
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో బయట కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆయన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి ఆందోళనకర వార్తలు.
తాజా ఫోటోలో ఆయన కాలుకు కట్టు కనిపించడం ఆందోళన కలిగించింది.
నెటిజన్లు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాత బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావును కలిసి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కోటా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి
తెలుగు చిత్ర పరిశ్రమలో నటన, ప్రతిభతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఒకరు. రకరకాల పాత్రల్లో నటిస్తూ.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఏజ్ పెరగడంతో చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఇక ఇటీవల ఓ టీవీ పోగ్రామ్‌లో కనిపించి ప్రేక్షకులకు మరోసారి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో కోటా శ్రీనివాసరావు బయటకానీ, మీడియాలో కానీ పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ రోజు నిర్మాత బండ్ల గణేష్ నటుడు కోటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు కాలుకు కట్లు కట్టి ఉంది. అంతే కాకుండా.. ఒక కాలు బాగా పాడై ఉండటంతో.. కోటకు ఏమైంది ఇలా పాడైపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
నెటిజన్ల ఆందోళన
కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి సమాచారం తెలియక ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది.


