
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాకు ముందు ‘యుద్ధకాండ’ మరియు ‘దేవర నాయక’ అనే టైటిల్స్‌ను దర్శకుడు పరిశీలించారని తెలిసింది.
Key Points
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాకు 'యుద్ధకాండ' అనే టైటిల్‌ను మొదటగా అనుకున్నారు.
'దేవర నాయక' అనే టైటిల్ కూడా పరిశీలించారు, కానీ ఇతర సినిమాతో టైటిల్ ఘర్షణ ఉండటంతో వదిలేశారు.
చివరకు 'కింగ్డమ్' అనే టైటిల్‌ను ఎంచుకున్నారు, ఇది అన్ని భాషల్లో ఒకేలా ఉంటుంది.
హిందీలో కాపీరైట్ సమస్యల కారణంగా 'సామ్రాజ్యం' అనే టైటిల్‌తో విడుదల చేశారు.
కింగ్డమ్ సినిమాకు మొదటి టైటిల్
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఈ క్రమంలో కింగ్డమ్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్స్ వేరని తెలిపాడు.
మరో ఆలోచనలో ఉన్న టైటిల్
గౌతమ్ మాట్లాడుతూ.. కింగ్డమ్ సినిమాకు మొదట్లో యుద్ధకాండ అనే టైటిల్ అనుకున్నాం. కథలో హీరో శ్రీలంకకి వెళ్లి అక్కడ పోరాటం చేస్తాడు. రామాయణంలో రాముడు శ్రీలంకకు వెళ్లి పోరాటం చేసేది యుద్ధకాండ కాబట్టి ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత దేవర నాయక అనే టైటిల్ కూడా పరిశీలించాం. కానీ ఎన్టీఆర్ గారి దేవర సినిమా రావడంతో ఆ టైటిల్ కూడా విరమించుకున్నాము. సినిమా మొదలయ్యాక కింగ్డమ్ టైటిల్ అనుకున్నాము. ఇదైతే అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉంటుంది, అందరికి కనెక్ట్ అవుతుంది. కానీ హిందీలో ఈ టైటిల్ కాపీ రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంతో హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ తో రిలీజ్ చేసాము అని తెలిపాడు.
చివరికి ఎంచుకున్న టైటిల్
చివరకు అన్ని భాషలకు సరిపోయే ‘కింగ్డమ్’ టైటిల్‌ను ఎంచుకున్నారు. అయితే, హిందీలో కాపీరైట్ సమస్యల కారణంగా ‘సామ్రాజ్యం’ టైటిల్‌తో విడుదల చేయాల్సి వచ్చింది.


