
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఉద్రిక్తత పెరిగింది. జ్యోత్స్న తన కుట్రలతో దీపను ఇంటి నుండి బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. కార్తీక్ ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తాడు. శివనారాయణ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది.
Key Points
జ్యోత్స్న, దీపను ఇంట్లోంచి వెళ్ళమని బలవంతం చేస్తుంది.
కార్తీక్, దీపను వదిలి పోవడానికి నిరాకరిస్తాడు.
శివ నారాయణ, ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు.
శౌర్య, తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆందోళన చెందుతుంది.
జ్యోత్స్న యొక్క కుట్ర
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను జ్యోత్స్న గెంటేస్తుంది. దీప కింద పడకుండా కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ వెనుక శివ నారాయణ ఉండి పట్టుకుంటాడు. నా భార్య ఏం తప్పు చేసిందని బయటకు వెళ్లమంటున్నారు అని కార్తీక్ అంటే.. దీప కారణంగా మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు. మీ అమ్మనాన్నను విడదీసినట్లే వీళ్లను విడదీయదని గ్యారెంటీ ఏంటీ అని జ్యోత్స్న అంటుంది.
దాంతో కార్తీక్ ఫుల్ ఫైర్ అవుతాడు. మళ్లీ తేరుకుని చూడండి పెద్ద మేడమ్ గారు. మా అమ్మ నాన్న విడిపోడానికి మా నాన్న రెండో పెళ్లి కారణం. దీప తాళి నువ్వు తెంచడం వల్ల ఈ ఇంట్లో పెళ్లి జరగాలన్నాను. నేను పెట్టిన కండిషన్‌కు అత్త తాళి తీయడానికి సంబంధం లేదని కార్తీక్ అంటాడు. నువ్ ఎంత సమర్ధించుకున్న దీప బయటకు పోవాల్సిందే అని జ్యోత్స్న అంటే.. పోదు అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు.
కార్తీక్ ఎక్కడ ఉంటే దీప అక్కడే ఉంటుంది అని దగ్గరికి తీసుకుని గట్టిగా చెబుతాడు కార్తీక్. అగ్రిమెంట్ చేసింది నువ్వు అని జ్యోత్స్న అంటే నా భార్య ప్రాణాలు అడ్డుపెట్టుకుని రాయించుకుంది నువ్వు అని జరిగింది చెబుతాడు కార్తీక్. వాడు అంత పొగరుగా మాట్లాడుతుంటే ఏమనరేంటీ అని పారిజాతం అంటుంది. వాడు పద్ధతిగా మాట్లాడుతున్నాడు. మీరు పెట్టిన నియమనిబంధనలే గుర్తు చేస్తున్నాడు. కార్తీక్, దీప ఎక్కడికి పోరు. తప్పు మనం చేసి ఎదుటివాళ్లను దోషులు చేయడం కరెక్ట్ కాదు అని శివ నారాయణ అంటాడు.
అంతేకానీ వాళ్లు ఇష్టం లేనివాళ్లను ఇంట్లో ఉండకూడదంటారు అంతేనా అని పారు అంటుంది. లేదు.. ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే నేనే వెళ్లిపోతాను అని శివ నారాయణ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ దీపను తీసుకుని ఇంట్లోకి వెళ్లు అని శివ నారాయణ చెప్పడంతో కార్తీక్ అలాగే చేస్తాడు. మీరంతా కలిసి మా తండ్రికి ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని దశరథ్ అంటాడు.
కార్తీక్ మరియు దీప యొక్క నిర్ణయం
మరోవైపు శౌర్యను అనసూయ లెక్కలు అడుగుతుంది. లెక్క చెప్పకుండా అందులో ఉన్న తప్పు గురించి చెబుతుంది శౌర్య. ముద్దుల తాతయ్య ఇంట్లో అమ్మ నాన్న ఎందుకు ఉంటారు. మన రెస్టారెంట్ ఏమైపోయింది. వాళ్ల ఇంట్లో పని చేస్తున్నారా. ఎందుకు పనిచేస్తున్నారు. నాన్న సీఈఓ అని చెప్పారు. మా ఫ్రెండ్స్ మీ నాన్న ఏం చేస్తున్నారు అడిగితే ఏం చెప్పను అని శౌర్య అంటుంది.
