|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాంచన పౌరుషం.. దీపను బయటకు గెంటేసిన జ్యోత్స్న.. దూరంగా వెళ్లిపొమ్మన్న సుమిత్ర

Published: 04-09-2025, 1:28 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాంచన పౌరుషం.. దీపను బయటకు గెంటేసిన జ్యోత్స్న.. దూరంగా వెళ్లిపొమ్మన్న సుమిత్ర

కార్తీక దీపం 2 సీరియల్ లోని నేటి ఎపిసోడ్ ఆసక్తికరమైన ట్విస్టులతో నిండి ఉంది. కాంచన, జ్యోత్స్న మరియు సుమిత్ర పాత్రలు దీప జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. కార్తీక్ మరియు శివన్నారాయణ మధ్య సంభాషణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Key Points

1

కార్తీక్, శివన్నారాయణ మధ్య సంభాషణలో కాంచన పాత్ర

2

జ్యోత్స్న దీపను ఇంటి నుండి బయటకు పంపించడం

4

శ్రీధర్, దాసు మధ్య సంభాషణలో కార్తీక్, దీప వివాహం చర్చ

కాంచన మరియు కార్తీక్ మధ్య సన్నివేశం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్, శివన్నారాయణ కార్లో వెళ్తారు. కారు ఆపి కార్తీక్ ను జరిగిన దాని గురించి మీ అమ్మ ఏమంటుంది? మేం వచ్చేసిన తర్వాత ఏమంది? అని శివన్నారాయణ అడుగుతాడు. మీ స్వార్థం కోసమే పెళ్లి చేశారని, మీ మనవరాలి తప్పు కప్పి పుచ్చుకోవడం కోసమే కానీ కూతురిపై ప్రేమ లేదని అని కార్తీక్ చెప్తుంటే శివన్నారాయణ ఆపుతాడు. ఇవి మీ మాటలా? మీ అమ్మ మాటలా అని శివన్నారాయణ అంటే.. తల్లి కాంచనకు కాల్ చేస్తాడు కార్తీక్.

నిన్న జరిగింది నువ్వు మర్చిపోయినట్లే కదా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. ఎలా మర్చిపోదాం రా? వాళ్లు విషం దాచుకుని బతుకుతున్నారని కాంచన అంటే.. తాత ఏ తప్పు చేయలేదు కదా అని కార్తీక్ అంటాడు. మా నాన్న తప్పు చేయకపోవడం ఏంటీ? ఆయన అర్థం లేని ఆవేశమే అన్ని అనార్థాలకు కారణం. మా అన్నయ్య తండ్రి, భార్య మధ్యలో నలిగిపోతున్నాడు. నాకేమో నాన్న మీద ప్రేమ ఉంది. కానీ నాన్నకే నా మీద ప్రేమ లేకుండా పోయింది. జరిగింది కూడా మర్చిపోలేను. అది ఇల్లు కాదురా పాము పడగ అని కాంచన అంటుంది.

మాటల్లో ఘాటు ఎక్కువైంది కదా అని కార్తీక్ అంటే.. అలా మాట్లాడకపోతే అది శివన్నారాయణ రక్తం ఎలా అవుతుంది అని శివన్నారాయణ చెప్తాడు. ఆ మాత్రం పౌరుషం ఉండాలంటాడు. మరోవైపు కావేరీతో శ్రీధర్ పెళ్లయిన మగాడి గురించి చెప్తుంటాడు. పెళ్లాన్ని గెలిస్తే చాలు ప్రపంచాన్ని గెలిచినట్లు అని అంటాడు. ఏదీ కలిసి రావడం లేదు జ్యోతిష్యం చూపించుకోవాలి. దాసు ఎదురు పడినా పలకరించను అని శ్రీధర్ అంటుండగానే బావ నమస్తే అని దాసు ఎంట్రీ ఇస్తాడు.

కార్తీక్ లాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం బావ. నిన్న జరిగింది మర్చిపోలేదా బావ? అందరం కలిసి ఉండటం మంచిదే కదా అని దాసు అంటాడు. ఇలా అని నీ కొడుకు నా కూతురిని తగులుకున్నాడు. నా కొడుకు దీపను తగులుకున్నాడని శ్రీధర్ చెప్తాడు. దీప గొప్పతనం నీకు ఇప్పుడే తెలియదు బావ. కార్తీక్ దీపను పెళ్లి చేసుకుని మంచి పనే చేశాడంటాడు దాసు. ఏ తల్లి, తండ్రి పేరు చెప్పుకోలేని దీపను పెళ్లి చేసుకున్నాడు కార్తీక్ అని శ్రీధర్ అంటాడు.

