|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కలిసి ప్రయాణించబోతున్నాం.. ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేస్తూ కార్తీక్ ఆర్యన్ షాకింగ్ పోస్ట్.. శ్రీలీల పరిస్థితి ఏంటి అంటున్న నెటిజన్లు

Published: 02-06-2025, 10:06 AM
కలిసి ప్రయాణించబోతున్నాం.. ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేస్తూ కార్తీక్ ఆర్యన్ షాకింగ్ పోస్ట్.. శ్రీలీల పరిస్థితి ఏంటి అంటున్న నెటిజన్లు

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన కొత్త చిత్రం ‘తు మేరీ మై తేరా’ ప్రమోషన్ కోసం అనన్య పాండేతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇది శ్రీలీలతో ఆయన సంబంధంపై చర్చలకు దారితీసింది.

Key Points

1

కార్తీక్ ఆర్యన్ తన తాజా చిత్రం 'తు మేరీ మై తేరా' షూటింగ్ గురించి పోస్ట్ చేశాడు.

2

అనన్య పాండేతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రయాణం గురించి ప్రకటించాడు.

4

నెటిజన్లు శ్రీలీల పరిస్థితి గురించి ప్రశ్నిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్ యొక్క కొత్త సినిమా ప్రకటన

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) అషికి-3, నాగిల్లా వంటి చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ‘‘తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ’ (TuMeriMainTeraMainTeraTuMeri) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే సమీర్ విద్వాన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా, భూమిక తివారీ, షరీన్ మంత్రి కేడియా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ కార్తీక్ ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేశాడు.

ఇందులో అనన్య పాండే(Ananya Pandey)కు లిప్ లాక్ ఇచ్చినట్లుగా పోజు పెట్టి మధ్యలో పాస్ పోర్ట్‌ను పెట్టారు. ఇక మరోసారి మేము ప్రయాణించబోతున్నామంటూ ‘తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ’ వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ప్యార్ కా పంచనామ’ చిత్రంలో నటించి హిట్ సాధించడంతో పాటు ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి జతకట్టబోతున్నారు.

అనన్య పాండేతో ఉన్న రొమాంటిక్ పోస్ట్

కాగా, కార్తీక్ ఆర్యన్ గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు ఫ్యామిలీ పార్టీల్లోనూ కలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటంతో అందరికీ బలం చేకూరినట్లు అయింది. ఇక అనన్య పాండేతో ఉన్న ఫొటో షేర్ చేయడంతో శ్రీలీల పరిస్థితి ఏం కావాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరు సినిమాలో నటిస్తుండటం వల్ల అలా వెరైటీగా అనౌన్స్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీలీలతో డేటింగ్ వార్తల ప్రభావం

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

కార్తీక్ ఆర్యన్ మరియు అనన్య పాండే కలిసి నటించే ‘తు మేరీ మై తేరా’ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. శ్రీలీలతో ఆయన సంబంధంపై నెటిజన్ల ఆసక్తి కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.