
‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ కు సమీపిస్తున్న సమయంలో, హైదరాబాద్ లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ లో ‘రగిలే రగిలే’ అనే కొత్త పాటను పాడి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పాట లిరికల్ వీడియో విడుదలైంది.
Key Points
కింగ్డమ్ సినిమా రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అనిరుద్ లైవ్ పెర్ఫామెన్స్ లో 'రగిలే రగిలే' పాటను పాడాడు.
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన ఈ యాక్షన్ సినిమా శ్రీలంకలో చిత్రీకరించబడింది.
అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ హైలైట్
‘కింగ్డమ్’ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేశారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలానే ‘రగిలే రగిలే’ అని సాగే ఓ పాటని పాడాడు. ఇప్పుడు ఆ గీతానికి సంబంధించిన లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఈ సాంగ్.
‘రగిలే రగిలే’ పాట విడుదల
ఈ మూవీ అంతా అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ యాక్షన్ స్టోరీతో తీశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఆ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు కాగా, సత్యదేవ్ అన్నగా నటించాడు. దాదాపు శ్రీలంకలోనే సినిమా అంతా చిత్రీకరించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రిలీజ్ చేసిన ‘రగిలే రగిలే’ పాట బహుశా క్లైమాక్స్‌లో ఉండొచ్చనిపిస్తోంది.
కింగ్డమ్ సినిమా విశేషాలు
అనిరుధ్ సంగీతం, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటనతో ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలను పెంచుతోంది. ‘రగిలే రగిలే’ పాట విడుదలతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.


