|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేడీ ది డెవిల్ సెగలు! ఎన్టీఆర్ హీరోయిన్‌తో లింక్ ఏంటి? రచ్చ రేపుతున్న రక్షిత పోస్ట్ వైరల్!

Published: 20-03-2026, 8:05 AM
కేడీ ది డెవిల్ సెగలు! ఎన్టీఆర్ హీరోయిన్‌తో లింక్ ఏంటి? రచ్చ రేపుతున్న రక్షిత పోస్ట్ వైరల్!
  • కేడీ ది డెవిల్ సినిమాలోని ‘సర్కే చునార్‌’ పాట వివాదంలో చిక్కుకుంది, యూట్యూబ్ నుండి తొలగింపు!
  • దర్శకుడు ప్రేమ్ భార్య రక్షిత స్ట్రాంగ్ రియాక్షన్: పాత పాటలపై ఎందుకు లేని అభ్యంతరం అంటూ నిలదీత!
  • రక్షిత కెరీర్ బిగినింగ్: ఎన్టీఆర్ సరసన ఆంధ్రావాలా, రవితేజతో ఇడియట్ సినిమాలు గుర్తుచేసుకున్న ఫ్యాన్స్!
  • నిర్మాతగా రక్షిత: జోగయ్య, ఏక్ లవ్ యా సినిమాలు నిర్మించి సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది!

కన్నడ స్టార్ ధ్రువ సర్జా నటించిన కేడీ ది డెవిల్ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని పాటపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. అసలు ఈ వివాదానికి ఎన్టీఆర్ హీరోయిన్‌కి సంబంధం ఏమిటో చూద్దాం!

కేడీ ది డెవిల్ పాట రచ్చ: రక్షిత రియాక్షన్ వైరల్

కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా తెర‌కెక్కుతోన్న తాజా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ఇందులో సంజయ్‌ దత్‌, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రీష్మా కీలక పాత్రలు పోషించారు. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుత‌కుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుద‌ల‌ చేసిన ‘సర్కే చునార్‌’ అనే పాటపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో యూట్యూబ్ నుంచి ఈ పాట‌ను తొల‌గించారు. తెలుగులో ఈ పాట పాడిన మంగ్లీ సైతం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ పాట వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆ న‌టి మ‌రెవ‌రో కాదు ర‌క్షిత‌. తెలుగులో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆంధ్రావాలా, ర‌వితేజ స‌ర‌స‌న ఇడియ‌ట్ సినిమాల్లో క‌నిపించి న‌టిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కేడీ ది డెవిల్‌తో తెర‌పైకి వ‌చ్చారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్రేమ్ భార్యే ర‌క్షిత‌.

ఎన్టీఆర్ హీరోయిన్ రక్షిత: కేడీతో సంబంధం ఇదే

ఈ పాట‌ని తొలగించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) అధికారులను కేంద్రం ఆదేశించ‌డంపై చిత్ర ద‌ర్శ‌కుడి భార్య అయిన ర‌క్షిత స్పందించారు. స్టాగ్రామ్ లో  సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ… గతంలో వచ్చిన ‘పీలింగ్స్’ (పుష్ప 2), ‘చోళీ కే పీచే’ వంటి పాటలను జనం మామూలుగానే తీసుకున్నారని, ఇప్పుడు ఈ ఒక్క పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఒక పాట సరిగ్గా లేనంత మాత్రాన దర్శకుడిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని రాసుకొచ్చారు.

రక్షిత తన కెరీర్‌ను కన్నడలో స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘అప్పూ’ సినిమాతో ప్రారంభించారు. అదే కథను తెలుగులో ‘ఇడియట్‌’ పేరుతో రీమేక్ చేయగా, అందులో రవితేజ సరసన నటించి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘సుచిత్ర’ పాత్రతో యువతలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

రక్షిత సంచలన పోస్ట్: పాత పాటలపై ప్రశ్నల వర్షం!

2007లో దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్న తర్వాత రక్షిత నటనకు దూరమయ్యారు. అయితే సినిమా రంగాన్ని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి ‘జోగయ్య’, ‘ఏక్ లవ్ యా’, ‘డీకే’ వంటి సినిమాలు నిర్మించారు. ‘ఏక్ లవ్ యా’లో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా టెలివిజన్ షోలలో జడ్జిగా, హోస్ట్‌గా కూడా పనిచేశారు.

కేడీ ది డెవిల్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రక్షిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.