|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఖమేనీ మరణం వెనుక లక్షల కోట్ల కుంభకోణం! వారసులెవరు? ఇరాన్‌లో సంచలనం!

Published: 02-03-2026, 2:05 PM
ఖమేనీ మరణం వెనుక లక్షల కోట్ల కుంభకోణం! వారసులెవరు? ఇరాన్‌లో సంచలనం!
  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
  • ఖమేనీ ఆధీనంలో రూ. 8.55 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందని సమాచారం.
  • సెటాడ్ అనే రహస్య సంస్థ ద్వారా ఖమేనీ వ్యాపారాలు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • ఖమేనీ మృతితో అయతుల్లా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అతని మరణానంతరం అతని ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖమేనీ రూ. 8.55 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.

ఖమేనీ ఆస్తుల వివరాలు వెలుగులోకి

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా చాలా మంది సైనికులు మరణిస్తుంటే.. ఇటు గల్ఫ్ దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ పైన నేరుగా దాడి చేయకుండా గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. దీంతో కోట్లాది మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతని ఆధీనంలో రూ. 8.55 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ( Ayatollah Khamenei) సుమారు 8.55 లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. తొలి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ స్థాపించిన సెటాడ్ అనే రహస్య సంస్థ పరిధిలో వ్యాపారాలు నడిచినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రజల ఆస్తులను జప్తు చేసి, విక్రయించేవారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రతి రంగంలో సెటాడ్ కు వాటాలు ఉన్నాయని సమాచారం. అయితే ఆయతుల్లా ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్ ను వాడుకున్నారనేందుకు ఆధారాలు లేవని మీడియా సంస్థలు కూడా వెల్లడించాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఆయతుల్లా ఖమేనీ మృతితో తాత్కాలిక సుప్రీం లీడర్ గా అయతుల్లా అరాఫీని ఇరాన్ ఎన్నుకుంది.

సెటాడ్ రహస్య సంస్థ గురించిన ఆరోపణలు

కొత్త సుప్రీం లీడర్‌గా అరాఫీ ఎన్నిక

ఖమేనీ మరణం మరియు అతని ఆస్తుల గురించిన వార్తలు ఇరాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొత్త నాయకుడిగా అరాఫీ ఎన్నికతో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.