
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కొదమ సింహం’ సరికొత్త హంగులతో రీరిలీజ్‌కు సిద్ధమైంది. 1990లో విడుదలైన ఈ సినిమాను 4K విజువల్స్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ఈనెల 21న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
Key Points
మెగాస్టార్ చిరంజీవి 'కొదమ సింహం' ఈనెల 21న 4K విజువల్స్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో రీరిలీజ్.
కౌబాయ్ పాత్రలో చిరంజీవి నటించిన తొలి పూర్తి నిడివి చిత్రం ఇదే.
'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ'గా ఆంగ్లంలోకి అనువదించిన తొలి దక్షిణ భారత చిత్రం ఇది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.
కొదమ సింహం రీరిలీజ్ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం రీరిలీజ్ కానుంది. 1990లో విడుదలైన ఈ చిత్రంలో కౌబాయ్‌గా చిరు కనిపించారు. ఈనెల 21న సరికొత్త హంగులతో పాటు 4కే విజువల్స్‌తో రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను షేర్ చేశారు. దర్శకుడు కె.మురళీమోహనరావు తెరెక్కించిన ఈ చిత్రంలో సోనమ్, వాణీ విశ్వనాథ్,రాధ,సుజాత,అన్నపూర్ణ నటించగా మోహన్‌బాబు ముఖ్యపాత్ర పోషించారు. ఈ మూవీని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. ఇప్పుడు కూడా ఆయనే ఈ చిత్రాన్ని 5.1 డిజిటల్ సౌండింగ్‌తో చేయించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.
ఇది ‘హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణభారత చలనచిత్రంగా కొదమసింహం రికార్డ్ క్రియేట్ చేసింది. కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఇందులోని పాటలు ‘జపం జపం జపం, కొంగ జపం’, ‘చక్కిలిగింతల రాగం’, ‘గుం గుమాయించు కొంచెం’ బాగా పాపులర్ అయ్యాయి.
సినిమా విశేషాలు, రికార్డులు
‘కొదమ సింహం’ ట్రైలర్ హైలైట్స్
33 సంవత్సరాల తర్వాత ‘కొదమ సింహం’ రీరిలీజ్ అవ్వడం చిరంజీవి అభిమానులకు పండగే. మెరుగైన నాణ్యతతో మళ్లీ ఈ సినిమాను పెద్ద తెరపై చూసే అవకాశం రావడం వారికి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.


