|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్‌డమ్: ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధం.. కింగ్‌డమ్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

Published: 07-07-2025, 10:31 AM
కింగ్‌డమ్: ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధం.. కింగ్‌డమ్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా చివరకు రిలీజ్ తేదీని ప్రకటించింది. ఈ సినిమా జులై 31, 2025న థియేటర్లలో విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Key Points

1

విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమా ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధం.

2

జులై 31, 2025న సినిమా థియేటర్లలో విడుదల.

4

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.

కింగ్‌డమ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ (Kingdom). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘కింగ్‌డమ్’ విడుదల తేదీని ప్రకటిస్తూ.. రిలీజ్ డేట్ ప్రోమోను షేర్ చేశారు మూవీ టీమ్. ‘ఏమైనా చేస్తా సర్.. అవసరం అయితే మొత్తం తగలబెట్టేస్తా సర్’ అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్‌తో స్టార్ట్ అయినా ఈ ప్రోమోలో.. డ్యూటీ, జనం కోసం ఏదైనా చేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు.

ఇక ‘ఒక మనిషి.. కోపంతో నిండిన హృదయం.. చాలా దూరం నెట్టివేయబడిన ప్రపంచం.. ఇప్పుడు మారణహోమం సమయం స్టార్ట్.. కింగ్‌డమ్ జులై 31, 2025న సినిమా థియేటర్లలోకి రాబోతుంది’ అంటూ షేర్ చేసిన పోస్టర్‌లో విజయ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లింక్

విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా

సినిమా విడుదల తేదీ మరియు వివరాలు

చివరగా, ‘కింగ్‌డమ్’ సినిమా జులై 31, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.