
చైల్డ్ ఆర్టిస్టుగా ‘గంగోత్రి’తో తెలుగు తెరకు పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్, ‘మసూద’, ‘బలగం’ సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజా ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో…
Key Points
కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘గంగోత్రి’, ‘మసూద’, ‘బలగం’ వంటి సినిమాల్లో నటించింది.
‘ఉస్తాద్’ సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంది.
కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కావ్య కళ్యాణ్ రామ్ సినిమా ప్రస్థానం
‘గంగోత్రి’(Gangothri) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మారి సినిమాలు చేస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది ఈ చిన్నది. అలా ‘మసూద’(Masuda) సినిమాతో హీరోయిన్‌గా మారి తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత వేణు(Venu) దర్శకత్వంలో ‘బలగం’(Balagam) సినిమాలో నటించింది. ఈ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత ఆమె చేసిన ‘ఉస్తాద్’(Usthad) సినిమా డిజాస్టర్ అయ్యింది. శ్రీ సింహ(Sri Simha) హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కావ్య తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ ఆఫీస్ వేర్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూపు
కావ్య కళ్యాణ్ రామ్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. కొత్త సినిమా ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


