|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Keerthy Suresh: కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్.. చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమా.. కనీసం ఇప్పుడైనా..

Published: 08-10-2025, 10:09 PM
Keerthy Suresh: కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్.. చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమా.. కనీసం ఇప్పుడైనా..

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఎట్టకేలకు తిరిగి వస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా బంపర్ ఆఫర్ అందుకున్న కీర్తి, ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Key Points

1

కీర్తి సురేష్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తోంది.

2

విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

4

ఈ సినిమాతో కీర్తి మళ్లీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కీర్తికి దక్కిన బంపర్ ఆఫర్

Keerthy Suresh: కొన్నిసార్లు విజయం కూడా మనిషిని కిందకు నెట్టేస్తుంది. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కి ఇదే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి సినిమా తరువాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. ఎందుకంటే, మహానటి పాత్ర తరువాత ఆమెను వేరే పాత్రలో చూడలేకపోయారు ఆడియన్స్. తెలుగులో ఆమె నేను శైలజ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ బాబు తో(Keerthy Suresh) సర్కారువారి పాట, నేను లోకల్, దసరా లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలో దసరా సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. కానీ, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Catherine Tresa: కేక పెట్టిస్తున్న కేథరిన్.. వైట్ డ్రెస్ లో హాట్ పోజులు..

విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్

ఇక ఆ తరువాత నుంచి తెలుసు సినిమాలకు దూరం అయ్యింది కీర్తి సురేష్. బాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. కానీ, తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఆమె కంబ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలో కూడా ఆమెకు అవకాశం దక్కలేదు. తాజాగా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి అని తెలుస్తోంది. ఎట్టకేలకు ఆమెకు తెలుసు సినిమాలో అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

కీర్తి సురేష్ తెలుగు కంబ్యాక్

అవును, విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలాతో “రౌడీ జనార్ధన” ఒక మాస్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి చాలా వార్తలే వైరల్ అయ్యాయి. ముందుగా ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను తీసుకోవాలని అనుకున్నారట కానీ, ఎందువల్లో అది కుదరలేదు. తరువాత కూడా చాలా అప్షన్స్ అనుకున్నప్పటికీ చివరికి ఆ అవకాశం కీర్తి సురేష్ కి దక్కినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఇక ఎట్టకేలకు కీర్తి సురేష్ తెలుగు సినిమాలో కనిపిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ సినిమా అయినా ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.

మహానటి తర్వాత సరైన హిట్ లేక సతమతమైన కీర్తి సురేష్‌కు ఈ బంపర్ ఆఫర్ చాలా కీలకం. విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించి, తిరిగి తెలుగులో బిజీ స్టార్‌గా మారుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.