దీప ఇంటి నుండి బహిష్కరణ

కార్తీక్ పెళ్లి సవ్యంగా జరిగితే శ్రీశైలం వస్తానని మొక్కుకున్నా. చెల్లెమ్మ ముడుపు ఇస్తాను రమ్మందని దాసు అనగానే, కావేరీ ముడుపు తీసుకొచ్చి ఇస్తుంది. శౌర్యకు తమ్ముడు పుట్టాలని మొక్కుకున్నానని కావేరీ అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. అంటే నా కొడుక్కి, దీపకు కొడుకు పుట్టాలని అనుకుంటున్నావా? నా కొడుక్కి పుట్టబోయే పిల్లలకు దీప తల్లి ఏంటీ? అని శ్రీధర్ ప్రశ్నించాడు. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బ్రతుకు అని దాసు వెళ్లిపోతాడు.

నా కొడుక్కి, దీపకు పిల్లలు పుడితే దీప పోస్టు పర్మినెంట్ అవుతుంది. ఈ లోపు ఎలాగోలా దీపను తరిమేయాలని శ్రీధర్ అనుకుంటాడు.

మరోవైపు నా చెల్లెలి కుటుంబానికి సారీ చెప్పడమే ఈ సమస్యకు పరిష్కారమని సుమిత్ర తో దశరథ అంటాడు. మమ్మీ సారీ చేప్పదు డాడీ. అలా జరిగితే అత్త ముందు మమ్మీ పరువు పోయినట్లే అని జ్యోత్స్న అంటుంది. ఆ మాటలు దీప వింటుంది. తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ దీప గురించి మమ్మీతో గొడవ పడతావా? ఇదెక్కడి న్యాయం డాడీ. ఇది స్వార్థం కాదా? అని జ్యో అంటుంది. కాదు, నా చెల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతున్నప్పుడే ఆపేవాణ్ని అని దశరథ అంటాడు.

పక్షపాతమే అయితే చెల్లికి సగం వాటా ఆస్తి రాయాలని పట్టుబట్టేవాణ్ని. నా భార్య చేసిన తప్పుకు నా చెల్లి ఏడుస్తుంది. వదిలేసే మనిషిని కాదు. నాకు అందరూ కావాలనే స్వార్థం, పక్షపాతం నాది. నా భార్య తప్పు చేసింది. తప్పయితే సరిదిద్దుకోవాలి కదా. నా భార్య ఒకప్పటిలా లేదు. భర్తగా సరిచేయాల్సిన బాధ్యత నాకుంది. సారీ చెప్పడమే పరిష్కారం. నా చెల్లి కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించలేను. కనీసం నీతో మాట్లాడలేను. నీ మొహం చూసినా తప్పే గుర్తొస్తుందని దశరథ షాక్ ఇస్తాడు.

శ్రీధర్, దాసుల మధ్య వివాదం

హ్యాట్సాఫ్ డాడీ దీప ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తావు. కానీ మమ్మీ చేసిన పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా? అని జ్యో అడిగితే, ఇది పొరపాటు కాదు పాపం అని దశరథ చెప్తాడు. అప్పుడే దీపను చూసి శిక్ష వేయాల్సింది అక్కడ నిలబడి ఉన్న దీపకు డాడీ. మమ్మీకి కాఫీ ఎందుకు తీసుకొస్తుంది? అని కప్పు నేలకేసి కొడుతుంది. సమస్య నీతోనే పరిష్కారం కావాలని దీపను లాక్కెళ్లి బయటకు గెంటేస్తుంది.

దీప వల్ల ఏ తప్పు జరగలేదని దశరథ అంటే, దీప అడుగుపెట్టడంతోనే తప్పులు జరుగుతున్నాయని సుమిత్ర అంటుంది. నా భర్త ముందు సమాధానం చెప్పలేని స్థితిలో నిలబడ్డానంటే కారణం నువ్వే. నీ కన్నతల్లి పాపాన్ని కన్నది. మా కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లు. చంటిబిడ్డతో ఎక్కడికి పోతుందని చేరదీశా. ముందు ఆడబిడ్డ కుటుంబాన్ని దూరం చేశావు. ఇప్పుడు నా కుటుంబాన్ని దూరం చేశావు. నేనే ఎవరూ లేని అనాథగా మిగిలిపోయానని సుమిత్ర అంటుంది.

నువ్వు తప్పు చేశావు, దాన్ని ఒప్పుకొనే తీరాలని దశరథ అంటాడు. దీప మిమ్మల్ని షూట్ చేసింది. గౌతమ్ మంచివాడని చెప్పింది. కానీ చెడ్డవాడని తెలిసి తప్పు ఒప్పుకొందా అని దీపను నెట్టేస్తే వెెనకాల కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో దీప జీవితంలో కష్టాలు పెరిగేలా కనిపిస్తుంది. కాంచన, జ్యోత్స్న, సుమిత్ర వంటి పాత్రలు దీప జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.