ఇది మమ్మల్ని కాదే మీ అమ్మ నాన్నను అడుగు అని కాంచన అంటుంది. మరోవైపు జరిగింది ఆలోచిస్తారు జ్యోత్స్న, పారిజాతం. దీప మారిపోయిందే. అమ్మోరులా ఉండాల్సిన దీప అమాయకురాలు అయిపోయింది ఏంటే. మాములుగా అయితే నిన్ను ఎగిరెగిరి కొట్టాలిగా. దీపలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది. ఎందుకు తిరగడబట్లేదు డౌట్ పడుతుంది పారిజాతం.
కారణం ఉంది. కానీ, మనకు తెలియదు అని జ్యోత్స్న అంటుంది. దీపను ఎందుకు ఉంచుతున్నాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన ఛాన్స్ వచ్చిన ఎందుకు చేయలేదు అని జ్యోత్స్న అనుమానిస్తుంది. మరోవైపు కార్తీక్, దీప దగ్గరికి వెళ్లిన దశరథ్ తనను క్షమించమని సుమిత్ర గురించి చెబుతూ అడుగుతాడు. ఆ మాటలు సుమిత్ర వింటుంది. అత్త చేసిన తప్పు వల్ల మాకు మంచే జరిగింది కదా అని కార్తీక్ అంటాడు.
నిజమే కానీ మన రెండు కుటుంబాల మధ్య సున్నితమైన గొడవ జరిగింది. నా చెల్లి నన్ను క్షమిస్తుందా అని దశరథ్ అంటాడు. అసలు నీ మీద మా అమ్మకు కోపం లేదు. కోపం అంతా అత్త మీద, కాసింత తాత మీదే. అన్ని మర్చిపోయి హాయిగా పని చేసుకో మామయ్య అని కార్తీక్ అంటాడు. సుమిత్ర మాటలు వినడం చూసిన జ్యోత్స్న మాట్లాడుతుంది.
శివ నారాయణ యొక్క బలిదానం
దీప, కార్తీక్ వాళ్లు అడగకుండా డాడీ ఎందుకు సారీ చెప్పడం. నీ తరఫున సారీ చెప్పాడంటే నిన్ను తక్కువ చేయడమే కదా. ఎందుకంత నువ్వు చిన్నచూపు. నీకంటే అత్త అంటేనే డాడీకి ఇష్టం అని తెలుస్తోంది. నువ్ దీప కంటే తక్కువ మమ్మీ. దీప ముందు నిన్ను తగ్గించు మాట్లాడంటే తక్కువ చేశాడనే కదా. నువ్ నాకోసం తాళి తీశావ్. నీకున్నట్లు డాడీకి నా మీద ప్రేమ లేదా. చెల్లి పిల్లలపైనే ప్రేమ ఉందా అని మాటలతో మరింత రెచ్చగొడుతుంది జ్యోత్స్న.
దాంతో కోపంగా వెళ్లిపోతుంది సుమిత్ర . వాళ్లకు సారీ చెప్పి మంచి పని చేశావ్ డాడీ. దీప వెళ్లకుండా బావ ఆపాడు కాబట్టి. ఇప్పుడు నేను మీ ఇద్దరిని విడగొడతాను. నాతో మాట్లాడొద్దని మమ్మీ నీతో చెప్పేలా చేస్తాను. మమ్మీ నా సైడ్ ఉంటే ఎవరిని ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు అని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ దగ్గరికి పారు వెళ్లి రేయ్ పనోడా అని అంటుంది.
దాంతో కార్తీక్ పంచులు వేస్తాడు. తాను సత్యనారాయణ వ్రతంలో వాడుకుంది చెప్పిన పారిజాతం ఇప్పుడు చేయిరా ఛాలెంజ్‌లు. ఈ పారిజాతం కొట్టింది అంటే గుండె గులాబ్ జామ్ అయినట్లే అని పారు అంటుంది. కార్తీక్ కౌంటర్స్ వేస్తాడు. కౌంటర్స్ వేయడం తప్పా ఏం చేయలేవురా. మన టైమ్ నడుస్తోంది. పీజే.. అల్లాడించేస్తా అని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, శివనారాయణ తన కుటుంబం కోసం ఒక కష్టమైన నిర్ణయం తీసుకుంటాడు. జ్యోత్స్న యొక్క ప్రణాళికలు ఎంతవరకు సఫలమవుతాయో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాలి.


