
కార్తీక దీపం 2 ధారావాహికలో జ్యోత్స్న పై పలు సంఘటనలు జరుగుతున్నాయి. కార్తీక్ ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుండగా, జ్యోత్స్న తన నిజమైన తండ్రి దాసును ఎదుర్కొంటుంది. ఈ ఎపిసోడ్ లో జరిగే ఉద్రిక్త సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Key Points
జ్యోత్స్నకు కార్తీక్ సర్‌ప్రైజ్!
దాసు ఎంట్రీతో జ్యోత్స్న మైండ్ బ్లాక్!
కార్తీక్, దీపల ప్రణాళికలు!
కార్తీక్ యొక్క సర్‌ప్రైజ్ ప్లాన్
కార్తీక దీపం 2 టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. తాత నువ్వు డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్పేయ్ అని సైగ చేస్తే చెప్పొద్దు అని అర్థమైందా? గౌతమ్ మంచివాడు అని చెప్పిందే నేను, ఇప్పుడు చెడ్డవాడు అని చెప్తే దీప మంచిది అని అర్థమవుతుంది. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి అని జ్యో అంటుంది.
కాశీ విషయంలో జ్యోత్స్న తీరు చూశాక ఆ మనిషి మీద జాలి పడటం అనవసరం బావ అని కార్తీక్ తో అంటుంది దీప . అది ముందే చెప్పానని కార్తీక్ అంటాడు. కాశీని అడ్డుపెట్టుకుని ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావని నాకు తెలుసు. దాసు బాబాయి కూతురివి అని కూడా తెలుసు. నిజాలు ఒప్పుకో అని జ్యోత్స్నను బెదిరించు అని దీప చెప్తుంది. అప్పుడు పారుతో సహా అందరినీ జ్యోత్స్న చంపేస్తుంది. నీ మీద కేసు పెట్టి జైలులో పెట్టిస్తుంది. ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోతుంది అని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్నకు చిన్న సర్ ప్రైజ్ రేపు ఇస్తాను అని కార్తీక్ చెప్తాడు. దాని బుద్ధి మార్చమని దీప అడుగుతుంది. జ్యోత్స్సకు, పారుకు ఇద్దరికి కలిపి గట్టిగా ఇవ్వాల్సిందే. మనమూ వాళ్ల రూట్ లో అప్పుడప్పుడూ వెళ్లాల్సిందే అని కార్తీక్ అంటాడు. పొద్దున పారు, జ్యో మాట్లాడుకుంటారు. రైలు దగ్గరకు వస్తుంటే పట్టాలపై దడ దడ అని సౌండ్ వచ్చినట్లు ఇప్పుడు నా గుండె కొట్టుకుంటుందని జ్యో అంటుంది. నిశ్చితార్థం కూడా ట్రైన్ లాగే దూసుకొస్తుంది. పెళ్లి వరకూ వెళ్తే నా పుట్టుక ఎంత మంది ప్రాణాలు తీసిందో, నా పెళ్లి అంతమంది ప్రాణాలు తీస్తుందని జ్యో సీరియస్ గా మాట్లాడుతుంది.
దాసు ఎంట్రీతో కలిగే ఉద్రిక్తత
జ్యోత్స్న కాఫీ తాగుతుండగా ఆమె నిజమైన తండ్రి దాసు ఎంట్రీ ఇస్తాడు. దాసును చూసి జ్యోత్స్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు వచ్చావు నాన్న అని అడిగితే, నిజాలు చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి అని దాసు చెప్తాడు. దాసును చూసి సుమిత్ర, దశరథ, పారు సర్ ప్రైజ్ అవుతారు. శివన్నారయణ గారు అని పిలుస్తూనే ఉంటాడు దాసు. శివన్నారాయణతో ఒక నిజం చెప్పాలి అని ఆయన్ని తీసుకుని గదిలోకి వెళ్తాడు దాసు. బయట ఉన్న జ్యో, పారుకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.
