|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పోలీసుల ముందే రెచ్చిపోయింది.. సోషల్‌ మీడియాలోనూ చిందులు.. చివరకు..!

Published: 12-06-2025, 11:04 AM
పోలీసుల ముందే రెచ్చిపోయింది.. సోషల్‌ మీడియాలోనూ చిందులు.. చివరకు..!

హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌లో నటి కల్పిక గణేష్ గొడవ పాల్గొని, పోలీసుల ముందు రెచ్చిపోయింది. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Key Points

ప్రిజం పబ్‌లో గొడవ

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనేది ఒకప్పుడు అవివేకంతో జరిగేది.. ఇప్పుడు అతి తెలివితో జరుగుతోంది. ఆ అతి తెలివి ఎలాంటిది అంటే… వైరంతోనే వైరల్‌ అవుతామనే అపోహ కల్పిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో అవాంఛనీయ ప్రచారాన్ని తెచ్చుకుంటున్న సెలబ్రిటీలు ఎందరో కనిపిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు చుట్టాలున్నారు జాగ్రత్త అనేది సినిమా తీశారు గానీ చట్టాలున్నాయి జాగ్రత్త అనే సినిమా కూడా ఎవరైనా తీసి వీళ్లకి చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.

ట్రెండింగ్‌లో కల్పిక అది అలా ఉంచితే… సినీ నటి కల్పిక ( Kalpika Ganesh ) అనగానే ఒకప్పుడు అయితే ఎవరామె? అని అడిగినవాళ్లే ఎక్కువ. అయితే ఇప్పుడు మాత్రం ఓహో ఆ అమ్మాయా? పబ్‌లో గొడవపడింది ఆమెనా? అని వెంటనే గుర్తుపడుతున్నారు. మరి ఇలాంటి ప్రచారం ఆమె కెరీర్‌కు ఎంతవరకూ ఉపకరిస్తుందో ఆమెకే తెలియాలి కానీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం ఉపకరించదని పోలీసులు తమ చర్యల ద్వారా తేల్చి చెప్పారు.

కల్పికపై పోలీసుల చర్య

చిలికి చిలికి గాలివానలా.. హైదరాబాద్‌ నగరంలో ప్రిజమ్‌ పబ్‌ అంటే తెలియని పార్టీ ప్రియులు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే వందకు పైగా పబ్స్‌ ఉన్న సిటీలో టాప్‌ 5 ప్లేస్‌లో ఉంటుంది. అలాంటి చోటకి వెళ్లి తాను సెలబ్రిటీని కాబట్టి బర్త్‌డే కేక్‌ తనకు కాంప్లిమెంట్రీ ఇవ్వాలని అడగడం, దానికి తాము ఒప్పుకోకపోవడంతో  కల్పిక గొడవ సృష్టించారని పబ్‌ సిబ్బంది ఆరోపణ… ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడం కన్నా కల్పిక తన ఇంటర్వ్యూల ద్వారా సోషల్‌ వేదికలపై హల్‌ చల్‌ ద్వారా మరింత రచ్చ చేసింది అనడం సబబుగా ఉండొచ్చు.

కల్పికపై కేసు ఆ వివాదం ద్వారా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది కల్పిక. దాదాపుగా ఓ వారం రోజుల పాటు ఆ వివాదం సజీవంగా ఉండేలా తన వంతు సఫలయత్నం చేసిందామె. ఏమైతేనేం.. జనం కొత్త వివాదాల అన్వేషణలో తలమునకలవడంతో ప్రస్తుతం కల్పిక వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే పబ్‌లో గొడవను సామరస్యంగా పరిష్కరిద్దామని తాము చూస్తే ఆ సందర్భంగా కల్పిక తమపై వీరంగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న పోలీసులు మాత్రం విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు. పకడ్బందీగా కేసు తయారు చేసి కల్పికను బుక్‌ చేసేశారు. గత నెలాఖరులో ప్రిజం పబ్‌లో అల్లర్లు సృష్టించిందనే ఆరోపణలతో నటి కల్పిక గణేష్‌పై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సోషల్ మీడియాలో రచ్చ

పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన బ్యూటీ పబ్‌లో గొడవ జరుగుతుందనే సమాచారం మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తమ సమక్షంలోనే నటి పబ్‌ సిబ్బందిని దుర్భాషలాడిందని కేసు పెట్టారు. అంతేకాక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు నుంచి పోలీసులు అనుమతి కోరారు. అనంతరం గురువారం కోర్టు అనుమతి పొందిన తర్వాత పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో.. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని కల్పికకు పోలీసులు రేపో మాపో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కల్పిక ఇకపై ఎలా ముగించబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.

కల్పిక గణేష్ పబ్‌లో గొడవ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదం తో పోలీసుల కేసు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.