
📌 Key Points
- సాయి తేజ్, వేద జలంధర్ జంటగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ విడుదల!
- కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేశారు.
- 1996లో కుప్పం దగ్గర తిమ్మరాజుపల్లిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రం.
- టీవీ చుట్టూ తిరిగే ప్రేమ, అసూయ, అనుమానాల కథాంశంతో చిత్రం తెరకెక్కింది.
కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1996 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతోనే అంచనాలు పెంచేసింది. పల్లెటూరి వాతావరణం, ప్రేమకథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
1996 బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి ప్రేమకథ!
Thimmarajupalli TV : సాయి తేజ్, వేద జలంధర్ జంటగా తెరకెక్కిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. KA ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి సుమైర స్టూడియోస్ సహకారంతో వి.మునిరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా నేడు ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్.. పలువురు కీలక పాత్రలు పోషించారు.(Thimmarajupalli TV)
1996 లో కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ప్రతి శివరాత్రికి సతీష్(సాయి తేజ్) అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి టీవీ, VCR రెంట్ కి తీసుకొచ్చి సినిమాలు వేస్తూ ఉంటాడు. అదే ఊళ్ళో ఉన్న రాజప్ప(ప్రదీప్ కొట్టె) చెల్లి శారద(వేద జలంధర్), సతీష్ ప్రేమించుకుంటూ ఉంటారు. రాజప్పకి పెళ్లి అవ్వడంతో తిమ్మరాజుపల్లికి మొదటి టీవీ కొనుక్కొని వస్తాడు. ఆ ఊరి పెద్ద రామచంద్రయ్య(అమ్మ రమేష్) అన్ని తనకంటే ముందే రాజప్ప కొనేస్తున్నాడు అని, పరువు పోతుందని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు.
ఆ ఊళ్ళో ఉండే సిద్దయ్య ఎలాగైనా శారదని పెళ్లి చేసుకోవాలని సతీష్ ని ఎక్కడికక్కడ ఇరికించాలని చూస్తాడు. సతీష్ – శారద విషయం అందరికి తెలియడంతో రాజప్ప – సతీష్ గొడవపడతారు. ఆ తెల్లారే రాజప్ప ఇంట్లో టీవీ పోతుంది. దీంతో ఊరంతా సతీష్ దొంగతనం చేసాడంటారు. అసలు టీవీ ఎవరు దొంగతనం చేసారు? సతీష్ మీద పడ్డ నిందని ఎలా పోగొట్టుకుంటాడు? సతీష్ – శారద ప్రేమకథ ఏమైంది? సిద్దయ్య వల్ల సతీష్ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? ఊరిపెద్ద రామచంద్రయ్య ఏం చేసాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
కిరణ్ అబ్బవరం కొత్త ట్యాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారి ఆల్మోస్ట్ 40 మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో పరిచయం చేసాడు. టీవీ వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేది అనే కథాంశంతో టీజర్, ట్రైలర్స్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పారు. 1996లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథని తెరకెక్కించారు.
టీవీ దొంగతనం.. సతీష్ పై నిందలు!
ఫస్ట్ హాఫ్ అంతా అప్పట్లో టీవీ ఉంటే సరదా ఎలా ఉండేది, సతీష్ – శారదల ప్రేమకథ, రాజప్ప – అతని భార్య ప్రేమకథలతో క్యూట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఊరి పెద్ద అసూయ పడటం, రాజప్ప – సతీష్ గొడవలతో ఏం అవుతుంది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో తను దొంగ కాదు అని సతీష్ ఎలా నిరూపించుకున్నాడు, ఎవరు టీవీ దింగతనం చేసారు అని సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ క్యూట్ ప్రేమకథలతో సింపుల్ గానే సాగుతుంది. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం సతీష్ దొంగ కాదు అని ఎలా నిరుపించుకున్నాడు అనేది సీరియస్ గా సాగుతుంది అనుకుంటే మధ్యలో ప్రేమ ఎమోషన్ తో కాసేపు సాగదీశారు. సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉంది. ఆ దొంగ ఎవరు అనేది క్లైమాక్స్ లో సతీష్ ఎలా కనిపెట్టాడు అనేది సింపుల్ గానే చూపించేసారు. అయితే దొంగ ఎవరు అనేది మాత్రం అస్సలు ఊహించలేరు.
క్లైమాక్స్ కూడా కాస్త ఎమోషన్ ని వర్కౌట్ చేసారు. దొంగ అతనా, ఇతనా అనే అనుమానాలు రేకెత్తించే సంఘర్షణ మాత్రం బాగా వర్కౌట్ చేసారు. హీరో – హీరోయిన్ జంటతో పాటు రాజప్ప – ఎల్లమ్మ జంట కథ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. క్యూట్ లవ్ స్టోరీ, కామెడీ సినిమా అనుకోని వెళ్తే సస్పెన్స్ జానర్ తో ఆశ్చర్యపరిచారు. అందరూ కొత్తవాళ్ళైనా కిరణ్ అబ్బవరం పర్యవేక్షణలో బాగానే తెరకెక్కించారు ఈ సినిమాని.
ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ వేద జలంధర్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. ప్రదీప్ కొట్టె సినిమాకు హైలెట్. సెకండ్ హీరోలా తన పర్ఫార్మెన్స్ తో కూడా అదరగొట్టాడు. స్వాతి కరిమిరెడ్డి కూడా క్యూట్ గా కనిపిస్తూనే చక్కని నటనతో మెప్పించింది. అమ్మ రమేష్, మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
కిరణ్ అబ్బవరం నిర్మాతగా కొత్త టాలెంట్!
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. పోరాటాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. 1996 విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికి తగ్గట్టు లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు. కొత్త కథని రొటీన్ లవ్ స్టోరీతో ఆసక్తికర స్క్రీన్ ప్లే తో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టి రిచ్ విజువల్స్ తెప్పించాడు కిరణ్ అబ్బవరం.
మొత్తంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు టీవీ దొంగతనం అనే సస్పెన్స్ తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందింది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అభినందనీయం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


