|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్లీంకార ఫేస్ రివీల్: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే! ఫోటో వైరల్!!

Published: 11-01-2026, 4:00 AM
క్లీంకార ఫేస్ రివీల్: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే! ఫోటో వైరల్!!
  • రామ్ చరణ్ ఫోన్ వాల్‌పేపర్‌పై క్లీంకార ఫోటో వైరల్
  • వైట్ గౌన్‌లో తండ్రి మెడపై క్యూట్‌గా క్లీంకార మెరుపులు
  • సూరత్‌లో ISPL ఓపెనింగ్ ఈవెంట్‌లో చరణ్ సందడి
  • క్లీంకార.. రామ్ చరణ్ అన్నయ్యలా ఉందంటున్న మెగా ఫ్యాన్స్

మెగా అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లీంకార ఫేస్ రివీల్ అయింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

రామ్ చరణ్ ఫోన్‌లో క్లీంకార దర్శనం!

టాలీవుడ్ స్టార్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఊపాసనల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్లు లవ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా మ్యారేజ్ చేసుకున్న చరణ్ – ఉపాసనకు పదేళ్ల తర్వాత క్లీంకార (Klinkara Konidela) జన్మించింది. మెగా వారసురాలు వచ్చిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీ రేంజే మారిపోయింది. అయితే క్లీంకార పుట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ చిన్నారి ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఈ ప్రిన్సెస్ ఫేస్‌ను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో క్లీంకార ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా రామ్ చరణ్ సూరత్ లో జరుగుతున్న ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్‌కి అటెంట్ అయ్యాడు. అక్కడ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను చరణ్ మీట్ అయ్యాడు. ఇక ఆ సమయంలో కెమెరాలకు పోజులు ఇచ్చాడు. అప్పుడే చరణ్ ఫోన్ వాల్ పేపర్ కెమెరా కంట పడింది. అందులో క్లీంకార తన తండ్రి చరణ్ మెడపై కూర్చొని క్యూట్‌గా స్మైల్ చేస్తుంది.

వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో

వైట్ కలర్ గౌన్‌లో తండ్రి మెడపై కూర్చొని క్లీంకార.. అతని హెయిర్‌తో ఆడుకుంటూ ఉండగా.. చరణ్ కూడా నవ్వుతున్నాడు. అయితే ఫొటో బ్లర్‌గా ఉన్నా కూడా క్లీంకార చాలా ముద్దుగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సేమ్ క్లీంకార రామ్ చరణ్ అన్నయ్య లాగే ఉందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్లీంకార ఫొటోను చూసేయండి.

మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!

A post shared by 𝐑𝐀𝐌 𝐂𝐇𝐀𝐑𝐀𝐍 (@only_alwaysramcharan)

క్లీంకార ఫోటోతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువెలుస్తోంది. చిన్నారి ఫేస్ రివీల్ కావడంతో అంతా సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.