
📌 Key Points
- కృతి శెట్టి హోటల్‌లో నిజమైన దెయ్యాన్ని చూశానని వెల్లడించింది.
- లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి ఆత్మ మాయం అయిందని చెప్పింది.
- “వా వాతియార్” సినిమా షూటింగ్ సమయంలో ఈ భయానక సంఘటన ఎదురైంది.
- ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
స్టార్ బ్యూటీ కృతి శెట్టి ఇటీవల తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకుంది. సినిమా షూటింగ్ సమయంలో హోటల్‌లో నిజమైన దెయ్యాన్ని చూశానని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ సంఘటన ఆమెను తీవ్రంగా వణికించిందని తెలిపింది.
కృతి శెట్టికి ఎదురైన భయానక అనుభవం
Krithi Shetty: దేవుళ్ళు, దెయ్యాలు.. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఈ టాపిక్ లను పెద్దగా పాటించుకోరు. మాట్లాడటానికి ఇష్టపడరు కూడా. ఒకవేళ ఏవైనా చెప్తే వారిని వింతగా చూస్తారు. నవ్వుకుంటారు. ఈకాలంలొ కూడా అలాంటివి నమ్ముతారా అంటూ కొట్టిపారేస్తారు. కానీ, స్టార్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) మాత్రం నిజమైన దెయ్యాన్ని చూశానని చెప్తోంది. అలా చూడగానే ఒంట్లో వణుకు పుట్టింది అంటూ తనకు ఎదురైన భయానకమైన సంఘటనను చెప్పింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా వా వాతియార్. తెలుగులో ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల కానుంది.
Yamini Bhaskar: ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. ఇబ్బందులు పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్
“వా వాతియార్” షూటింగ్ సమయంలో ఘటన
టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నిజమైన దెయ్యం కనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. “వా వాతియారు సినిమాలో నేను ఆత్మలతో మాట్లాడే జీపీసీ పాత్ర చేశాను. అయితే, షూటింగ్ కోసం నేను, అమ్మ ఒక హోటల్ లో ఉన్నాము. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో నాకు ఒక ఆత్మ కనిపించింది. భయమేసింది. మెల్లిగా వెళ్లి లైట్ వేశాను. పెద్ద శబ్దం వచ్చింది. ఆ ఆత్మ కూడా మాయం అయ్యింది. ఆరోజు నాతోపాటు మా అమ్మ కూడా ఉంది కాబట్టి బతికిపోయాను. లేదంటే, నా గుండె ఆగిపోయేది” అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.
కృతి వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన
దీంతో ఈ అమ్మడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కృతి మాటలు విన్న నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కృతిలో ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు. సినిమాలో ఆత్మలతో మాట్లాడే పాత్ర చేశారు కాబట్టి. అలా అనిపించింది. కానీ, నిజంగా దెయ్యాలు, భూతాలు ఉండవు. కాస్త రియాలిటీలోకి రండి మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కృతి శెట్టి దెయ్యం చూశానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమెను నమ్ముతుంటే, మరికొందరు నిజంగా అలాంటివి ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


