
📌 Key Points
- నటి ఖుషీ ముఖర్జీ, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ డేటింగ్ పుకార్లను ఖండించింది.
- సూర్యకుమార్ గతంలో తన వెంట పడ్డాడని ఖుషీ సంచలన ఆరోపణలు చేసింది.
- తన కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లు కోరడం లేదని స్పష్టం చేసింది.
- ఖుషీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
నటి ఖుషీ ముఖర్జీ, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ డేటింగ్ వార్తలపై ఎట్టకేలకు స్పందించింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఖుషీ, సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన వెంట పడ్డాడని చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివాదంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డేటింగ్‌పై ఖుషీ సంచలన క్లారిటీ
నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ (Khushi Mukherjee)గత కొద్ది కాలంగా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) డేటింగ్‌లో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నటి ఖుషీ ముఖర్జీ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సంచలన ఆరోపణలు చేసింది. “నిజానికి, నేను ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుకోవట్లేదు. చాలా మంది క్రికెటర్లు నాకు ఫ్రెండ్లీ మెసేజ్‌లు పంపుతుంటారు, కాని నేను ఎప్పుడూ ఇది వ్యక్తిగతంగా తీసుకోను. ప్రత్యేకంగా సూర్య కుమార్ యాదవ్ గురించి చెప్పాలంటే, గతంలో అతను నాకు కొన్ని మెసేజ్‌లు పంపించేవాడు.. నా వెంట పడేవాడు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే మేము పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ పూర్తి స్థాయిగా నా కెరీర్, నా ప్రాజెక్ట్స్, సినిమాలపై ఉంది.
నేను ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ను కోరడం లేదు” అని ఖుషీ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాక, ఆమె ఫ్యాన్స్‌కు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. “నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వండి. రూమర్స్ వింటూ మనసు బాధపడకుండా, కేవలం నా సినిమాలు, నా వర్క్ మీదే ఫోకస్ చేయండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ వీడియోకి కింద అభిమానులు మిక్స్ రియాక్షన్స్ ఇచ్చారు. కొంతమంది ఖుషీకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు, “నిజంగా ఏదైనా రొమాంటిక్ లైఫ్ కంటే వ్యక్తిగత గౌరవం, ప్రొఫెషనల్ ఫోకస్ ముఖ్యం” అని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా.. ఖుషీ ముఖర్జీ సినిమాల విషయానికొస్తే.. ‘అంజలి దురై’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు, హిందీ ప్రాజెక్ట్స్‌తో చురుగ్గా ఉంటూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. పలు రియాలిటీ షోస్‌లోనూ పాల్గొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ ఫొటోలతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.
సూర్యకుమార్‌పై నటి ఆరోపణలు
A post shared by E24 Bollywood (@e24official)
వైరల్ అవుతున్న ఖుషీ వీడియో
A post shared by khushi Mukherjee fans (@khushi_mukherjee_fans2021)
ఖుషీ ముఖర్జీ చేసిన ఈ సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. తన వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వమని, సినిమాలపైనే దృష్టి పెట్టమని ఆమె అభిమానులను కోరింది. ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


