
📌 Key Points
- కార్తీక్ పక్కా ప్లాన్‌తో బాలరాజు ద్వారా పారిజాతం నిజం బయటపెట్టి షాకిచ్చాడు.
- జ్యోత్స్న, పారుల రహస్య కాల్ రికార్డింగ్ బయటపెట్టి కార్తీక్ అందరినీ విస్మయపరిచాడు.
- కంపెనీ సీఈఓగా దీప ఎంట్రీ ఇవ్వనుండటంతో కథలో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది.
- సూరజ్ బాంబ్ పేల్చి ఎవరి గుట్టు రట్టు చేశాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కార్తీక దీపం 2 సీరియల్ అభిమానులకు ఇది నిజంగా పండగే! ఊహించని మలుపులతో కార్తీక్ వేసిన మాస్టర్ ప్లాన్, జ్యోత్స్న, పారుల కుట్రలను ఎలా బట్టబయలు చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీప సీఈఓగా రావడంతో కథ మరింత రసవత్తరంగా మారింది.
కార్తీక్ వ్యూహానికి బలైపోయిన జ్యోత్స్న, పారు!
Karthika Deepam 2 Serial June 25th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 25వ ఎపిసోడ్‌లో బాలరాజుకు షూటింగ్ అని చెప్పి శివ నారాయణ ముందు ఆర్డర్ గురించి చెప్పిస్తాడు కార్తీక్. పారిజాతం అలా చేయించిందని బాలరాజు నిజం చెబుతాడు. జ్యోత్స్నతో పారు మాట్లాడిన కాల్ రికార్డ్ వినిపిస్తాడు కార్తీక్.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కంపెనీలో సీఈఓ అనౌన్స్‌మెంట్ కోసం బోర్డ్ మీటింగ్ ఏర్పాటు అవుతుంటుంది. మెంబర్స్ వచ్చారని శివ నారాయణకు స్టాఫ్ బాయ్ చెప్పడంతో మీటింగ్‌కు వెళ్తాడు. దారిలో కార్తీక్ ఆపి ఒక వర్ధమాన నటుడుని చూశాక బోర్డ్ మీటింగ్‌కు వెళ్లమని ఆపుతాడు.
బాలరాజు కళ్లకు గంతలు కడతాడు. ఎదుటి వాళ్లను మీరు చూస్తే వాళ్లు తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో నిన్ను డామినేట్ చేస్తారు. అందుకే కళ్లకు గంతలు కట్టానని కార్తీక్ అంటాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టమని బాలరాజు అంటాడు. పాకెట్‌లో చెక్ పెట్టి సేమ్ దీప దగ్గర చేసినట్లు స్క్రిప్ట్ చెబుతాడు కార్తీక్. ఇలాగే ఇదివరకే చేశానని బాలరాజు అంటాడు.
ఇలా అనుమానాలుంటే హీరోవి అవ్వలేవని బాలరాజును శివ నారాయణ దగ్గరికి తీసుకెళ్లిపోతాడు కార్తీక్. సూరజ్, దీప కూడా వస్తారు. బాలరాజును చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. వీడు బావకు ఎలా దొరికేశాడని జ్యో అనుకుంటుంది. బాలరాజు యాక్షన్ అని కార్తీక్ అనగానే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెయ్యి భోజనాలు కావాలి. మెనూ మాత్రం రిచ్‌గా ఉండాలని బాలరాజు అంటాడు.
బోర్డ్ మీటింగ్‌లో దీపకు ఊహించని పదవి!
పారును చూసి హాయ్ మేడమ్. మీరేంటీ ఇక్కడ ఉన్నారు అని బాలరాజు అడుగుతాడు. తనేలా నీకు తెలుసు అని శివ నారాయణ అడుగుతాడు. దీపను కూడా చూసిన బాలరాజు ఇది వేరే షూటింగ్ అన్నారని అంటాడు. కానీ, ఆర్టిస్టులంతా సేమే. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకుంటే జరిగిన నష్టానికి పోలీసులు తీసుకెళ్తారు. భోజనం ఆర్డర్ ఇచ్చి తీసుకోకుంటే నష్టమేగా. పైగా చెక్కు కూడా ఇచ్చావని కార్తీక్ అంటాడు.
నేను ఇవ్వడమేంటీ. అది ఇప్పించింది ఈ మేడమ్ కదా అని పారిజాతం గురించి చెబుతాడు బాలరాజు. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలని కార్తీక్ అడుగుతాడు. నేను జూనియర్ ఆర్టిస్ట్‌నండి. క్యారెక్టర్ ఉందని చెప్పి నాతో ఫుడ్ ఆర్డర్ ఇప్పించారు. రెమ్యునరేషన్ అయితే మంచి పేమెంట్ ఇచ్చాడు. కానీ, ఎవరికి చెప్పొద్దన్నారని బాలరాజు నిజం చెప్పేస్తాడు.
