
📌 Key Points
- కాశీ, వైరా సహకారంతో జీఎంగా నియమితుడై, శ్రీధర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
- కల్తీ ఫుడ్ కేసు ఆరోపణలతో శ్రీధర్‌ను, కాశీని పోలీసులు అరెస్ట్ చేశారు.
- సుమిత్ర రక్తపు వాంతులు చేసుకుంటుంది; దీప బ్లడ్ క్యాన్సర్‌గా అనుమానించి షాక్ అవుతుంది.
- కార్తీక్, దీపలు ఫుడ్ ట్రక్ ద్వారా సేవలు అందిస్తూ కొత్త ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు.
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కాశీ వ్యూహంతో శ్రీధర్ అరెస్ట్ అవ్వగా, మామపై ప్రతీకారం మొదలైంది. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి దీప షాక్‌కు గురైంది. కార్తీక్, దీపల కొత్త ప్రయాణం ఆసక్తికరంగా మారింది.
కాశీ వ్యూహంతో శ్రీధర్ అరెస్ట్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో వైరా దగ్గరికి కాశీ వెళ్తాడు. బాగా బ్రెయిన్ వాష్ చేసి జీఎంగా జాయిన్ చేసుకుంటాడు. తర్వాత శ్రీధర్ దగ్గరికి పోలీసులతో కాశీ వెళ్తాడు. శ్రీధర్, కాశీని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సుమిత్ర రక్తపు వాంతులు చేసుకుంటుంది. అది చూసి దశరథ్, దీప షాక్ అవుతారు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీకి సర్ అంటా బాగా మర్యాదలు చేస్తాడు వైరా . దానికి కాశీ ఆశ్చర్యపోతాడు. నీ గురించి జ్యోత్స్న చెప్పింది. మీ రెజ్యూమ్ చూశాను. చాలా మెరిట్ ఉంది. వాళ్లు పీఏగా పెట్టుకున్నారు. నా దగ్గర ఉంటే జీఎమ్‌గా పెట్టుకునేవాన్ని అని వైరా అంటాడు.
బుద్ది చెప్పాలంటే ఇక్కడ ఉంటావ్. లేకపోతే చేతకాని దద్దమ్మలా అయిపోతావ్ అని వైరా అంటాడు. బుద్ధి చెబుతాను అంటాడు కాశీ. వెరీ గుడ్. ముందు అక్కడ రిజైన్ చేయి. మీ బాస్‌కు ఎలా బుద్ధి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో నేను చెబుతాను అని వైరా అంటాడు. మరోవైపు స్కూటీపై కార్తీక్, దీప వెళ్తారు. ఇప్పుడు చేస్తుంది వనవాసం. తర్వాత అంతా బాగుంటామని కార్తీక్ అంటాడు.
మామపై కాశీ ప్రతీకారం
దారిలో ఫుడ్ ట్రక్ దీపకు చూపిస్తాడు కార్తీక్. నీ కల నెరవేరిందని కార్తీక్ అంటాడు. ఫుడ్ దానం ఇస్తారు. అది తీసుకున్నవాళ్లు ఆశీర్వదిస్తారు. కార్తీక్, దీప సంతోషంగా వెళ్లిపోతారు. నా మీద ఇంకా నమ్మకం లేదా అని జ్యోత్స్నకు కాల్ చేసి కాశీతో మాట్లాడిస్తాడు వైరా. నీకు జీఎమ్ పోస్ట్ ఇప్పించాను. మంచి జీతం. ఎవరి దగ్గర నిల్చుని పని చేయాల్సిన అవసరం లేదు. నాకు మన ఫ్యామిలీ మీద ప్రేమ ఉంది. మనం యూనిటీగా ఉండాలి అని జ్యోత్స్న అంటుంది.
మరోవైపు మీడియాతో శ్రీధర్ మాట్లాడుతాడు. కంపెనీ గురించి, ఫుడ్ దానం గురించి చెబుతాడు. ఇంతలో పోలీసులు వస్తారు. వారితో కాశీ వస్తాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ కల్తీ ఫుడ్ తినడం వల్ల చాలా మంది హాస్పిటల్‌లో చేరారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మీ పీఏ మీదే బాధ్యత ఉందని చెప్పాడు. మీరు కాదంటే మీ ఛైర్మన్ దగ్గరికి వెళ్తాం అని ఎస్సై అంటాడు.
సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్: దీప షాక్
పూర్తి బాధ్యత నాదే అని శ్రీధర్ అంటాడు. సర్వీస్ అని చెప్పి ఇంత ఫ్రాడ్ చేస్తారా అని నానా మాటలు అంటుంది మీడియా. శ్రీధర్, కాశీని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. మరోవైపు దీప ఊడిస్తుంటే సుమిత్ర తీసుకుని ఊడుస్తుంది. పుట్టింట్లో కూతురు గర్భవతిగా ఉండటం గురించి గొప్పగా చెబుతుంది సుమిత్ర. మనం కట్టని గుడి అమ్మ ఒడి. పూజించని దైవం అమ్మ రూపం అని సుమిత్ర అంటే దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సుమిత్రను పక్కకు కూర్చోబెట్టి దీప దగ్గరికి వస్తాడు దశరథ్. ఈ విషయం సుమిత్రకు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని దీపకు కంగారుగా చెబుతాడు దశరథ్. దాంతో అమ్మకు ఏదో అయింది అని దీప కంగారుపడుతుంది. చూస్తుంటే సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తోంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కాశీ ప్రతీకారం, సుమిత్ర ఆరోగ్యం, కార్తీక్-దీపల భవిష్యత్తుపై ఉత్కంఠ మరింత పెరిగింది. తదుపరి ఎపిసోడ్‌లో ఏమి జరగబోతుందో వేచి చూడాలి. సీరియల్ తదుపరి మలుపుల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


