|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప నీ కూతురే అని దశరథ్ కు చెప్పిన కార్తీక్..జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్.. దీపకు జ్యో సారీ

Published: 26-06-2025, 10:40 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప నీ కూతురే అని దశరథ్ కు చెప్పిన కార్తీక్..జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్.. దీపకు జ్యో సారీ

కార్తీక దీపం 2 సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో కాంచన ప్రమాదానికి గురవుతుంది. కార్తీక్, దీప, జ్యోత్స్నల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కార్తీక్ షాకింగ్ వెల్లడితో ఎపిసోడ్ ముగిసింది.

Key Points

1

కార్తీక్ దీప నీ కూతురని దశరథ్ కు వెల్లడించాడు.

2

జ్యోత్స్న ప్రవర్తనపై కార్తీక్, శివన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

4

జ్యోత్స్న తన తప్పుకు దీపకు క్షమించింది.

కాంచన ప్రమాదం

కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో వీల్ చెయిర్ లో నుంచి కిందపడిపోయిన కాంచనకు ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందిస్తారు. డాక్టర్ వచ్చి చికిత్స ఇస్తుంది. దశరథ్, అనసూయ దగ్గరే ఉంటారు. నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ అనసూయ బాధ పడుతుంది. ఇలా జరుగుతుందని తెెలియదు కదా అని దశరథ్ అంటాడు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లి, స్కానింగ్ చేయిద్దాం అని దశరథ్ అంటే.. అవసరం లేదని డాక్టర్ చెబుతుంది.

కార్తీక్, దీప ఎందుకు రాలేదు అన్నయ్య అని దశరథ్ ను అనసూయ అడుగుతుంది. నా కూతురు చేసిన పని ఎలా చెప్పాలి అంటూ మనసులోనే మదనపడుతుంటాడు దశరథ్. జరిగింది కార్తీక్ కు తెలిస్తే జ్యోత్స్నను ఎప్పటికీ కార్తీక్ క్షమించడు అని మనసులో అనుకుంటాడు దశరథ్.

మరోవైపు రెండు గంటల పాటు కార్లో తిప్పుతున్నారంటూ జ్యోత్స్న పై కోప్పడతాడు కార్తీక్. ఇంటికి రాగానే నాకు చెప్పకుండా బయటకు ఎందుకు వెళ్లావు బావ అని దీప అంటుంది. కాంచన కింద పడిపోయిందనే నిజాన్ని కార్తీక్ కు చెప్తుంది దీప. జ్యోత్స్న మీ దాకా రానివ్వలేదు అని అంటుంది. మిమ్మల్ని కలవనివ్వలేదు. అప్పటికే పిలిచినా వెళ్లిపోయావని చెప్తుంది.ఇంటికెళ్దాం పదా అని కార్తీక్ అంటే.. అత్తయ్య కోసం మా నాన్న వెళ్లారు అని దీప చెప్తుంది. ఇటు కాంచన కళ్లు తెరుస్తుంది. కార్తీక్ ఎక్కడా అని కాంచన అడిగితే.. ఏం చెప్పాలో అర్థం కాక దశరథ్ ఆలోచిస్తాడు.

అప్పుడే దశరథ్ ఫోన్ మోగుతుంది. వీడియో కాల్ లో అమ్మతో మాట్లాడతాడు కార్తీక్ . మా అన్నయ్య వచ్చాడు కదా, మీరు ఏం కంగారు పడకండి, మా అన్నయ్య వస్తే నాకేం అవుతుంది అని కాంచన అంటుంది.తలకెందుకు అంత పెద్ద కట్టు కట్టారు అని కార్తీక్ అడిగితే చిన్న దెబ్బే అని చెప్తాడు దశరథ్. నా కూతురు చేసిన పనికి నేను సారీ అడుగుతున్నా అని దశరథ్ అంటే.. నువ్వుందుకు సారీ అడగడం అని కార్తీక్ చెప్తాడు. సరదాగా ఏడిపించడానికి, ప్రాణాలతో చెలగాటం ఆడటానికి తేడా తెలియదా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. అక్కడ జరిగింది కాంచనకు చెప్పలేదు మిమ్మల్ని రాకుండా నా కూతురు ఆపిందని తెలిస్తే నా మేనకోడలు మరి ఇంత నీచురాలా అని తట్టుకోలేదు అని దశరథ్ అంటాడు.

జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలని

కార్తీక్-దీప చర్చ

ఏమైనా చేసి జ్యోత్స్నను దారిలోకి తీసుకురా అని కార్తీక్ కు చెప్తాడు దశరథ్. దీప ఎలా ఉంటుందో జ్యోత్స్నను అలా చూడాలనుకుంటున్నా అని దశరథ్ అంటాడు. అది జరగదు మామయ్య ఎందుకంటే దీపే నీ కూతురు అని నిజం చెప్పేస్తాడు కార్తీక్. నీ కూతురు దీపలా కాలేదు అనబోయి అలా అన్నాను అని మళ్లీ కవర్ చేస్తాడు. నువ్వు ఎలా అన్నా నాకు పర్లేదు ఎందుకంటే దీప నా కూతురు లాంటిదే అని దశరథ్ అంటాడు.

మామయ్యకు అల్లుడు ఉన్నాడు, నీకేం కాదు అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు ఆవేశపడకు బావా అని కార్తీక్ ను కూల్ చేస్తుంది దీప. ఇక కార్తీక్ చెప్పు తీసి కొడతాడు అంటూ జ్యోతో పారిజాతం అంటుంది. కార్తీక్ కోపంతో రాగానే నాకేం తెలియదు అని పారు చెప్తుంది. జ్యోను కార్తీక్ కొట్టబోతుంటే దీప పిలుస్తుంది. జుట్టులో ఏదో ఇరుక్కుంటే లాగేయాలని కార్తీక్ వెటకారం చేస్తాడు.

మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది రోజురోజుకూ రౌడీల్లా మారిపోతున్నారు ఏదో ఒక రోజు గట్టిగా తన్నులు తింటారు అని ఇండైరెక్ట్ గా అంటాడు కార్తీక్. ఎవరిని రా అంటున్నావ్ అని పారు అడిగితే.. మానవత్వం లేని మనుషుల గురించి అని చెప్తాడు కార్తీక్. మనం చేసింది అంతకుమించిన పాపాలు కదా అని కార్తీక్ అంటాడు. బావకు దీప ఈ ఇంటి వారసురాలు అని తెలిసిపోయినట్లే మాట్లాడుతున్నాడు అని మనసులో జ్యో అనుకుంటుంది.

కార్తీక్ బాబు వదిలేయండి ప్లీజ్ అని దీప అడిగితే కొందరిని ఊరికే వదిలేయొద్దు చేసిన పాపాలు వదిలేయవని అంటాడు కార్తీక్. పాపాలు చేయడం మా ఇంటా వంటా లేదు అని పారు అంటుంది. నర్సమ్మ నా ఫ్యామిలీ సేఫ్, ఆ ముక్క తలతిక్కలదానికి చెప్పు అంటూ గాల్లోకి చూసి మాట్లాడతాడు కార్తీక్. మన గురించి తెలిసిపోయిందా అని జ్యో, పారు భయపడతారు.చిన్న మరదలకు పట్టిన దెయ్యం వదలగొడతాను కదా అని జ్యోను ఉద్దేశించి దీపతో అంటాడు కార్తీక్.

ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లావు అని దశరథ్ ను శివన్నారాయణ అడిగితే.. దశరథ్ కు థ్యాంక్యూ చెప్తారు కార్తీక్, దీప. నువ్వేం చేశావు అని దశరథ అని అడుగుతాడు శివన్నారాయణ. అప్పుడు జరిగింది ఇలా చెప్తాడు కార్తీక్.. మాదో చిన్న కుటుంబం సార్. మా ఆవిడ, నేను డ్యూటీకి వచ్చాం. కూతురు స్కూలుకు వెళ్లింది. పెద్దమ్మ కూరగాయలకు వెళ్లింది. ఇంట్లో లేచి నడవలేని అవిటి తల్లి పొరపాటున చక్రాల కుర్తీలో నుంచి కింద పడిపోయింది. తలకు దెబ్బ తగిలింది. ఎవరూ లేని స్థితిలో ప్రాణం పోతుందేమో అని ఫోన్ చేసింది. కానీ నా ఫోన్ భార్య దగ్గర ఉంది, ఆ విషయం చెప్దామని వస్తే జ్యోత్స్న మేడం అడ్డుపడ్డారు. వెళ్లడానికి వీల్లేదన్నారు. అప్పటికీ నా భార్య చెెప్పినా చెప్పింది నమ్మలేదు.

జ్యోత్స్న ప్రవర్తన

అవతలి వాళ్ల ప్రాణాలు పోయినా పర్వాలేదని పెద్ద మేడం అనుకుందేమో. నా భార్యను ఇంటికి వెళ్లనివ్వలేదు. ఆ సమయానికి దేవుడిలా అంతా విన్న చిన్న సారు, వాళ్ల చెల్లిని సారీ మా అమ్మను కాపాడటానికి వెళ్లారు. మా అదృష్టం బాగుండి అమ్మకు ఏం కాలేదు అని కార్తీక్ చెప్తాడు. దీప చెప్పింది అబద్ధం అనుకున్నా అని జ్యో అంటే శివన్నారాయణ ఊగిపోతూ లేస్తాడు.

తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తే నమ్మకపోవడానికి నువ్వెవరు? అని శివన్నారాయణ కోప్పడతాడు. సమర్థించుకోవడానికి చూస్తే చెంప పగులుతుంది అని సుమిత్ర కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనిషిగా నీకు బాధ్యత ఉందా లేదా? మన నమ్మకాలు అవతల వాళ్ల ప్రాణాలు తీసేలా ఉండకూడదు అని శివన్నారాయణ అంటే.. అలాగే ఉన్నాయి అని కార్తీక్ బాధపడతాడు.

సమయానికి దశరథ్ గారు అక్కడికి వెళ్లి డాక్టర్ ను తీసుకొచ్చి ట్రీట్ మెంట్ చేయించారు కాబట్టి సరిపోయింది అని కార్తీక్ అంటాడు. వర్కర్లతో పని చేయించుకోవాలి కానీ ప్రాణాలు తీయకూడదు, ప్రాణం విలువ తెలిసినవాళ్లే కదా అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఎంత డ్రైవర్ తల్లి అయితే మాత్రం ఆవిడకు ఓ కుటుంబం ఉంటుంది ఆప్యాయంగా చూసుకునే అన్న, నాన్న, వదిన ఉంటారు. కానీ కొంతమందికి పంతాలు, పౌరుషాలే ముఖ్యం. మనుషులు మట్టిలో కలిసిపోయినా పంచిన రక్తం మాత్రం మారదు అని కార్తీక్ అంటాడు.

మా వైపు నుంచి తప్పు జరిగిపోయింది క్షమాపణ చెప్పాల్సిందే అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నను సారీ చెప్పమంటాడు. అహంకారం తన్నుకొచ్చింది, మానవత్వం చచ్చింది అంటూ జ్యోపై ఊగిపోయాడు శివన్నారాయణ. జ్యోత్స్నకు చెప్పాల్సిన వాళ్లతో చెప్పిస్తేనే మారుతుంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్. కాంచనకు ఇప్పుడు బాగానే ఉంది అని దశరథ్ చెప్తే.. నేను అడగలేదు కదా అని శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ గద్దిస్తే సారీ దీప అని జ్యో చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్ లో కార్తీక్ చేసిన వెల్లడితో కుటుంబంలో ఒక కీలక మలుపు వచ్చింది. జ్యోత్స్న తన తప్పులను గ్రహించి క్షమాపణలు చెప్పడం కథనంలో ముఖ్యమైన అంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.