పారిజాతంను దోషి అంటూ శిక్ష పడాలని శివ నారాయణ తిడుతుంటే.. డైవర్ట్ చేయాలని జ్యో అనుకుంటుంది. ఏంటీ గ్రానీ దీపపై కోపం ఉంటే వేరేలా చూసుకోవాలి కానీ ఇలా చేయాల అంటుంది. పారిజాతం షాక్ అవుతుంది. జ్యో కన్నుకొట్టి పారిజాతంపై నింద నెట్టేస్తుంది. దీప జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది కదా అని డ్రామా చేస్తుంది జ్యోత్స్న.
తాత మీద కూడా పారుకు కోపం ఉన్నట్టుంది అని కార్తీక్ అంటాడు. తాత గ్రానీని గట్టిగా శిక్షిద్దాం. కానీ, ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ మనకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లకు ఇది తెలిసిన బాగోదు అని జ్యోత్స్న అంటుంది. నువ్వెందుకు కంగారుపడుతున్నావ్. బాలరాజు ఇచ్చిన ఆర్డర్ నువ్వు ఎప్పటికీ తీసుకోవు. నాలుగు వేలకు ఇచ్చిన కూడా తీసుకోవు. ఎందుకంటే బాలరాజను పారుతో పురామియించిది నువ్వే కాబట్టి అని కార్తీక్ అంటాడు.
సూరజ్ పెట్టిన బాంబుతో కంపెనీలో ప్రకంపనలు!
పారిజాతం సరే ఉంటాను అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చింది, ఏం పారు అంతా ఓకేనా అన్నది గుర్తు చేసుకుంటుంది పారిజాతం. వీడే దగ్గరుండి ఫోన్ చేయించాడు. వీడే తీసుకొచ్చాడు. గట్టిగా ఇరికించేశాడు ఈ మాయలోడు అని భయపడిపోతుంది పారిజాతం. అంటే, ఇదంతా కార్తీక్ మాస్టర్ స్ట్రోక్ అని అర్థమైపోతుంది. అలా పారిజాతం, జ్యోత్స్న ద్రోహాన్ని బట్టబయలు చేస్తాడు కార్తీక్. గ్రానీ నీతోపాటు నన్ను కూడా ముంచేశావ అని జ్యోత్స్న అనుకుంటుంది.
శివ నారాయణ గారు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. కానీ, తీసుకునేదానికంటే ఈ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని పెద్ద బాంబ్ పేలుస్తాడు సూరజ్. వాళ్లు తప్పు చేస్తే మీరు వెళ్లిపోవడమేంటీ అని దీప అంటుంది. నేనే కాదు మీరు కూడా వెళ్లిపోండి. ఇలాంటి మనుషులతోనా మనం పోటీ పడేది. అడ్డదారులతో గెలిచేవాళ్లతో పోటీ పడలేం. వాళ్లలో నిజాయితీ ఉండదు అని సూరజ్ అంటాడు.
దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు బోర్డ్ మీటింగ్‌కు వెళ్దామని శివ నారాయణ అంటాడు. అంతా మీటింగ్‌కు వెళ్తారు. బోర్డ్ మెంబర్స్ సీఈఓ ఎవరనేది అడుగుతారు. ఇప్పుడు తాత దీప పేరే చెబుతాడు. దానికంటే ముందు ఓ పని చేయాలని శివ నారాయణ చెప్పబోతుంటే ఆపుతుంది జ్యోత్స్న. ఈ సీఈఓ కాంపిటీషన్ విన్నర్ ఎవరో నేనే అనౌన్స్ చేస్తాను అని జ్యోత్స్న అంటుంది.
జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓకి అర్హత కలిగిన మనిషి దీప అని జ్యోత్స్న చెబుతుంది. చదివింది ఐదో క్లాస్ అయిన తన ఓర్పుతో, తెలివితో సీఈఓగా గెలిచింది అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న గారు వద్దనుకోవడం వల్లే దీప గెలిచిందని ఒకతను అంటాడు. అని ఎవరు చెప్పారు. వారికి వచ్చిన లెక్కలతోనే చూద్దామని శివ నారాయణ అంటాడు.
కార్తీక దీపం 2లో ఈ సంచలన పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కార్తీక్, దీప భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సూరజ్ బాంబ్ వెనుక అసలు నిజం ఏమిటి? వేచి చూడండి! మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి!


