|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చక్రితో కౌసల్య లవ్‌ ఎఫైర్‌, అందుకే ఆయన్ని వదల్లేదా?.. తెరవెనుక నిజాలు బయటపెట్టిన స్టార్‌ సింగర్

Published: 22-09-2025, 4:13 AM
చక్రితో కౌసల్య లవ్‌ ఎఫైర్‌, అందుకే ఆయన్ని వదల్లేదా?.. తెరవెనుక నిజాలు బయటపెట్టిన స్టార్‌ సింగర్

ప్రముఖ గాయని కౌసల్య మరియు సంగీత దర్శకుడు చక్రి మధ్య లవ్ ఎఫైర్స్ గురించి వార్తలు వ్యాపించాయి. ఈ వార్తలకు కౌసల్య స్వయంగా స్పందిస్తూ, వాటిని ఖండించింది. ఆమె వివరణ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

కౌసల్య, చక్రిల మధ్య లవ్ ఎఫైర్స్ గురించి వార్తలు వచ్చాయి.

2

కౌసల్య చక్రిని మెంటర్‌గా భావించిందని, ఆయన తనకు అభిమాని అని తెలిపింది.

4

రూమర్స్ కారణం వారి మధ్య ఉన్న పని సంబంధం, స్టూడియోలో ఎక్కువ సమయం గడపడం అని వివరించింది.

కౌసల్య మరియు చక్రి మధ్య రూమర్స్

సింగర్‌ కౌసల్య ఒకప్పుడు స్టార్‌ సింగర్‌గా రాణించింది. అద్భుతమైన పాటలతో అలరించింది. ఈ మధ్య కాస్త జోరు తగ్గినా ఆమె తన పాటలతో శ్రోతలను అలరిస్తూనే ఉంది. బేస్‌ వాయిస్‌ ఉన్న పాటలకు కౌసల్య బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. అయితే సంగీత సంచలనం చక్రి సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడింది. వీరి కాంబోకి మంచి క్రేజ్‌ ఉండేది. వీరి పాటలు ఉర్రూతలూగించేవి. మాస్‌ పాటలతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈక్రమంలోనే కౌసల్యకి, చక్రికి మధ్య లవ్‌ ఎఫైర్స్ రూమర్స్ వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలకు పనిచేయడంతో ఆ రూమర్స్ బాగా వ్యాపించాయి. ఆ సమయంలో ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకున్నారు. వీరి బాండింగ్‌ కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ అనేదానికే పరిమితం కాలేదు. చక్రి మ్యూజిక్‌ స్టూడియోలోనూ కౌసల్య పనిచేసింది. టెక్నీకల్‌గా చాలా విషయాల్లో ఆమె ఇన్‌ వాల్వ్ అయ్యింది. మిక్సింగ్‌తోపాటు కరెక్షన్స్ కూడా చేసిందట. మ్యూజిక్‌, లిరిక్‌, పిచ్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా తనే సాల్వ్ చేసేదట. ఈ క్రమంలోనే ఈ రూమర్స్ వ్యాపించి ఉంటాయి.

కౌసల్య వివరణ

దీనిపై సింగర్‌ కౌసల్య స్పందించింది. అసలు ఏం జరిగిందో తెలిపింది. చక్రితో లవ్‌ ఎఫైర్స్ రావడానికి కారణం ఏంటో వెల్లడించింది. అప్పట్లో ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఇలాంటి రూమర్స్ క్రియేట్‌ చేస్తారు. ఎక్కవగా కలిసి పని చేసినా ఇలాంటివి కామన్‌ అని, నిజానికి చక్రి తనని మెంటర్‌గా భావించేవాడని, తన పాటలకు ఆయన అభిమాని అని, ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో తెలిపారని, అంతేకాదు తాను పాట పాడే సమయంలోనూ ఇక్కడ ఫ్యాన్‌ అండీ అని చెబుతుండేవారని తెలిపింది కౌసల్య. తనని చాలా మంది రికార్డింగ్‌ స్టూడియోలో రికార్డిస్ట్ గా చూసేవారు. తాను పాటలు పాడటమే కాదు రికార్డింగ్‌ వర్క్ కూడా చేసేదాన్ని. ఎక్కువగా స్టూడియోలోనే ఉండేదాన్ని, అందుకే ఈ రూమర్స్ వచ్చి ఉంటాయని చెప్పింది.

తాను శంకర్‌ మహదేవన్‌, హరిహరన్‌ వాయిస్‌లను మిక్స్ చేసేదాన్ని అని, లెటర్స్ తప్పులు వస్తే కరెక్షన్‌ చేసేదాన్ని అని, పిచ్‌ కరెక్షన్‌ కూడా చేసేదాన్ని అని, తనకు టెక్నికల్‌ విషయాలంటే చాలా ఇష్టమని తెలిపింది కౌసల్య. చక్రిగారే ఈ వర్క్స్ తనకు చెప్పేవాడని, తన ఇంట్రెస్ట్ తోనే ఇవన్నీ చేసేదాన్ని అని ఆమె వెల్లడించింది. తాను కంపోజర్‌ని కూడా అని, వాటిపై అవగాహన ఉందని చెప్పింది. అలాంటి సమయంలోనే ఇలా రూమర్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ రూమర్స్ వస్తున్నాయని తాను వర్క్ చేయడం ఆపేయలేనని, అందుకే చక్రితో వర్క్ చేసినట్టు తెలిపింది. ప్రారంభంలో ఇలాంటి వార్తలు కాస్త షాకింగ్‌గా అనిపించినా, ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, టెక్నీకల్ గా వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చోలేనని తెలిపింది. పాటలు కూడా ఫోన్‌లోనే తీసి ఎడిట్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది కౌసల్య.

తెరవెనుక నిజాలు

కౌసల్యనే ఎందుకు ఎక్కువగా పాడిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చక్రిని అడిగితే `నా పాటలన్నీ హై పిచ్‌లో ఉంటాయి. అలాంటి పాటలు పాడటానికి మన హైదరాబాద్‌లో ఉన్నది ఈ అమ్మాయి ఒక్కరే. వేరే వాళ్లు అవకాశాలు లేనప్పుడు ఇలా చేస్తారేమో, కానీ ఆమెకి ఇవన్నీ ఏం అవసరం. ఆమె పాడితే మా ప్రాజెక్ట్ కి ప్లస్‌ అవుతాయి. అందుకే ఆమెని పిలిపించుకుని పాడించుకుంటాం` అని చక్రి చెప్పినట్టుగా కౌసల్య వెల్లడించింది. వేరే సింగర్స్ తో పాడించినా, బాగా రాకపోతే తనని పిలిచి పాడించేవారని, ఆ సమయంలో ఎంతైనా కౌసల్య కౌసల్యే అని అనేవారని, అది తనకు గొప్పగా అనిపిస్తుందని తెలిపింది స్టార్‌ సింగర్‌. ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

కౌసల్య తన వృత్తిపరమైన సంబంధాన్ని వివరిస్తూ, ఈ రూమర్లను తోసిపుచ్చింది. చక్రి తన మెంటర్ అని, వారి మధ్య ఉన్నది కేవలం పని సంబంధమేనని స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.