
కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయనకు కేజీఎఫ్ స్టార్ యశ్ సహా పలువురు చికిత్స కోసం సాయం చేశారు. 35 ఏళ్లుగా కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రాయ్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Key Points
కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో మృతి చెందారు.
కొన్నేళ్లుగా ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
యశ్ సహా పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు చికిత్సకు సాయం చేశారు.
35 ఏళ్లుగా కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు ఆయన.
కన్నుమూసిన కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్
కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశాడు. కొన్నేళ్లుగా థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న అతడు.. గురువారం (నవంబర్ 6) బెంగళూరులో తుది శ్వాస విడిచాడు. అతనికి కొన్నాళ్లుగా యశ్ కూడా చికిత్స కోసం సాయం చేశాడు.
కేజీఎఫ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటుడు హరీష్ రాయ్. 35 ఏళ్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. గురువారం (నవంబర్ 6) బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాటం.. యశ్ సాయం
చాలా రోజుల కిందటే అతడు తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి దిగజారడంపై మాట్లాడాడు. అతనికి కేజీఎఫ్ స్టార్ యశ్ సహా అనేక మంది చికిత్స కోసం సాయం కూడా చేశారు. థైరాయిడ్ క్యాన్సర్ కాస్తా అతని పొట్ట భాగానికి కూడా పాకడంతో అతడు కోలుకోలేకపోయాడు.
అభిమానుల సాయం కూడా కోరుతూ..
హరీష్ రాయ్ సినీ ప్రస్థానం
అతడు ఆర్థిక సాయం కోరడంతో ఎంతో మంది సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా అతడు క్యాన్సర్ మహమ్మారిని జయించలేకపోయాడు. హరీష్ 1990లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఓం, నల్లా, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీతా, కేజీఎఫ్ సినిమాలతో అతడు బాగా పాపులర్ అయ్యాడు. హరీష్ మృతికి కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హరీష్ రాయ్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ వర్గాలు ప్రార్థిస్తున్నాయి.


