
బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల `కార్తీకదీపం` సీరియల్ ద్వారా ప్రజాదరణ పొందారు. కానీ ఆయన సినిమాల్లో కూడా నటించారని చాలామందికి తెలియదు. నిరుపమ్ పరిటాల సినిమా జీవితం గురించి తెలుసుకుందాం.
Key Points
కార్తీకదీపం డాక్టర్ బాబుగా పేరు తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల సినిమాల్లోనూ నటించారు.
నిరుపమ్ పరిటాల 'ఫిట్టింగ్ మాస్టర్' సినిమాలో నటించారు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస' సినిమాలో కూడా ఆయన నటించారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సీరియల్స్‌పై దృష్టి పెట్టారు.
నిరుపమ్ పరిటాల సినిమా ప్రయాణం
`కార్తీకదీపం` సీరియల్‌లో డాక్టర్ బాబుగా పాపులర్ అయి బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్నాడు నటుడు నిరూపమ్ పరిటాల. ఆయన అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు. సీరియల్ నటుడిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే బుల్లితెర ద్వారా సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు కూడా ఆయనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`కార్తీకదీపం` సీరియల్‌లోని సీన్లని చూసి చాలా మంది మహిళలు నిజంగానే ఆయన్ని నిలదీశారు. వంటలక్కని ఇబ్బంది పెట్టిన సీన్లు నిజమే అని భావించి ఏకంగా నిరుపమ్‌కి లెటర్స్ కూడా రాశారట. స్మాల్ స్క్రీన్‌ని శాషిస్తున్న నిరుపమ్ పరిటాల సినిమాల్లో కూడా నటించాడు. అందులో ఒకటి పాన్ ఇండియా హీరో సినిమా కూడా ఉండటం విశేషం.
‘ఫిట్టింగ్ మాస్టర్’ మరియు ‘రభస’ సినిమాలు
నిరూపమ్ నిజానికి హీరో కావాలనే సినిమాల్లోకి వచ్చాడు. మొదటి కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆఫర్లు రాలేదు. దీంతో ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అలా అల్లరి నరేష్ నటించిన `ఫిట్టింగ్ మాస్టర్`లో చిన్న పాత్రలో మెరిశాడు. ఇది 2009లో విడుదలైంది. ఇది బాగానే ఆడినా, నిరుపమ్‌కి పేరు రాలేదు.
దీంతోపాటు ఓ వైపు సీరియల్స్ నటిస్తూనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన `రభస`లోనూ నటించే ఆఫర్‌ని అందుకున్నాడు. అయితే ఇందులో నిరుపమ్‌ది నెగటివ్ రోల్ కావడం విశేషం. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నిరూపమ్ కష్టం వృధా అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆ వైపు సాహసం చేయలేదు నిరుపమ్. సీరియల్స్ ద్వారానే కావాల్సిన పేరు, ఇమేజ్ వస్తుండటంతో సినిమాలను లైట్ తీసుకున్నారు.
సినిమాల నుండి సీరియల్స్ వైపు మళ్ళు
ప్రస్తుతం నిరూపమ్ వరుసగా సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `కార్తీకదీపం 2` సీరియల్‌తో బిజీగా ఉన్నారు. నిరుపమ్ `చంద్రముఖి` సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత `బ్రహ్మముడి`, `హిట్లర్‌గారి పెళ్ళాం`, `కుంకుమపువ్వు`, `మూగమనసులు`, `కార్తీకదీపం`, `అత్తారింటికి దారేది`, `కలవారి కోడళ్లు`, `కాంచనగంగ`, `ప్రేమ`, `రాధకు నీవెర ప్రాణం` వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్నాడు నిరుపమ్.
చివరకు నిరుపమ్ పరిటాల సీరియల్స్ ద్వారానే పేరు, ప్రఖ్యాతిని పొందారు. ప్రస్తుతం ఆయన కార్తీకదీపం 2 సీరియల్‌తో బిజీగా ఉన్నారు.


