
ప్రముఖ నటుడు మరియు మాజీ బీజేపీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు అనూహ్యంగా మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచింది. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Key Points
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి.
పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
కోట శ్రీనివాసరావు సినిమా, రాజకీయాల్లో చేసిన కృషిని గుర్తుంచుకుందాం.
కోట శ్రీనివాసరావు మృతి
టాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పని చేయడంతో రాజకీయ నేతలు సైతం ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) కోట మృతిపై సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో “ప్రముఖ నటుడు, మాజీ బీజేపీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. తెలుగు సినిమాలో ఒక మహోన్నత వ్యక్తి, ఆయన తన శక్తివంతమైన నటన, పాత్రలో అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ తో ప్రేక్షకులను ఆకర్షించారు. ఆయన ప్రజా జీవితానికి కూడా చురుకుగా దోహదపడ్డారు. 90ల చివరలో బీజేపీలో చేరి.. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినిమా, రాజకీయాల్లో ఆయన చేసిన కృషిని గుర్తుంచుకుంటాము. ఈ విషాద సమయంలో కోట కుటుంబానికి నా సంతాపం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.
కిషన్ రెడ్డి సంతాపం
సినిమా, రాజకీయ జీవితం
కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు సినిమా రంగం, రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.


