|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిక్కుల్లో నటి కల్పిక… మరో కేసు నమోదు

Published: 14-06-2025, 6:20 AM
చిక్కుల్లో నటి కల్పిక... మరో కేసు నమోదు

టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై మరో కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించిందనే ఆరోపణలతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఇది కల్పికకు మరో పెద్ద ఎదురుదెబ్బ.

Key Points

1

టాలీవుడ్ నటి కల్పికపై సైబర్ క్రైమ్ కేసు నమోదు.

2

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించింది అనే ఆరోపణ.

4

ఇప్పటికే ప్రిజం పబ్ వివాదంలో కూడా కల్పికపై కేసు నమోదు అయింది.

సైబర్ క్రైమ్ కేసు నమోదు

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ కు ( Kalpika Ganesh) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కల్పికపై మరో కేసు తాజాగా నమోదయింది. పలు సెక్షన్ల కింద నటి కల్పికపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ( Hyderabad Cyber ​​Crime) పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ( Instagram account) అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి… బండ బూతులు తిట్టింది అంటూ బాధితురాలు కీర్తన ( Keerthana) ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పదజాలం

ఆన్లైన్ అబ్యూజింగ్ తో (Online abuse ) పాటు వేధింపులకు కూడా పాల్పడిందని కల్పికపై సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు కీర్తన. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడం తో పాటు బాధితురాలికి మెసేజ్ పెట్టి వల్గర్ గా కూడా మాట్లాడిందట కల్పిక. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నిటిని పోలీసులకు ఇచ్చి పెట్టారు బాధితురాలు కీర్తన.

ప్రిజం పబ్ వివాదం తర్వాత మరో కేసు

ఈ నేపథ్యంలోనే ఆధారాలన్నిటిని పరిశీలించి సినీ నటి కల్పిక పై మరో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే ప్రిజం ( Prism Pub) క్లబ్ వ్యవహారం పై కూడా నటి కల్పికపై కేసు నమోదు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. పుట్టినరోజు కేకు విషయంలో పబ్బు నిర్వాహకులు, నటి కల్పికా మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… కేసు బుక్ అయింది. ఇక లేటెస్ట్ గా మరో మహిళ ఫిర్యాదు చేయడంతో నటి కల్పిక పై కేసు నమోదు చేశారు పోలీసులు.

సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడినందుకు నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఉన్న కేసులతో కలిపి ఇది ఆమెకు మరింత ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.