తాత బయటకు వచ్చి ఎందుకు పిల్లలను మార్చావంటే ఏం చేస్తావు? మన కథ క్లైమాక్స్ కు వచ్చింది గ్రానీ. తప్పించుకోవడానికి రెడీగా ఉండూ అని పారుతో జ్యో అంటుంది. బయటకు వచ్చిన శివన్నారాయణ మెడలో రుద్రాక్ష మాల చూసి అందరూ షాక్ అవుతారు. మీరు ప్రమాదంలో ఉన్నారు. మీ కోసం ఒకటి తీసుకొచ్చాను. కాశీ క్షేమం కోసం కాశీ వెళ్లా. ఇప్పుడు మీ కుటుంబం ప్రమాదంలో ఉంది. అందుకే ఇది మెడలో వేసుకోండి అని గదిలో శివన్నారాయణకు చెప్పి మాల అందిస్తాడు దాసు.
దాసు నిజం చెప్పకపోవడంతో జ్యోత్స్న ఊపిరి తీసుకుంటుంది. దాసు నీకంతా గుర్తొచ్చిందా? అని అడుగుతుంది సుమిత్ర. గుర్తొచ్చింది అని చెప్తాడు దాసు. నిన్ను ఎవరు కొట్టారో కూడా నీకు గుర్తుందా అని సుమిత్ర మళ్లీ ప్రశ్నిస్తుంది. నన్నెవరు కొట్టారు? అయినా నన్నెవరు కొడతారు? అని దాసు అనగానే.. ఇప్పటికైతే నేను తప్పించుకున్నా అని జ్యో మనసులో అనుకుంటుంది. నన్ను పంపింది, రప్పించింది కార్తీక్ అని జ్యోను చూస్తూ మనసులో అనుకుంటాడు దాసు.
నిజాలు బయటపడే అవకాశం
ఇటు తమ ఇంటి వంట గదిలో జ్యో ప్లాన్ గురించి ఆలోచిస్తుంది దీప. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ జరగదు అని దీపతో కార్తీక్ అంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన కాంచన జరగని పెళ్లికి జ్యోత్స్న ఎందుకు ఒప్పుకుంది? అని ప్రశ్నిస్తుంది. మళ్లీ నిశ్చితార్థం ఆగిపోతే మా నాన్న, అన్నయ్యకు ఏమవుతుంది? నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. మీరు చేసే దాంట్లో మంచి ఉంటుందని నమ్ముతున్నా. కానీ పెళ్లి విషయంలో మాత్రం నమ్మను గాక నమ్మను.
నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లు అక్క అని అనసూయను అడుగుతుంది కాంచన. పోయిన సారి కూడా ఇలాగే చేశావు. కానీ జరిగిందా? మీ నాన్న నీ మాట విన్నాడా? మీ వదిన నీ మాట నమ్మిందా? ఆ గౌతమ్ తో తాళి కట్టించుకోని బలైపోయేందుకు ఆ పారిజాతం మనవరాలు తింగరిది ఏం కాదు అని కార్తీక్ అంటాడు. పారిజాతం మనవరాలు కాదు జ్యోత్స్న మా అన్నయ్య కూతురు అని కాంచన అంటుంది. మామయ్య కూతురు దీప అనే నిజం త్వరలోనే బయటపడుతుంది అమ్మ అని అనుకుంటాడు కార్తీక్.
గౌతమ్ వెధవ. అలాంటి వెధవ కారణంగా నా పుట్టిల్లు బాధపడకూడదు. చెప్పకపోతే నేను దోషిగా నిలబడతాను. మా అన్నయ్య, నాన్న కళ్లలో నీళ్లు తిరిగినా, నీకేదైనా అయినా బాధ పడేది నేను రా అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
దాసు ప్రవేశంతో జ్యోత్స్న జీవితంలో కొత్త మలుపులు తిరుగుతాయి. నిజాలు బయటపడి, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. కార్తీక్ మరియు దీప ప్రణాళికల ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ వరకు ఎదురుచూడాలి.


