|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రంగస్థలం’లో రంగమ్మత్త: ఆ స్టార్ హీరోయిన్ వదులుకుంటే, అనసూయ ఎలా కెరీర్ టర్నింగ్ పొందింది? ఆమె రియాక్షన్!

Published: 29-12-2025, 10:25 PM
రంగస్థలం'లో రంగమ్మత్త: ఆ స్టార్ హీరోయిన్ వదులుకుంటే, అనసూయ ఎలా కెరీర్ టర్నింగ్ పొందింది? ఆమె రియాక్షన్!
  • అనసూయకు ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
  • దర్శకుడు సుకుమార్ ఈ పాత్ర కోసం మొదట స్టార్ హీరోయిన్ రాశిని సంప్రదించారు.
  • రాశికి రంగమ్మత్త పాత్ర సరిపడదని భావించి ఆ అవకాశాన్ని వదులుకుంది.
  • రాశి తిరస్కరణ అనసూయకు రంగమ్మత్తగా నటించే అవకాశం కల్పించి పెద్ద బ్రేక్ ఇచ్చింది.

అనసూయ కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన రంగస్థలం `రంగమ్మత్త` పాత్ర వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. మొదట స్టార్ హీరోయిన్ రాశిని సంప్రదించగా, ఆమె ఆ పాత్ర తనకు సరిపడదని వదులుకుంది. రాశి తిరస్కరణతో అనసూయకు వచ్చిన ఈ అద్భుత అవకాశం ఆమె కెరీర్‌ను ఎలా మార్చిందో తెలుసుకుందాం.

అనసూయ కెరీర్‌ను మార్చేసిన ‘రంగస్థలం’ రంగమ్మత్త!

యాంకర్, నటి అనసూయ ఇప్పుడు సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది.  వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. గతేడాది వరకు విజయ్‌ దేవరకొండ విషయంలో వివాదంలో నిలిచింది. అంతకు ముందు ఆంటీ అని పిలిచిన అభిమానులను ఆటకట్టించే విషయంలో వివాదంలో నిలిచింది. ఇటీవల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ శివాజీ విషయంలో వివాదంలో నిలుస్తోంది. హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ చేసిన కామెంట్లకి కౌంటర్‌ ఇస్తూ ఆమె సరికొత్త రచ్చకి తెరలేపింది.

అనసూయ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. శివాజీతోపాటు ఆమె చుట్టూ గట్టిగానే చర్చ నడుస్తోన్న నేపథ్యంలో తాజాగా అనసూయకి సంబంధించిన మరో విషయం ఆసక్తికరంగా మారింది. అనసూయ నటిగా బ్రేక్‌ రావడానికి కారణం ఓ స్టార్‌ హీరోయిన్‌ అట. ఆమె నో చెప్పడంలో వల్లే అనసూయ `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్ర చేయాల్సి వచ్చింది, ఈ పాత్రతోనే అనసూయ బిగ్‌ బ్రేక్‌ అందుకున్న విషయం తెలిసిందే.

ఆ పాత్రకు సుకుమార్ మొదట ఎవరిని అనుకున్నారంటే..

రామ్‌ చరణ్‌, సమంత కలిసి నటించిన `రంగస్థలం` చిత్రానికి సుకుమార్‌ దర్శకుడు. ఇందులో అనసూయ రంగమ్మత్త పాత్రని పోషించింది. ఈమెని చరణ్‌ అత్త అని పిలుస్తుంటాడు. ఈమె భర్త విదేశాలకు వెళితే ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో చరణ్‌కి సపోర్ట్ గా ఉంటుంది. ఈ పాత్రలో అనసూయ ఇరగదీసింది. తన కెరీర్‌లోనే బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. గెటప్‌, ఆమె స్లాంగ్‌ బాగా కుదిరాయి. చాలా నేచురల్‌గా చేసి మెప్పించింది అనసూయ. అయితే ఈ పాత్రకి దర్శకుడు సుకుమార్‌ మొదట అనుకున్నది అనసూయ కాదు.

`రంగస్థలం` సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం మొదట దర్శకుడు సుకుమార్‌ అనుకున్నది స్టార్‌ హీరోయిన్‌ రాశిని. ఆమె ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసింది. బాల నటి నుంచి కెరీర్‌ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి, బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేసి విజయాలు అందుకుంది. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చింది. పెళ్లి తర్వాత పిల్లల కోసం ఆమె గ్యాప్‌ తీసుకుంది. ఈ మధ్య మళ్లీ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు టీవీ సీరియల్స్ లోనూ నటిస్తోంది. తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అవకాశాల కోసం వెయిట్‌ చేస్తోంది.

రాశి పాత్రను వదులుకున్నది ఎందుకంటే? ఆమె రియాక్షన్!

ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్‌ వర్ష నిర్వహిస్తున్న `కిసిక్‌ టాక్స్` లో   రాశి మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకుంది. `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని మొదట తననే అడిగారని తెలిపింది రాశి. కానీ ఆ పాత్ర తనకు సెట్‌ కాదని వదిలేసిందట. తన ఇమేజ్‌కి సూట్‌ అయ్యే పాత్ర కాదని, అలాంటి పాత్ర చేస్తే ఇబ్బందిగా ఉంటుందని భావించి నో చెప్పిందట. దీంతో ఈ పాత్ర అనసూయకి వెళ్లింది. ఆ తర్వాత సినిమా చూశానని, అనసూయ బాగా చేసిందని తెలిపింది రాశి. అయితే ఈ పాత్రని మిస్‌ చేసుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని, తనకు సెట్‌ కాదనే వదిలేసుకున్నా, అందులో రిగ్రెట్‌ ఏం లేదని చెప్పింది రాశి. ప్రస్తుతం ఈ విషయంలో వైరల్‌గా మారింది.

అనసూయకి ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. గతంలో నటించిన రెండు సినిమాలు విడుదలకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో తెలియదు, ఇటీవలే కొత్త సినిమా స్టార్ట్ చేసింది. ఇందులో రేణు దేశాయ్‌ కూడా నటిస్తుండటం విశేషం. మరోవైపు అడపాదపా పలు టీవీ షోస్‌లో మెరుస్తోంది అనసూయ. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

మొత్తానికి, రాశి ఆ పాత్రను వదులుకోవడం అనసూయకు ఒక పెద్ద బ్రేక్‌గా మారింది. ఈ అనూహ్య మలుపుతోనే అనసూయ `రంగస్థలం`లో రంగమ్మత్తగా మెరిసి తన నటనకు ప్రశంసలు అందుకుంది. సినిమా అవకాశాల్లో అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో దీని ద్వారా స్పష్టమవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.