
📌 Key Points
- బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జూలై 15న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
- కియారా తమ కూతురికి ‘సారయ సిద్దార్థ్’ అని పేరు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.
- ‘సారయ’ అంటే యువరాణి అని అర్థం. ఈ పేరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
- దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న కియారా, సిద్దార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూలై 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా, తాజాగా తమ కూతురి పేరును వెల్లడించింది. ఆ అందమైన పేరు ‘సారయ సిద్దార్థ్’ అని తెలుపుతూ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ పేరుపై నెటిజన్ల కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
కియారా-సిద్దార్థ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూలై 15న కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లైన రెండేళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు సంతోషపడుతున్నారు. కానీ ఆ పాప ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. గత కొద్ది కాలంగా కియారా, సినిమాలతో పాటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. కూతురిని చూసుకుంటూ మురిసిపోతుంది.
తాజాగా, కియారా తన కూతురికి పేరు పెట్టినట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో సాక్స్‌లు వేసి ఉన్న పాప కాళ్లను కియారా, సిద్దార్థ్ చేతులలో పట్టుకుని పిక్ తీసుకున్నారు. ఈ ఫొటో షేర్ చేస్తూ తన కూతురికి ‘‘సారయ సిద్దార్థ్’’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ఆ పేరుకు అర్థం ఏంటా అని తెగ వెతికేస్తున్నారు. సారయ అంటే యువరాణి అర్థం అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్, సూపర్ పేరు చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. అలాగే పాప ముఖాన్ని కూడా చూపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆడబిడ్డకు సారయ సిద్దార్థ్ అని నామకరణం
కాగా.. కియార, సిద్దార్థ్ దాదాపు మూడేళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తమ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రేమను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. 2023లోఅంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ ప్రకటతో అందరినీ షాక్ గురి చేశారు. ఇక పెళ్లైన రెండేళ్లకు ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఇక పాప పుట్టినప్పటి నుంచి కియారా సినిమాలకు దూరం అయింది. ఈ పాపకు ఒక సంవత్సరం అయ్యాక ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.
నెటిజన్ల ఆసక్తికరమైన కామెంట్స్
A post shared by KIARA (@kiaraaliaadvani)
మొత్తానికి కియారా, సిద్దార్థ్ దంపతులు తమ కూతురి పేరును రివీల్ చేసి అభిమానులను అలరించారు. ‘సారయ సిద్దార్థ్’ అనే పేరుకు మంచి స్పందన లభిస్తోంది. పాప ముఖాన్ని కూడా త్వరలో చూపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


