
📌 Key Points
- కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా దీపావళికి విడుదలై మంచి విజయం సాధించింది.
- నిర్మాత గోపాలకృష్ణ ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రమోషన్లలో ‘క’ సీక్వెల్ గురించి మాట్లాడారు.
- 2027లో ‘క’ సీక్వెల్ విడుదలయ్యే అవకాశం ఉందని, దర్శకుడు మారరని నిర్మాత తెలిపారు.
- హీరో విషయంలో మార్పులు ఉంటాయని, కిరణ్ అబ్బవరం స్థానంలో మరొకరు నటించే అవకాశం ఉందని అన్నారు.
‘రాజావారు రాణి గారు’ సినిమాతో వెలుగులోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ నుండి ఆయనను తొలగించే అవకాశం ఉందని నిర్మాత తెలపడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
‘క’ సినిమా విజయం, సీక్వెల్ ప్రకటన
Kiran Abbavaram: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడం అంటే ఎంతో కష్టతరమైన విషయం అని చెప్పాలి అయితే ఎంతో మంది సెలబ్రిటీలో సినిమాలపై ఇష్టంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా కేవలం సినిమాలపై ఆసక్తితో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అందుకున్నారు.
కిరణ్ అబ్బవరం కెరియర్ ను ‘క ‘ సినిమా(Ka Film) పూర్తిగా మలుపు తిప్పిందని చెప్పాలి. 2024 దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో కిరణ్ అబ్బవరం తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. క సినిమాలో కిరణ్ అబ్బవరం జోడిగా నయన్ సారిక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు శ్రీ చక్రస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ నిర్మించగా సుజిత్ సందీప్ ద్వయం దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీక్వెల్‌లో హీరో మార్పుకు కారణం?
ఒక సినిమా మంచి సక్సెస్ అయితే కచ్చితంగా సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. క సినిమా క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి సంబంధించిన హిట్ ఇవ్వడంతో ఈ సినిమా రెండో భాగం ఉంటుందని అభిమానులు కూడా భావించారు. అయితే తాజాగా నిర్మాత గోపాలకృష్ణ నిర్మాణంలో ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ క సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశం ఉంటుందని గోపాలకృష్ణ తెలిపారు. ఈ సినిమా దర్శక నిర్మాతలలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపిన ఈయన హీరో విషయంలో మాత్రం మార్పులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. దర్శకుల నిర్ణయం మేరకు ఈ సినిమాలో హీరో మారే అవకాశం కూడా ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలియజేశారు. ఇలా నిర్మాత గోపాలకృష్ణ హీరో మారే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంతో ఈ సినిమా నుంచి కిరణ్ అబ్బవరంను తప్పిస్తున్నారా? ఆయన స్థానంలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అనే విషయాల పట్ల అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా హీరో మార్పు గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.
నిర్మాత గోపాలకృష్ణ ప్రకటన
మొత్తానికి, కిరణ్ అబ్బవరం ‘క’ సీక్వెల్‌లో ఉండకపోవచ్చనే వార్త ఆయన అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. వేచి చూడండి.


