
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా జులై 31న విడుదలైంది. అంచనాలకు మించి, ఈ చిత్రం మొదటి రోజు రూ. 39 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
Key Points
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.
మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 39 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
మూవీ మేకర్స్ ఈ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
విజయ్ దేవరకొండ అభిమానులు ఈ విజయానికి సంబరాలు చేసుకుంటున్నారు.
కింగ్‌డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై 31న థియేటర్స్‌లోకి వచ్చింది. ఎలాగైనా ఈ సారి హిట్ అందుకోవాలన్న కసితో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని చేశాడు. అనుకున్నంటుగానే ‘కింగ్‌డమ్’ బాక్సాఫీసును షేక్ చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 39 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘రాజు రాక అల్లకల్లోలం సృష్టించింది. ‘కింగ్‌డమ్’ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్లు వీకెండ్‌లో మరింత పెరగనున్నాయి. కాగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ యాక్షన్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ‘కింగ్‌డమ్’ ఊహించిన విధంగా ఘన విజయం సాధించడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రూ. 39 కోట్లకు పైగా మొదటి రోజు వసూళ్లు
మూవీ మేకర్స్ సోషల్ మీడియా ప్రకటన
మొత్తంమీద, ‘కింగ్‌డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని సాధించింది. మూవీ టీం ఈ విజయానికి సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.


