|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన! నా కెరీర్ లో ఇదే హాటెస్ట్ పాత్ర.. దుమ్మురేపే కామెంట్స్!

Published: 31-03-2026, 4:05 AM
ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన! నా కెరీర్ లో ఇదే హాటెస్ట్ పాత్ర.. దుమ్మురేపే కామెంట్స్!
  • కృతి సనన్ ‘కాక్ టెయిల్ 2’ సినిమాలో హాటెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు వెల్లడి
  • రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది
  • సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని నటులు ఒత్తిళ్లను ఎదుర్కొంటారని కృతి సనన్ అన్నారు
  • విమర్శలను అధిగమిస్తేనే ఉన్నత స్థానానికి చేరుకోగలమని కృతి సనన్ సూచించారు

కృతి సనన్ తన రాబోయే చిత్రం ‘కాక్ టెయిల్ 2’ లో తన పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది తన కెరీర్ లోనే హాటెస్ట్ మరియు బోల్డెస్ట్ పాత్ర అని ఆమె పేర్కొంది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది.

కాక్ టెయిల్ 2 లో కృతి సనన్ హాట్ రోల్

Kriti Sanon:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Rauth) దర్శకత్వంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆది పురుష్’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి సనన్ . తొలిసారి మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర పోషించింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కృతి సనన్.. తాజాగా ‘కాక్ టెయిల్ 2’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. జూన్ 19వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని తన పాత్ర పై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కృతి సనన్.

కృతి సనన్ మాట్లాడుతూ..” మోడ్రన్ లవ్ , ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో నా పాత్ర నా కెరియర్లో ఇప్పటివరకు పోషించని విధంగా చాలా హాటెస్ట్ అండ్ బోల్డ్ గా సాగుతుంది. ముఖ్యంగా నా పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయం” అంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది కృతి సనన్. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైగా ఇందులో రష్మిక మందన్న, కృతి పార్టనర్స్ గా కనిపించబోతుండగా.. ఈ కాంబో కథనాన్ని మరింత ఆసక్తికరంగా సాగేలా చేస్తుందని కృతి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సినిమాలోని తన పాత్ర పై, కథనంపై కృతి సనన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ లో కృతి సనన్ కామెంట్స్

విమర్శలపై కృతి సనన్ స్పందన

ఈ ఇంటర్వ్యూలో భాగంగానే కృతి సనన్ మాట్లాడుతూ.. “ఈ రంగంలో ప్రతి నటుడు కూడా ఒత్తిళ్ళను ఎదుర్కొంటాడు. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారు మరింత ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరియర్ తొలినాళ్లల్లో నాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. నువ్వు నవ్వినప్పుడు నీ చిగుళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి అని అనేవారు. ఇలా ఎన్నో మాటలు విన్నాను. ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్మడమే మీ సూపర్ పవర్.. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ విమర్శలను అధిగమించినప్పుడే మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలబెట్టుకోగలుగుతారు. అందుకే మనసు మాట వింటూ కష్టపడుతూ పనిచేసుకోవాలి” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది కృతి సనన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మొత్తానికి కృతి సనన్ తన సినిమా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్ళను, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.