
టాలీవుడ్‌లో తన అందం, నటనతో మెప్పించిన కియారా అద్వానీ, తాజాగా తన బేబీ బంప్‌తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
Key Points
కియారా అద్వానీ బేబీ బంప్ తో కనిపించింది.
వైట్ డ్రెస్ లో ఆమె అందంగా కనిపించింది.
నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కియారా అద్వానీ యొక్క వైరల్ ఫోటో
‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది.
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు టాక్. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటై 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
నెటిజన్ల ప్రతిస్పందన
అయితే ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఫొటోలో.. కియారా పెద్ద బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఈ చిన్నది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కియారా యొక్క వృత్తి జీవితం
A post shared by iDream Trending News (@idream_trending_news)
కియారా అద్వానీ బేబీ బంప్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి కాబోతున్న కియారా భవిష్యత్తులో మరింత సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.


