
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా వారు తమ కుమార్తెకు ‘ఇవారా విపుల రాహుల్’ అని నామకరణం చేశారని ప్రకటించారు. ఈ పేరు వెనుక ఉన్న కథ ఇంతే..
Key Points
కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల జన్మించింది.
కుమార్తెకు 'ఇవారా విపుల రాహుల్' అని నామకరణం చేశారు.
ఇవారా అంటే భగవంతుని బహుమతి అని అర్థం, విపుల అతియా శెట్టి అమ్మమ్మ పేరు.
పేరు ఎంపిక వెనుక ఆసక్తికరమైన కథ ఉందని కేఎల్ రాహుల్ వెల్లడించారు.
ఇవారా విపుల రాహుల్: కుమార్తె పేరు వెనుక కథ
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండ్ అతియా శెట్టి 2023 జనవరి 23న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె.ఇక రాహుల్- అతియా శెట్టి దంపతులకు 2025 మార్చి 24న వారికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. వీరు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. అయితే తాజాగా తాజాగా తమ కుమార్తెకు నామకరణం చేశారు. కాగా ఈ పేరు పెట్టడం వెనక స్టోరీ ఏంటో ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు.
క్రికెటర్ కేఎల్ రాహుల్ అండ్ నటి అతియా శెట్టి దంపతుల కుమార్తె పేరు ‘ఇవారా విపుల రాహుల్’ అని ప్రకటించారు. ఇవారా అంటే భగవంతుని బహుమతి అని అర్థం, విపుల అనేది అతియా శెట్టి అమ్మమ్మ పేరు అండ్ రాహుల్ అనేది ఆమె తండ్రి పేరు.
కేఎల్ రాహుల్ పేరు ఎంపిక గురించి వెల్లడి
నటుడు అతియా శెట్టి, క్రికెటర్ కెఎల్ రాహుల్ తమ కుమార్తెకు ఎవారా అని పేరు పెట్టిన దాని వెనుక ఉన్న కథ చాలా మనోహరంగా ఉందని చెప్పుకొచ్చారు. కెఎల్ రాహుల్ ఇలా పంచుకున్నారు.. ఇది నేను ఇప్పుడే అనుకోకుండా కనుగొన్న విషయం. మేము చాలా పుస్తకాలు చదివామని అన్నారు. కొంతమంది సన్నిహితులు పంపిన రెండు పేర్ల పుస్తకాలను మేము చదివామని చెప్పుకొచ్చారు.
అతియా శెట్టి కుటుంబం ఆనందం
అలాగే అప్పుడు నేను ఎక్కడో అనుకోకుండా ఈ పేరును నేను గూగుల్ చేసి దాని అర్థం ఏమిటో సెర్చ్ చేశానని.. నేను దానిని చూసిన నిమిషం నుంచే నాకు అది చాలా నచ్చిందని వెల్లడించారు. అతియాను ఒప్పించడానికి నాకు కొంచెం సమయం పట్టిందని. కానీ ఆమె తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు దానిని ఇష్టపడ్డారు. అప్పుడు ఆమె నెమ్మదిగా ఆ పేరుతో ప్రేమలో పడిందని క్రికెటర్ కేఎల్ రాహుల్ రాసుకొచ్చారు.
ఇలా కేఎల్ రాహుల్ తమ కుమార్తె పేరు ఎంపిక వెనుక ఉన్న కథను పంచుకున్నారు. ఈ అరుదైన పేరు వారి కుటుంబానికి మరింత అందాన్ని చేకూర్చుతుంది.


