చితార్థం అయ్యేవారక మనతోపాటు ఇతరులను కాపాడుకోవాలి. జ్యోత్స్న మొదలుపెట్టిన డ్రామాతోనే తను ఎలాంటిదో బయటపెట్టబోతున్నాం అని కార్తీక్ చెబుతాడు.

గౌతమ్ నుంచి కూడా జ్యోత్స్నను కాపాడుతానని కార్తీక్ అంటాడు. మరోవైపు కాశీని జ్యోత్స్న, పారిజాతం వెళ్లి కలుస్తారు. నీకు పది లక్షలు కావాలని నాకు తెలుసు. ఎవరు నీకు ఇవ్వరు. నా దగ్గర సాయం తీసుకుంటే నీకే మంచిది. నువ్వు నేను అక్కాతమ్ముళ్లం. పది లక్షల చెక్ ఇస్తుంది జ్యోత్స్న. నేను ఈ మనిషి దగ్గర అప్పు తీసుకోను అని కాశీ అంటాడు.

అప్పుగా తీసుకోరా మధ్యవర్తిగా ఉంటాను అని పారిజాతం అంటుంది. సరే అప్పుగా తీసుకుంటా. మళ్లీ తీర్చేస్తాను. ఇవ్వడం, తీసుకోవడం ఎవరికి తెలియకూడదు. అలా అయితేనే తీసుకుంటా. అయినా కారణం లేకుండా నువ్వు ఇలా చేయవే అని కాశీ అంటే నువ్ నాకో సాయం చేయాలని జ్యోత్స్న అంటుంది. ముందు అందేంటో చెప్పమని కాశీ అంటాడు.

కాశీ పరిస్థితి

నాకు గౌతమ్ ఎలాంటివాడో తెలియదు. వాడు మంచోడో కాదో ఫాలో అయ్యి తెలుసుకుని మా అమ్మకు చెప్పాలి. గౌతమ్ ఎలాంటివాడో అని అమ్మ కంగారుపడుతుందని జ్యో అంటే పారిజాతం ఎమోషనల్‌గా అడుగుతుంది. దాంతో కాశీ ఒప్పుకుంటాడు. జ్యోత్స్న నుంచి చెక్ తీసుకుంటాడు. ఈ డబ్బు విషయం ఎవరికి తెలియదు. అలాగే, నేను చెప్పింది కూడా ఎవరికి తెలియనివ్వొద్దు అని జ్యోత్స్న అంటుంది.

తెలుసుకుంటాను. పర్సనల్‌గా నాకు నీ మీద ఏ కోపం లేదు. గౌతమ్ ఎలాంటివాడో కనిపెట్టి చెబుతాను అని కాశీ వెళ్లిపోతాడు. అలా జ్యోత్స్న ట్రాప్‌లో కాశీ పడతాడు. ఇంతకుముందు ఎంగేజ్‌మెంట్ దీప ఆపింది, ఇప్పుడు తమ్ముడు ఆపుతాడు. అది కూడా దీపపైనే వేయొచ్చు. ఇక జన్మలో దీపను ఇంట్లోకి రానివ్వరు అని జ్యో అంటుంది. మరోవైపు తన కాల్ జ్యో లిఫ్ట్ చేయట్లేదని కార్తీక్‌తో చెబుతూ చిరాకుపడతాడు గౌతమ్.

నీ మీద పడ్డ నిందలు జ్యోత్స్న మనసులో నుంచి పోలేదేమో. అది మనసులో పెట్టుకుని దూరం పెడుతుందేమో. అసలు పెళ్లి జరుగుతుందా అని చెప్పిన కార్తీక్ గౌతమ్‌కో ఏదో ప్లాన్ చెబుతాడు. ఆస్తిపోతుందని నీ బాధ. నిన్ను మాములు బకరాను చేయను అని మనసులో అనుకుంటాడు కార్తీక్. సరే నువ్వు చెప్పింది చేస్తాను అని గౌతమ్ అంటాడు. కార్తీక్‌ను హగ్ చేసుకుని నువ్వు లేకుంటే ఎలానో అని గౌతమ్ అంటాడు.

నేను నీకు ముందు ముందు ఇంకా నచ్చుతా. క్లైమాక్స్‌లో అయితే మరీను. నీ క్లైమాక్సే. పెళ్లి అంటే క్లైమాక్సేగా అని కార్తీక్ అంటాడు. కట్ చేస్తే.. ఇంటికి గౌతమ్ వచ్చి జ్యోత్స్న నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుందని అరుస్తాడు. నువ్ నా నుంచి తప్పించుకోలేవ్ అని జ్యోత్స్న అని అంటాడు. తర్వాత తను నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని సార్లు చేసిన ఇదే పరిస్థితి అని కాల్ రికార్డ్ చూపిస్తాడు గౌతమ్.

కార్తీక్ మరియు గౌతమ్ యొక్క సవాళ్లు

అసలు జ్యోత్స్నకు నేను ఇష్టమో లేదా, పెళ్లి అయినా జరుగుతుందో లేదో అడుగుదామని వచ్చాను. మా అమ్మ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో అని నన్ను చెక్ చేసుకోమంది అని గౌతమ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. గౌతమ్‌ను చూసి అవాక్కవుతుంది. నువ్ అడగాలనుకున్నవి అడుగు బ్రో అని కార్తీక్ అంటే గౌతమ్ ఏం మాట్లాడకుండా బయటకు వెళ్లిపోతాడు.

పాపం అలిగి వెళ్లిపోయాడు అని కార్తీక అంటే.. ఏంటీ అలిగాడా. అంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయినట్లేనా అని పారిజాతం సంతోషంగా నోరు జారుతుంది. తర్వాత కవర్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లారు అని శివ నారాయణ అడిగితే బ్యూటి పార్లర్‌కు అని పారు చెబుతుంది. దాంతో కార్తీక్ రెచ్చిపోతాడు. వీడు మనతో ఆడుకుంటున్నాడే. ఆ గౌతమ్ గాడిని కూడా వీడే రప్పించి ఉంటాడు అని జ్యోతో పారు మెల్లిగా అంటుంది.

నీకు గౌతమ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని శివ నారాయణ అడుగుతాడు. గౌతమ్ చెప్పినదాని గురించి అడుగుతారు. మొబైల్ సైలెంట్‌లో ఉందని అబద్ధం చెబుతుంది జ్యోత్స్న. తనకు పెళ్లి ఇష్టం లేదని నీకు చెప్పింది అని పారుని దశరథ్ అడుగుతాడు. అలా ఎవరు చెప్పారు. లేదు. దీనికి గౌతమ్ అంటే ఇష్టమే అని పారు అంటుంది.

అందరు కలిసి నన్ను ఇరికించి పడేశారు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. గౌతమ్, వాళ్ల అమ్మకు ఇంటికెళ్లి సారీ చెప్పు అని దశరథ్ అంటాడు. సరే అన్న జ్యోత్స్న మనసులో బావ, నువ్వు దీప కలిసే ఇరికించారని అర్థమైందని అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

జ్యోత్స్న యొక్క కుట్రలు ఎంతవరకు విజయవంతం అవుతాయో, కార్తీక్ మరియు గౌతమ్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాలి. దీప భవిష్యత్తు ఏమిటి?

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.