|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 50 లక్షల సినిమాకి 120 కోట్ల వసూళ్లు! ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలిస్తే అవాక్కవుతారు!

Published: 03-03-2026, 11:35 AM
షాకింగ్: 50 లక్షల సినిమాకి 120 కోట్ల వసూళ్లు! ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలిస్తే అవాక్కవుతారు!
  • 50 లక్షల బడ్జెట్‌తో, ఏకంగా 120 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘కృష్ణ సదా సహాయతే’ మూవీ సంచలనం!
  • గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్!
  • సాధారణ ఆటో డ్రైవర్ కథతో కృష్ణ అనుగ్రహం..భావోద్వేగాల కలయికతో అద్భుత విజయం!
  • ఈ నెల 6 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘కృష్ణ సదా సహాయతే’ మూవీ!

గుజరాతీ సినిమా పరిశ్రమలో ఒక సంచలనం నమోదైంది! కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

50 లక్షల్లో సినిమా.. 120 కోట్లు కొల్లగొట్టిన రికార్డు!

తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించి భారీ వసూళ్లు సాధించడం ఈ మధ్య కాలంలో సాధారణంగా మారింది. ఎక్కువగా మలయాళ చిత్రసీమలో ఈ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు పాటు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. ఇక విచిత్రం ఏంటంటే.. ఈమధ్య కాలంలో గుజరాతీ సినిమా ఒకటి ఇలాంటి విజయన్నే సాధించింది. ఆ సినిమా ఏదో కాదు..లాలో కృష్ణ సదా సహాయతే.

గుజరాతీలో రూపొందిన ఈ సినిమా క్రితం ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదలైంది. రీవా రిచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అంకిత్ సఖియా దర్శకత్వం వహించగా, స్మిత్ జె సంగీతాన్ని అందించారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో విశేష విజయాన్ని అందుకుంది.

గుజరాతీ సినిమా సత్తా చాటింది.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

కృష్ణ సదా సహాయతే’ రికార్డు క్రియేట్ చేసింది. అంకిత్ సాకియా దర్శకత్వంలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక సినిమాను కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తీశారు. అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతకు ఏకంగా 200 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.మొత్తం 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారిగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా ఇదే. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు లేకుండా, భారీ గ్రాఫిక్స్ లేకుండానే విజయాన్ని సాధించడం అద్బుతమనే చెప్పాలి.

ఈ చిత్రం ఒక సాధారణ ఆటో డ్రైవర్ జీవితాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించబడింది. కృష్ణుడి అనుగ్రహం కారణంగా అతని జీవితం ఎలా ప్రభావితమైందనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. చాలా సింపుల్ స్టోరీకి ఎమోషనల్ ఎలిమెంట్స్ జోడించి.. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు.

సాధారణ కథతో సంచలన విజయం..కృష్ణ అనుగ్రహమే కారణమా?

థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ పైకి వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ SonyLIV ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

గుజరాతీ సినిమా ‘కృష్ణ సదా సహాయతే’ సృష్టించిన సంచలనం ఇది. తక్కువ బడ్జెట్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.