
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదవ్యాస్ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత కె అచ్చిరెడ్డి, కొరియా నుంచి హీరోయిన్, మంగోలియా నుంచి విలన్ ఎంపికయ్యారని వెల్లడించారు.
Key Points
వేదవ్యాస్ సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖుల పాల్గొనడం
కొరియా నుండి హీరోయిన్, మంగోలియా నుండి విలన్ ఎంపిక
సంగీతం పరంగా ఒక సంవత్సరం పని
వేదవ్యాస్ సినిమా ప్రారంభోత్సవం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా వేదవ్యాస్. ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నిర్మాతగా పొలిటిషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వ్యవహరించారు.
రీసెంట్‌గా ఆగస్ట్ 28న అన్నపూర్ణ స్టూడియోలో వేదవ్యాస్ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి , దిల్ రాజు, వీవీ వినాయక్, అలీ, మురళీ మోహన్ , నిర్మాత కె అచ్చిరెడ్డి, హీరోయిన్ జున్ హ్యూన్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మా కె అచ్చిరెడ్డి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
నిర్మాత కె అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ రోజు మేము పిలవగానే మా మీద అభిమానంతో మా వేదవ్యాస్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, వినాయక్ గారు, అనిల్ రావిపూడి గారు, జెమినీ కిరణ్ గారు, ఇతర అతిథులు అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.
నటీనటుల ఎంపిక విశేషాలు
“దర్శకుడిగా కృష్ణారెడ్డి గారు సృష్టించిన చరిత్ర మీకు తెలిసిందే. ఆయన ఇంకా మంచి మూవీస్ చేయాలనే తపనతో ఒక స్క్రిప్ట్ చేసుకుని పరిపూర్ణంగా ఆ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసేవాళ్లని చూస్తున్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద అభిమానం, ఆప్యాయత, ప్రేమతో ముందుకొచ్చారు. ప్రతాప్ రెడ్డిగారు ముందుకొచ్చి మమ్మల్ని నడిపించడం ఎంతో స్ఫూర్తిని, శక్తినీ ఇచ్చింది” అని అచ్చిరెడ్డి చెప్పారు.
” వేదవ్యాస్ అనేది కృష్ణారెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సంవత్సరాల తరబడీ ఎంతో శ్రమించి ఆయన ఇష్టంతో తయారుచేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఈ మూవీకి పరిపూర్ణత వచ్చేందుకు ఎలాంటి నటీనటులు ఉండాలో అలాంటి వారినే ఎంచుకున్నారు. కొరియా వెళ్లి హీరోయిన్ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే జున్ హ్యున్ జీని సెలెక్ట్ చేసుకున్నాం” అని అచ్చిరెడ్డి తెలిపారు.
” సాయికుమార్ , మురళీ మోహన్ గారు వంటి ఆర్టిస్టులను కూడా అలాగే పాత్రలకు సరిగ్గా సరిపోయేలా తీసుకున్నారు కృష్ణారెడ్డి గారు. హీరో ఎవరు అనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తాం. విలన్‌గా చాలా సెర్చ్ చేసి మంగోలియన్ ఆర్టిస్ట్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటారు” అని అచ్చిరెడ్డి వెల్లడించారు.
హీరో ఎవరో త్వరలోనే వెల్లడి
“సంగీతం పరంగా ఏడాదిగా వర్క్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఫుల్ ఫ్లెడ్జ్‌గా మ్యూజిక్ ఆల్బం రెడీ చేశారు కృష్ణారెడ్డి గారు. గతంలో మేము అలాగే ఆల్బమ్ రెడీ చేసి షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. చాలా రోజుల తర్వాత ఈ వేదవ్యాస్ చిత్రంతో మళ్లీ అలా ఆల్బమ్ చేతిలో ఉంచుకుని షూటింగ్‌కు వెళ్తున్నాం” అని నిర్మాత అచ్చిరెడ్డి పేర్కొన్నారు.
“ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి మెసేజ్‌తో కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి చిత్రం వేదవ్యాస్ అవుతుంది” అని ప్రొడ్యూసర్ కె అచ్చిరెడ్డి తన స్పీచ్ ముగించారు.
వేదవ్యాస్ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. కొత్త తారాగణం, ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.


