
📌 Key Points
- కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్: క్యూట్ పాపతో ముద్దుల ఫోటో!
- విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థన్ మూవీలో కీర్తి సురేష్ సందడి!
- చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్న కీర్తి సురేష్.
- వంటల షోస్‌కు వెళ్తుందా అంటూ నెటిజన్ల ఆసక్తికర చర్చలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఒక చిన్న పాపతో కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివరాలేంటో చూద్దాం!
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు వైరల్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ మూవీలో యాక్ట్ చేస్తోంది.
ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్(Antony Thattil)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుపుతూ ఈ భామ నిత్యం ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థన్ మూవీ
తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో కొన్ని రెడీ అయిన ఫొటోస్‌తో పాటు కుకింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అంతేకాకుండా ఒక చిన్న క్యూట్ పాపను ఎత్తుకున్న ఫొటో కూడా పంచుకుంది. ఇక వీటికి.. ‘ఇంకా ఈ రుచికరమైన బోండాల గురించి కలలు కంటున్నాను.. @aathitiyan మరియు నా @cookdtv ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సరైన ఆఫర్లు లేక వంటల షోస్‌కు వెళ్తుందా అని చర్చించుకుంటున్నారు.
నెటిజన్ల ఆసక్తికర చర్చలు
A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)
కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె తదుపరి అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని టాలీవుడ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.


