
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ దంపతుల గురించి గుడ్ న్యూస్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె గర్భవతి అని ప్రచారం జరుగుతోంది.
Key Points
కత్రినా కైఫ్ గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వచ్చే నెల లేదా నవంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని ప్రచారం.
ఓవర్ సైజ్ షర్ట్ లో కనిపించడంతో ప్రెగ్నెన్సీ రూమర్స్ మొదలయ్యాయి.
ఈ జంట ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
సోషల్ మీడియాలో వైరల్ వార్తలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు . తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్లాడింది . 2021 లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు . అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి . కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి . దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు .
అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది . వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది . వచ్చే నెల అంటే అక్టోబర్ లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది . ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని .. వచ్చేనెల లేదా నవంబర్ లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది . కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు .
గర్భవతి అనే ప్రచారం
రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్‌సైజ్ షర్ట్‌లో కనిపించడంతో ప్రెగ్నెన్సీ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై అప్పట్లో విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు . అలాంటదేమీ లేదని .. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు . ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాకుండా ‘ బ్యాడ్ న్యూజ్’ ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి . ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు. కానీ అప్పటి నుంచి ఈ జంటపై పలు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి . రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది . ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అని కామెంట్స్ చేశారు . తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా , విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ రూమర్స్ కు చెక్ పడేలా కనిపించడం లేదు .
జంట నుండి అధికారిక ప్రకటన లేదు
మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు . రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఏకంగా రూ .800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు . విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్ తో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు .
కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ దంపతుల గురించి గుప్తులు ఇంకా కొనసాగుతున్నాయి. వారి అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.


